For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నేచురల్ గా బెల్లీ ఫ్యాట్ కరిగించుకోవడానికి అమేజింగ్ టిప్స్

By Super
|

ప్రతి రోజూ నిద్ర లేచినప్పటిపట్టినుండి ఉరుకులు పరుగులతో ఆరోజు మొదలవుతుంది. వ్యాయామం చేసే టైం ఉండదు. ఒక వేళ చేయాలనున్నా దాన్ని కాస్త సాయంత్రానికి పోస్ట్ పోన్ చేస్తారు. అయితే ఆఫీస్ నుండి రాగేనే అలసట, చిరాకు, ఇక వీటితో ఏం వ్యాయామం.? రాత్రి అయ్యేసరికి రేపు తెల్లవారికి ఖచ్చితంగా వ్యాయామం మొదలు పెట్టాలనుకొంటారు. అయితే యాధా రాజ తధా ప్రజా అన్నట్లు మళ్ళ మరుసటి రోజు ఇంత ఉదయాన్నే ఎవరు నిద్రలేస్తారు.. మరికొంత సేపు నిద్రపోదామనే బద్దకస్తులు చాలా మందే ఉంటారు. నిద్రకు ఇచ్చే సమయాన్ని ఆరోగ్యం మీద కొంతైనా వెచ్చించరు. ఇలా ఏదో ఒక రకంగా ప్రస్తుతానికి వ్యాయామం గురించి మర్చిపోయినా.. ఏదో ఒక రోజు దాని పర్యవ్యసనం తప్పక అనుభవించక తప్పదు.

ఎందుకంటే మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల చాలా మంది ఊబకాయులుగా మారుతుంటే, మరికొందరేమో పొట్ట పెంచేస్తున్నారు. తర్వాత ఈ పొట్టను, చిరు బొజ్జలను కరిగించే మార్గమేది? అని చింతిస్తుంటారు. అలాంటి వారి కోసం కొన్ని చిట్కాలను అందిస్తున్నాం.. వీటిని కనుక క్రమం తప్పక పాటించినట్లైతే చిరు బొజ్జ గురించి చింతించే అవసరం ఉండదు. మరి ఆ చిట్కాలేంటో చూద్దాం...

బెల్లిఫ్యాట్ ను తగ్గించే లెమన్ వాటర్:

బెల్లిఫ్యాట్ ను తగ్గించే లెమన్ వాటర్:

స్ట్రెస్ తో కూడిన కాలేయం శరీరంలో జీవక్రియలను సక్రమంగా జరగనియ్యవు. అలా కాకుండా జీవక్రియలు ఎఫెక్టివ్ గాపనిచేసి, నడుము చుట్టూ ఉన్న కొవ్వు కణాలను విచ్ఛిన్నం చేసి బెల్లీని ఫ్యాట్ ను కరిగించాలంటే లెమన్ వాటర్ ఉత్తమం. ఇది మీ కాలేయంలో ఎంజైములను పెంచి శరీరంలో టాక్సిన్స్ తొలగిపోయేలా చేస్తుంది . కాలేయం కూడా దానికి యొక్క ప్రాధమిక విధులను క్రమంగా నిర్వర్తిస్తుంది.

లెమన్ వాటర్ తయారుచేయడం:

నిమ్మకాయ: 1

నీళ్ళు(గోరువెచ్చని నీటిని ఎంపిక చేసుకోండి): 1గ్లాసు

ఎలా తీసుకోవాలి:

* ఉదయం నిద్రలేవగానే, ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో నిమ్మరసం పిండి, అవసరం అయితే కొద్దిగా తేనె మిక్స్ చేసుకొని తీసుకోవాలి.

* శరీరంలో కొవ్వు కరిగించడానికి నిమ్మరసం కలిపిన గోరువెచ్చని నీరు బాగా ఉపయోగపడుతుంది .

* ఈ లెమన్ వాటర్ త్రాగిన తర్వాత అరగంట సేపు ఎటువంటి ఆహారం లేదా పానీయాలు కానీ తీసుకోకూడదు.

బెల్లీ ఫ్యాట్ తగ్గించే క్రాన్ బెర్రీ జ్యూస్ :

బెల్లీ ఫ్యాట్ తగ్గించే క్రాన్ బెర్రీ జ్యూస్ :

క్రాన్ బెర్రీ జ్యూస్ లో ఆర్గానిక్ యాసిడ్స్ : మాలిక్ ఆసిడ్, సిట్రిక్ ఆసిడ్, మరియు క్వినిక్ ఆసిడ్స్ కలిగి ఉంటాయి. వీటి పని జీర్ణ రసాలను ఉత్పత్తి చేయడం. ఈ ఎంజైములు కొవ్వు కణాలను విచ్చిన్నం చేస్తాయి. అంతే కాదు, కాలేయం లో జీర్ణక్రియకు అడ్డుపడే టాక్సిన్స్ ను తొలగించేస్తాయి . క్రాన్ బ్రెర్రీ జ్యూస్ కాలేయంలో ఉండే లింపాటిక్ వేస్ట్ ను జీర్ణం అయ్యేలా చేస్తుంది , దాంతో కొవ్వు కరుగుతుంది. కాబట్టి 100శాతం క్రాన్ బెర్రీ జ్యూస్ లేదా క్రాన్ వాటర్ ను త్రాగండి.

కావల్సినవి:

క్రాన్ బెర్రీ జ్యూస్ : 1cup(స్వీట్ లేకుండా)

నీరు: cups

చేయాల్సింది:

* ప్రతి రోజూ ఉదయం క్రాన్ బెర్రీ జ్యూస్ లో నీరు కలిపాలి. అంతే మీకు రోజంతటికి సరిపడే క్రాన్ వాటర్ రెడీ.

* ఇక ఈ క్రాన్ వాటర్ ను రోజంతా త్రాగుతుండాలి.

* అలాగే బ్రేక్ ఫాస్ట్ , లంచ్, డిన్నర్ కు ముందు, తర్వాత కూడా ఒక కప్పు క్రాన్ వాటర్ త్రాగితే ఉత్తమ ఫలితం ఉంటుంది.

* ఇంకా మీరు క్రాన్ వాటర్ ను తయారుచేసుకోవచ్చు. రెండు టేబుల్ స్పూన్ల క్రాన్ బెర్రీ జ్యూస్ లో ఒక కప్పు కంటే తక్కువ నీరు మిక్స్ చేసి తీసుకోవాలి.

బెల్లీ ఫ్యాట్ కరిగించుకోవడానికి ఫిష్ ఆయిల్ లేదా ఫిష్

బెల్లీ ఫ్యాట్ కరిగించుకోవడానికి ఫిష్ ఆయిల్ లేదా ఫిష్

ఫిష్ ఆయిల్లో ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి . ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ ఐకోసపెంటాయోనిక్ యాసిడ్, డెకాసహెక్సానిక్ ఆసిడ్స్ మరియు లినోలెనిక్ ఆసిడ్స్ , శరీరంలో కొవ్వు నిల్వలను , నడుము చుట్టును ఉన్న కొవ్వును విచ్ఛిన్నం చేయడానికి సహాయపడుతుంది . మీరు ఫిష్ ఆయిల్ తీసుకోలేకపోతే, ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్న చేపలను తీసుకోవాలి.

ఇలా చేయండి:

* 6గ్రాముల ఫిష్ ఆయిల్ ను ప్రతి రోజూ తీసుకోవాలి.

* ప్రత్యామ్నాయంగా, ఓమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ కలిగిన సాల్మన్ లేదా మెకరెల్ ఫిష్ ను వారంలో రెండు సార్లు తీసుకోవచ్చు. తున మరియు హాలిబట్ లో కూడా ఓమేగా 3 పుష్కలం.

బెల్లీ ఫ్యాట్ కరిగించుకోవడానికి చియా సీడ్స్ ను తినాలి:

బెల్లీ ఫ్యాట్ కరిగించుకోవడానికి చియా సీడ్స్ ను తినాలి:

మీరు శాఖాహారులైతే మరియు మీరు చేపలు తినలేనివారైతే, ఒమేగా 3 ఫ్యాటీఆసిడ్స్ కలిగిన చియా సీడ్స్ ను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోండి. వీటిలో చేపల్లో ఉన్నంత శాతంలో ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ కలిగి ఉన్నాయి . అయితే మీ శరీరం వీటిని ఆల్ఫా లినోలెనిక్ గా మార్పు చేసుకోవాలి. ఇవి చేపల్లో అయితే నేరుగా డిహెచ్ ఎ లేదా ఇపిఎగా పొందుతాము. ఒమేగా 3 ఆసిడ్స్ కాకుండా , చియా సీడ్స్ లో యాంటీఆక్సిడెంట్స్, క్యాల్షియం, ఐరన్, మరియు డైటరీ ఫైబర్ కూడా పుష్కలంగా ఉన్నాయి. వీటి వల్ల పొట్ట నిండుగా అనుభూతి కలిగి, ఎక్కువ సమయం ఆకలి కాకుండా చేస్తుంది . కాబట్టి మీ డైలీ డైట్ లో ఒక టేబుల్ స్పూన్ చియా సీడ్స్ ను చేర్చుకోవడం ఉత్తమం.

చియా సీడ్స్ ను ఎలా తినాలి?

* చియా సీడ్స్ ను స్మూతీస్, సలాడ్స్, మరియు పెరుగులో జోడించి తీసుకోవచ్చు.

* మీరు ఉదయం తీసుకొనే బ్రేక్ ఫాస్ట్ లో జోడించుకోవచ్చు.

* ఇంకా, సూప్స్ మరియు గ్రేవీస్ లో చిక్కగా ఉండటానికి కూడా చియా సీడ్స్ ను ఉపయోగించుకోవచ్చు.

బెల్లీఫ్యాట్ కరిగించడానికి అల్లం టీ:

బెల్లీఫ్యాట్ కరిగించడానికి అల్లం టీ:

మీకు తెలుసు అల్లం నేచురల్ డైజెస్టివ్ రెమెడీ అని, అయితే, ఇది ఒక థర్మోజెనిక్ అని మీకు తెలుసా?థర్మోజెనిక్ ఏజెంట్స్ శరీరంలో వేడి పెంచుతుంది. దాని ద్వారా కొవ్వ కణాలు ఎఫెక్టివ్ గా బర్న్ అవుతాయి. అధికంగా తినడం, వయస్సు సంబంధితంగా హార్మోనుల్లో తగ్గుదల, వ్యాయామం లేకపోవడం, లేదా ఒత్తిడి వల్ల బెల్లీ ఫ్యాట్ కు కారణం కావచ్చు. ఈ ప్రతి యొక్క సమస్యను అల్లం పరిష్కరిస్తుంది. అంతే కాదు, అల్లం కార్టిసోల్ ప్రొడక్షన్ కూడా పెంచుతుంది. కార్టిసోల్ స్టెరాయిడ్ హార్మోన్ , ఇది ఎనర్జీ అందించడంలో మరియు మెటబాలిజం రేటును పెంచడానికి సహాయపడుతుంది. అందువల్ల, అల్లం టీని రెగ్యులర్ గా తీసుకోని, ఎఫెక్టివ్ గా బెల్లీ ఫ్యాట్ ను కరిగించుకోండి.

జింజ్ లెమన్ హనీ టీ తయారుచేయడం ఎలా?

కావల్సినవి:

నీళ్ళు : 4cups

అల్లం(పొట్టుతీసి, సన్నగా తురుముకోవాలి)

నిమ్మకాయ: 1

తేనె: 1tbsp

ఇలా చేయండి:

1. ముందుగా నీరును మరిగించాలి.

* తర్వాత అందులో అల్లం తురుమును వేసి 5నుండి10 నిముషాలు సిమ్మర్ లో మరిగించాలి.

* తర్వాత స్టౌ మీద నుండి క్రిందికి దింపుకొని, దానికి నిమ్మరసం మరియు తేనె మిక్స్ చేయాలి.

* బాగా మిక్స్ చేసి ఉదయం ఈ జింజర్ టీని ఒక కప్పు తీసుకోవాలి.

* రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మీ మెటబాలిజం రేటును తగ్గిస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు కార్టిసోల్ ప్రొడక్షన్ ను తగ్గిస్తుంది . రోజులోరెండు కప్పుల అల్లం టీని తీసుకోవాలి.

బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవడానికి వెల్లుల్లి:

బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవడానికి వెల్లుల్లి:

కార్డియో వాస్కులార్ సిస్టమ్ కు ఇది మంచిదని మీకు తెలుసు ఇది సిస్టోలిక్ మరియు డయాస్టోలిక్ బ్లడ్ ప్రెజర్ ను తగ్గిస్తుంది , అదే విధంగా ట్రై గ్లిజరైడ్స్ కాకుండా, మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. అలాగే ఈ వెల్లుల్లిలో అద్భుతమైనటువంటి యాంటీ ఒబేసిటి లక్షణాలు పుష్కలంగా ఉన్న విషయం మీకు తెలిసిందే. ప్రతి క్షణం మీ శరీరంలో కణాలు నశిస్తుంటాయి మరియు మీ శరీరం కొత్తకణాలను తయారుచేస్తుంటుంది. వీటి ప్రక్రియను క్రమంగానిర్వర్తించడానికి వెల్లుల్లి అద్భుతంగా సహాయపడుతుంది. కాబట్టి, మీ రెగ్యులర్ డైట్ లో వెల్లుల్లి చేర్చుకోండి. బెల్లీ ఫ్యాట్ కరిగించుకోవాలని కోరుకొనే వారు పచ్చివెల్లుల్లి మరింత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

English summary

Amazing Tips to Reduce Belly Fat Naturally

Many people try dieting to lose belly fat, but this is not the optimal solution. The healthy way to trim down your tummy is to use natural home remedies.
Desktop Bottom Promotion