For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉదయం చేసే వ్యాయామంతో బోలెడు ప్రయోజనాలు

|

సాధారణంగా ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాహారం ఎంత ముఖ్యమో, వ్యాయమం కూడా అంతే ముఖ్యం. వ్యాయామం ముఖ్యంగా ఎప్పుడు ఉదయాన్నే చేయమని సలహాలిస్తుంటారు. ఉదయాన్నే వ్యాయామం చేయడానికి చాలా కారణాలే ఉన్నాయి. ఉదయం చేసే వ్యాయామం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

ఉదాహారణకు: ప్రతి రోజూ మీరు ఉదయం ఒకే సమయానికి నిద్రలేవడం అలవాటు చేసుకోవడం మరియు వ్యాయామం కూడా క్రమం తప్పకుండా చేయడం అలవాటు చేసుకోవాలి. ఈరెండు అలవాటుగా మారినప్పుడు అందుకు మీ శరీరం అనువుగా మార్చుకుంటుంది. దాంతో ఇది ఒక అలవాటుగా మారుతుంది. ఒక సారి మొదలపెట్టాకా అది అలవాటు గా మారి రెగ్యులర్ గా ఎటువంటి అలసట లేదా లేజీనెస్ లేకుండా నిద్రలేవడం అలవడుతుంది.

ప్రతి దినం వ్యాయామం చేస్తున్నారా..? ఐతే నో టెన్షన్.:క్లిక్ చేయండి

ఉదయం వ్యాయామం చేయడం వల్ల పొందే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. రోగ్యులర్ వ్యాయామం వల్ల జీవక్రియలు చురుగా పనిచేస్తాయి. మీరు చరుకుగా ఉండే అనుభూతిని పొందుతారు. వ్యాయామం వల్ల జీవక్రియలు చురుకు పనిచేయడానికి అవసరం అయ్యే శక్తిని అంధివ్వడంలో బూస్ట్ వంటిది. దాంతో మీరు రోజంతా ఎనర్జిటిక్ గా ఉంటారు. మరియు క్యాలరీలను చాలా సులభంగా బర్న్ చేస్తుంది. మీరు చాలా త్వరగా అలసటకు గురైనా లేదా ఒత్తిడికి గురైనా ఈ సమస్యల నుండి భయటపడాలంటే, మీరు ఉదయం వ్యాయామం చేయడం ప్రారంభించండి

వ్యాయామం తర్వాత ఖచ్చితంగా తీనాల్సిన బెస్ట్ ఫుడ్స్:క్లిక్ చేయండి

ఉదయం వ్యాయామం చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది మరియు మీ మనస్సును ప్రశాంతంగా ఉంచతుంది. ఉదయం వ్యాయంలో వాకింగ్ లేదా జాగింగ్ వల్ల మీ శరీరంను, మనస్సును తాజాగా ఉంచుతుంది. ఉదయం వ్యాయామం వల్ల పొందే హెల్త్ బెనిఫిట్స్..

ఆకలిని పెంచుతుంది

ఆకలిని పెంచుతుంది

ఉదయం వ్యాయామం చేయడం వల్ల సహజంగా ఆకలి పెరుగుతుంది . ముఖ్యంగా వ్యాయామం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మరియు బౌల్ మూమెంట్ రెగ్యులేట్ చేస్తుంది.

శక్తిని అంధిస్తుంది

శక్తిని అంధిస్తుంది

వ్యాయామం చేయడం వల్ల నిరంతరం శక్తి కలిగి ఉంటారు. ముఖ్యంగా ఉదయం చేసే వ్యాయామం వల్ల మీరు యాక్టివ్ గా మరియు హెల్తీగా ఉంటారు.

మానసిక స్థితి

మానసిక స్థితి

ఉదయం వ్యాయామం చేయడం వల్ల మేథపరమైన విధులు, మెరుగుపరుస్తుంది. ఇది మనం చేసే పనిలో మంచి దృష్టి పెట్టుటకు మరియు మెదడును చురుకుగా ఉంచడానికి సహాయపడుతుంది.

ఒత్తిడితో పోరాడుతుంది

ఒత్తిడితో పోరాడుతుంది

ఉదయం నడక లేదా జాగింగ్ చేయడం ఒక ఆరోగ్యకరమైనదిగా భావిస్తారు. ఇది ఒత్తిడిని మరియు డిప్రెషన్ ను తగ్గిస్తుంది. మీరు ఒంటరిగా ఫీలవుతుంటే, ఉదయం వాక్ కు వెళ్ళండి. ఫ్రెష్ గా ఉండే గాలి మిమ్మల్ని మరింత సంతోషంగా మరియు ఫీల్ బెటర్ గా ఉండేందుకు సహాయపడుతుంది.

బరువు తగ్గడానికి

బరువు తగ్గడానికి

బరువు తగ్గడానికి మార్నింగ్ వర్కౌట్ చాలా అద్భుతంగా సహాయపడుతుంది. ఉదయం వ్యాయామం వల్ల బాడీ మెటబాలిజంను చురుకుగా ఉంచి అధిక క్యాలరీలను బర్న్ చేస్తుంది.

నిద్ర

నిద్ర

కొన్ని పరిశోధనల ప్రకారం స్త్రీ మరియు పురుషులు, సాయంత్రంలో వ్యాయామం చేసే వారికంటే, ఉదయం చేసే వ్యాయామం వల్ల ప్రశాంతమైన నిద్రను పొందుతారని నిరూపించబడింది. అందుకు ప్రధాన కారణం కండరాలు విశ్రాంతి పొందడానికి మరియు సాధారణ స్థితికి చేరడానికి కొంత సమయం తీసుకుంటుంది.

మొత్తం ఆరోగ్యానికి

మొత్తం ఆరోగ్యానికి

బాడీ మెటబాలీజంకు కావల్సిన శక్తిని అంధించడంతో పాటు, ఉదయం వ్యాయామం వల్ల మొత్తం శరీరంలో బ్లడ్ ప్రెజర్ ను రెగ్యులేట్ చేస్తుంది. హార్ట్ రేట్ పెంచుతుంది మరియు రక్తప్రవాహాన్ని కండరాలకు చురుకుగా అంధిస్తుంది.

English summary

Benefits Of Morning Exercise On Health

It is always said that you should workout in the morning. Well, there are many reasons behind saying this. It would be interesting to know that there are many health benefits of exercising in the morning.
Desktop Bottom Promotion