For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బరువు తగ్గడానికి బేసిక్ అండ్ క్విక్ వెయిట్ లాస్ టిప్స్

బరువు తగ్గడానికి బేసిక్ అండ్ క్విక్ వెయిట్ లాస్ టిప్స్

|

స్థూలకాయం అనగా అధిక బరువు కలిగి ఉండడం, ఈ సమస్య ఈ కాలంలో వయస్సులో సంబంధం లేకుండా అందరినీ ఇబ్బందిపెడుతుంది. అయితే ప్రత్యేకంగా కార్పొటేట్ ఉద్యోగులకు ఎక్కువగా స్థూలకాయం వస్తుంది. ఎందుకంటే, వారి ఉరుకుల పరుగుల జీవితంలో, పని ఒత్తిడి , సరైన ఆహారనియమాలు పాటించడం మానేసి, ఇష్టం వచ్చినట్లు ఏది కావాలంటే అది, ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలంటే, అక్కడ, జంక్ ఫుడ్ తింటూ, ఏవిధమైన వ్యాయామం చేయకపోవడం వల్ల వారి ఆహారం పై నియత్రణ లేకపోవడం వల్ల దీనికి గురి అవుతున్నారు.

ఆకలిని కంట్రోల్ చేసి,బరువు తగ్గించే 20 సూపర్ ఫుడ్స్:క్లిక్ చేయండి

మరి మనం ఇంట్లో కూర్చునే అధిక బరువును ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాము....

బరువు తగ్గాలనుకొనేవారు తినకూడని ఆహారాలు: క్లిక్ చేయండి

వాకింగ్:

వాకింగ్:

రోజూ కనీసం 30 నిముషాలైన వాకింగ్ చేయడం ఎంతో మంచిది, దీని వల్ల మీరు ఆరోజు తీసుకున్న క్యాలరీలు తగ్గుతాయి.

గ్రీన్ టీ :

గ్రీన్ టీ :

ద్రవ రూపంలో ఉన్నవి ఎక్కువగా తీసుకోవాలి, ప్రత్యేకంగా గ్రీన్ టీ రోజుకు కనీసం 2 సార్లు అయినా తీసుకుంటే, ఎంతో మంచిది.ఇది మీ శరీరంలోని కొవ్వు పదార్థాలను కరిగిస్తుంది.

మాంసాహారం:

మాంసాహారం:

ఒకవేళ మీకు మాంసాహారం అంటే ఇష్టం ఉన్ననూ, ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదు, దాని వల్ల మీ శరీరంలో కొవ్వు పెరిగే ప్రమాదం ఎక్కువ.

డైరీ ప్రొడక్టస్:

డైరీ ప్రొడక్టస్:

మీ రోజు వారి ఆహారంలో కొవ్వు శాతం తక్కువగా ఉన్న ఆహారం అంటే పాలు, మజ్జిగ ఎలా ఎక్కువగా తీసుకుంటే ఎంతో మంచిది.

చక్కెర నిల్వలు:

చక్కెర నిల్వలు:

మీరు తీసుకొనే ఆహారంలో చక్కెర నిల్వలు ఎక్కువగా ఉంటే దానిని తగ్గించడం ఎంత అవసరం, ఎందుకంటే, ఈ చక్కెర నిల్వలు అధిక బరువుకి దారి తీస్తాయి.

పండ్ల రసాలు :

పండ్ల రసాలు :

అధిక రసం కలిగిన పండ్లను తీసుకోవడం ఎంతో మంచిది ప్రత్యేకంగా నారింజ, పుచ్చకాయ, పైన్ ఆపిల్ తీసుకుంటే మీ బరువుని ఎంతో సులభంగా తగ్గించుకవచ్చు.

ఆహారవేళలు:

ఆహారవేళలు:

మీ ఆహారం తీసుకొనే పద్దతిని మార్చుకోండి. ఒక వేళ మీరు రోజుకి 3 సార్లు ఆహారం తీసుకుంటున్నట్లైతే దానికి నాలుగు సార్లుగా కొంచెం కొంచెం తీసుకోండి.

గుడ్డు:

గుడ్డు:

మీ అధిక బరువు తగ్గించుకోవడానికి వారంలో కనీసం 3కోడి గుడ్లు అయినా తీసుకోవడం మంచిది, ఎందుకంటే ఈ కోడి గుడ్లలో ఆరోగ్యకరమైన ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి.

రోజు వారి వ్యాయామం:

రోజు వారి వ్యాయామం:

రోజువారి వ్యాయామం చేయండి, అలా చేస్తే మీ శరీరంలోని క్యాలరీలు, తగ్గి మీ బరువును తగ్గించడంల ఎంతగానో ఉపయోగపడుతాయి, వీలుంటే ‘యోగా' చేయడం ఎంతో శ్రేయస్కరం.

నిద్ర:

నిద్ర:

మీరు సరియైన సమయాల్లో నిద్రపతే మీలని జీవక్రియ రేటు పెరిగి, మీ అధిక బరువును తగ్గించడంలో సహాయపడుతుంది.

సూపులు:

సూపులు:

మీ రోజు వారి ఆహారంలో సూప్స్ తీసుకుంటే అది మీ అధిక బరువును తగ్గించడంలో ఎంతగానో సహాపడుతుంది.

చీజ్, నెయ్యి:

చీజ్, నెయ్యి:

మీ ఆహారంలో చీజ్, నెయ్యి మరియు వెన్న ఎలాంటి కొవ్వుని కలిగించే పదార్థాలు లేకుండా చూసుకోండి ఎందుకంటే వీటి వల్ల మీ బరువు పెరిగే అవకాశంఎక్కువ.

ఆయిల్ ఫుడ్స్:

ఆయిల్ ఫుడ్స్:

నూనెతో తయారుచేసి పదార్థాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఎందుకంటే వీటిలో అధిక శాతంలో ఉన్న క్యాలరీలు, మీ బరువు అధికంగా పెంచే అవకాశం ఉంది.

బంగాళ దుంపలు:

బంగాళ దుంపలు:

బంగాళ దుంపలలో కేలరీలు మరియు కార్బోహైడ్రేట్ల ఎక్కువగా ఉండడం వల్ల అధిక బరువుకు గురిచేసే ప్రమాదం ఉంది.

ఆహార పరిమాణం:

ఆహార పరిమాణం:

సాధ్యమైనంత వరకూ ఆకలి వేస్తేనే ఆహారం తీసుకోండి. అంతే కాకుండా ఎప్పుడుపడితే అప్పుడు ఆకలి లేని సమయంలో కూడా ఆహారం తీసుకోవడం వల్ల మీరు అధిక బరువుకు గురి అయ్యే ప్రమాదం ఉంది.

English summary

15 Basic and Quick Weight Loss Tips

Hitting the gym and maintaining a strict diet to lose weight is hard.But it doesn't have to be.The following are 11 easy weight loss hacks that can help you lose those extra pounds of fat if you follow them consistently over time.బరువు తగ్గడానికి బేసిక్ అండ్ క్విక్ వెయిట్ లాస్ టిప్స్
Desktop Bottom Promotion