For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రెగ్యులర్ గా ఉల్లిపాయలు ఎందుకు తినాలి? ప్రయోజనాలేంటి

By Mallikarjuna
|

ఉల్లిగడ్డ కోసేటప్పుడు కంట నీరుపెట్టిస్తుంది. కానీ... ‘ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు'అని సామెత. ఆరోగ్యానికి ఉల్లిగడ్డ ఎంత మంచిదో చెప్పకనే చెబుతుంది ఈ సామెత. ఉల్లిగడ్డలను కోసినప్పుడు వాటిలో ఉండే ఎంజైమ్స్ విడుదలవుతాయి. వాటితోపాటుగా ఘాటై సల్ఫర్‌ గ్యాస్ కూడా బయటికి వస్తుంది. ఇదే కళ్లకు చిరాకు కలిగించి కన్నీరు పెట్టిస్తుంది. కొన్ని శతాబ్దాలుగా ఈ ఉల్లిగడ్డలు మన ఆహారంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అతి తక్కువ ధరకు దొరికే వీటిని పేదల ఆహారంగా కూడా చెబుతారు. మన ఇళ్లలో ఉల్లిపాయను వాడని వారు చాలా తక్కువగా వుంటారు. ఉల్లిపాయలో ఘాటైన వాసనే కాదు, శక్తివంతమైన ఆహారవిలువలు కూడా ఎన్నో ఉన్నాయి. ఉల్లిపాయలో ఉండే ఆహారవిలువలు ఉల్లికారాన్ని బట్టీ, పక్వానికి వచ్చిన స్థితిని బట్టీ, ఎంతకాలం నిల్వ ఉన్నదన్నదాన్ని బట్టీ మారిపోతుంటాయి.

ఉల్లిపాయలో మినిరల్ (క్యాల్షియం, మెగ్నీషియం, సోడియం, పొటాషియం, సెలీనియం మరియు ఫాస్పరస్)పుష్కలంగా ఉన్నాయి. ఇందులో ఉండే యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు అనేక వ్యాధులకు ఉపశమనం కలిగిస్తాయి. నోటి నంచి దుర్వాసన వస్తుందని కొద్దిమంది తినడానికి అంతగా ఇష్టపడరు. అటువంటి వారు ఇందులోని వైద్యపరమైన విలువైన ఆరోగ్యప్రయోజనాలు తెలుసుకుంటే ఉల్లిపాయ తినకుండా ఉండరు.

 5 reasons you need to eat onions

1. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది: ఉల్లిపాయ శరీరంలోని రక్తం పల్చగా ఉండి కణాన్నింటికి ప్రసరించేందుకు ఉపయోగపడుతుంది. మరియు రక్తం గడ్డకట్టకుండా, రక్తకణాలను నుండి ఎరరక్తకణాలను నిరోధిస్తుంది. రక్తనాళాల్లో రక్తం గడ్డకడితే గుండె లోపాలు లేదా కార్డియో వాస్కులార్ వ్యాధులు దారి తీయవచ్చు. గుండె జబ్బులతోనూ, బీపీతోనూ బాధపడే వాళ్లు రోజూ 100 గ్రాముల ఉల్లిని తీసుకోవటం చాలా మంచిది.

2. వ్యాధినిరోధకతను మెరుగుపరుస్తుంది: ఉల్లిపాయలో ఉండే విటమిన్స్ మరియు యాంటీఆక్సిడెంట్స్, ముఖ్యంగా విటమిన్ సి, వ్యాధినిరోధకతను పెంచడంలో అద్భుతంగా సహాయపడుతుంది. వ్యాధులను , ఇన్ఫెక్షన్లను దూరంగా ఉంచతుంది. అలాగే బ్లడ్ కొలెస్ట్రాల్ వెవల్స్ ను తగ్గిస్తుంది .

3. ఒత్తిడి తగ్గిస్తుంది: ఉల్లిపాయల్లో ఉండే క్వార్సిటిన్ అనే అంశం నొప్పిని, డిప్రెషన్ ను మరియు యాక్సైటిని నివారించే సెడటివ్ గా పనిచేస్తుంది . కాబట్టి మీరు హర్డ్ వర్కింగ్ డే ఉన్నప్పుడు, మీ ఆహారంతోపాటు ఒక చిన్న ముక్క పచ్చి ఉల్లిపాయను తీసుకుంటే, మంచి ఫలితం ఉంటుంది. నిద్రలేమితో బాధపడేవారికి కూడా బాగా సహాయపడుతుంది.

4. క్యాన్సర్ నుండి రక్షిస్తుంది: ఉల్లిపాయలు విజయవంతంగా క్యాన్సర్ కణాల అభివృద్ధిని అడ్డగించే చురుకైన సమ్మేళనాలను ఉల్లిపాయ సమృద్ధిగా కలిగి ఉంది.

5. చర్మసౌందర్యానికి చాలా గొప్పది: మొటిమలు మచ్చల నివారణకు ఆలివ్ ఆయిల్ మరియు నిమ్మరసాన్ని సమపాళ్ళలో తీసుకొని మిక్స్ చేసి, ముఖానికి పట్టించడం వల్ల మొటిమలు, మచ్చలు పూర్తిగా తొలగిపోతాయి. మొటిమలను తొలగించడంలో ఇది ఒక బెస్ట్ ట్రీట్మెంట్ గా చెప్పవచ్చు.

Story first published: Wednesday, April 30, 2014, 20:38 [IST]
Desktop Bottom Promotion