For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హాట్ అండ్ సెక్సీ బిపాషా బసు ఫిట్ నెస్ మంత్ర

|

ఎవరు ఎటువంటి వ్యాయామాలు చేయాలి? ఎంత వరకూ చేయాలి? ఎంత సేపు చేయాలి? పురుషులకు, మహిళలకు, పిల్లలకు వేరు వేరు వ్యాయామాలు ఉన్నాయా? ఏం తినాలి? ఏం తినకూడదు? ఈ ప్రశ్నలకన్నిటికీ సమాధానంగా ప్రఖ్యాత బాలీవుడ్ నటి, అందాలరాశి బిపాసాబసు ఏకంగా కొన్ని వీడియో క్యాసెట్లు రూపొందించే పనిలో ఉంది. బిపాసాబసుకు, వ్యాయామాలకు సంబంధం ఏమిటని ఆలోచిస్తున్నారా? ఈ మధ్య కా లంలో ఆమె వ్యాయామ గురువుగా మారిపోయింది. ఎవరు ఎలా వ్యాయామం చేయాలన్న దానిపై అడపా దడపా ముంబై, ఢిల్లీ, బెంగళూరు నగరాల్లో ఉపన్యాసాలిస్తోంది. అంతేకాదు, బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ వగైరా చిత్ర పరిశ్రమలకు చెందినవారంతా ముంబైలోని ఆమె జిమ్‌ను అడపా దడపా సందర్శించి ప్రయోజనాలు పొందుతున్నారు.

ప్రస్తుతం హీరోయిన్‌గానే కాదు, జిమ్ గురువుగా కూడా బిపాసా బాగా డిమాండ్‌లో ఉన్నారు. శరీరాన్ని చక్కగా, అందంగా, ఆరోగ్యంగా, చురుకుగా ఎలా ఉంచుకోవాలన్నది బిపాసాను చూసే నేర్చుకోవాలని ఇప్పుడు ముంబైలో పెద్ద టాక్. "శరీరం చురుకుగా ఆరోగ్యంగా మిసమిసలాడుతూ లేకపోతే నాకు మా చెడ్డ చిరాకు, బతికినంత కాలం ఆరోగ్యంగా హాయిగా బతకాలన్నదే నా ఫిలాసఫీ'' అని తరచూ వ్యాఖ్యానించే బిపాసా గత కొన్నేళ్లుగా ఫిట్‌నెస్ మీద బాగా లోతుగా అధ్యయనం చేస్తోంది. దేశంలోని పలువురు వ్యాయామ నిపుణులు, డాక్టర్లతో మాట్లాడింది. ఆ తరువాత స్వయంగా ఓ జిమ్‌ను ఏర్పాటు చేసింది. అంతేకాదు, ఎవరికి, ఎటువంటి వ్యాయామం అవసరమనే అంశంపై ప్రత్యేకంగా పరిశోధన చేసి, అందుకు తగ్గ వ్యాయామాలను సిద్ధం చేసింది.

Bipasha basu's Fitness Secrets

బాలీవుడ్‌లో చాలామంది తారలు జిమ్‌లను సందర్శిస్తుంటారు. చలన చిత్ర రంగంలో ఫిట్‌నెస్‌కు చాలా ప్రాధాన్యం ఉంది. అయితే, అందరికన్నా వ్యాయామాల పట్ల మరీ ఎక్కువగా శ్రద్ధ చూపించేది బిపాసాయేనని ఇప్పుడు పేరు వచ్చేసింది. తన ఫిలాసఫీకి తగ్గట్టే ఆమె ఇటీవల చక్కటి తేలికైన వ్యాయామాలతో, తన మధురమైన వ్యాఖ్యానాలతో 'లవ్ యువర్‌సెల్ఫ్' సిరీస్ కింద 'బ్రేక్ ఫ్రీ', ' ఫిట్ ఫ్యాబ్యులస్ యు' పేర్లతో రెండు డీవీడీలను విడుదల చేసింది. ఆ తరువాత 'అన్‌లీష్' పేరుతో మరో అత్యంత ఆధునిక వ్యాయామాలతో ఒక డీవీడీని కూడా విడుదల చేసింది. మొదటి రెండు వీడియోలలో ఆమె కొన్ని వ్యాయామాలను డాన్స్‌ల రూపంలో రూపుదిద్దింది. శరీరాన్ని ఎలా వీలైతే అలా తేలికగా వంచడం ఇందులో ప్రధానం. అయితే, అన్‌లీష్ మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. ఇందులోని వ్యాయామాలు ఎక్కువగా ఎగువ శరీర భాగం మీద దృష్టి పెట్టి ఉంటాయి. అంటే, ఇవన్నీ గుండెకు బలం ఇస్తాయన్న మాట.

ఈ వ్యాయామాలను సరిగ్గా, క్రమబద్ధంగా చేస్తే, శరీరంలో చురుకుదనం, వేగం బాగా పెరుగుతాయట. ఎముకలు గట్టి పడతాయి. కండరాలు ఎటుపడితే అటు వంగగలగడమే కాకుండా, అవి కృంగిపోవడమంటూ ఉండదు. ఈ వ్యాయామాలను ఏ వయసు వారైనా చేయవచ్చు కానీ, 25 ఏళ్లు పైబడినవారు చేయడం చాలా మంచిదని బిపాసా చెబుతోంది. ఇది 30 నిమిషాల వ్యాయామం. ఊపిరితిత్తులు, గుండె, రక్తప్రసారం బాగా మెరుగుపడతాయి. శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది. లవ్ యువర్‌సెల్ఫ్ సిరీస్‌లోని వీడియో క్యాసెట్లలో బిపాసా వ్యాఖ్యానాలు ఎక్కువగా వినిపిస్తాయి. మొదట ఉపోద్ఘాతంతో ప్రారంభమవుతుంది. ఆరోగ్యపరంగా వాటి అవసరాన్ని వివరిస్తుంది. ఆ తరువాత నిపుణులు ఏమంటున్నదీ తెలియజేస్తుంది. శరీరానికి వాటి వల్ల ఎంత ఏవిధంగా ఉపయోగపడేదీ తెలుపుతుంది.

"శరీరాన్ని ప్రేమించండి. అనారోగ్యాలు తెచ్చుకోకండి. ఆరోగ్యంగా ఉంటేనే ఆనందంగా బతకగలం. ఎన్ని విధాల వీలైతే అన్ని విధాలుగా ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఆరోగ్యకరమైన భోజనాన్నే తీసుకోండి. చక్కటి పండ్లు తినండి'' అంటూ ప్రారంభమయ్యే బిపాసా వ్యాఖ్యలు నిజంగా స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ అన్నారు. తాను డబ్బు సంపాదన కోసం ఈ వ్యాయామాలు చేయడం లేదని, ఆరోగ్యం కోసమే తాను పాటుపడుతున్నానని, ముఖ్యంగా మహిళలు తమ ఆరోగ్యం చేయాల్సింది ఎంతో ఉందని ఆమె అంటారు. "నా దగ్గరికి రానక్కర లేదు. వీడియోలలో చూసి నేర్చుకోండి చాలు అంటోంది.

English summary

Bipasha basu's Fitness Secrets

Bipasha Basu, one of the fittest female actors in Bollywood, has always stressed on the importance of having a fit body. Fitness has always played a vital role in her life and she owes a major portion of her success to her toned and glamorous physique.
Story first published: Saturday, March 8, 2014, 16:17 [IST]
Desktop Bottom Promotion