For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

10 రోజుల్లో బొజ్జను కరిగించే ఉత్తమ చిట్కాలు

|

బరువు పెరగడం వేరు, పొట్ట మాత్రమే పెరగడం వేరు చాలా వరకూ స్త్రీ, పురుషుల ఇద్దరిలోనూ బెల్లీ ఫ్యాట్ అనేది సహజ సమస్య. బెల్లీ ఫ్యాట్ వల్ల శరీరానికి అసౌకర్యంగాను మరియు అందవిహీనంగాను కనబడేలా చేస్తుంది. అంతే కాదు, వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు కూడా గురి చేస్తుంది. అలా జరగకుండా ఉండాలంటే అందుకు మీరు కొన్ని వెయిట్ లాస్ టిప్స్ ను అనుసరించాల్సి ఉంటుంది.

బెల్లీ ఫ్యాట్ మహిళల్లో చాలా పెద్ద సమస్యగా ఉంటుంది. బెల్లీ ఫ్యాట్ వల్ల మహిళల్లో వివిధ రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. పీరియడ్స్ సమస్యలు, హార్మోనుల అసమతుల్యతలు, హై బీపి, షుగర్ వంటి సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. అలా జరకుండా ఉండాలంటే బెల్లీ ఫ్యాట్ పెరగకుండా చూసుకోవాలి. అందుకు సరైన ఆహారంను, సరైన టైమ్ కు తీసుకుంటుండాలి.

పొట్టచుట్టూ చేరిన అదనపు కొవ్వు కరిగించుకోవడానికి డైట్ కు సహాయపడే ఆహారంతో పాటు, కొన్ని వ్యాయామాలు కూడా చేయడం ద్వారా టమ్మీ ఫ్యాట్ ను కరిగించుకోవచ్చు. క్రమం తప్పకుండా రెగ్యులర్ గా వ్యాయామాలు చేయడం ద్వారా ఫ్లాట్ స్టొమక్ ఫ్యాట్ ను పొందవచ్చు.

బరువు తగ్గించుకోవడానికి సరైన వెయిట్ లాస్ టిప్స్ మరియు స్ట్రాంగ్ విల్ పవర్ తో , మీరు బెల్లీ ఫ్యాట్ ను 10రోజుల్లో కరిగించుకోవచ్చు. మరి బెల్లీ ఫ్యాట్ కరిగించుకోవడానికి ఈ క్రింది టిప్స్ ను ఒక సారి చూడండి...

డే 1:

డే 1:

నీళ్ళు మరియు వ్యాయామం: మొదటి రోజు ఎక్కువ నీళ్ళు తీసుకోవాలి. ఇది ఎనర్జీ లెవల్స్ పెంచడానికి సహాయపడుతుంది, ఇంకా మిమ్మల్ని హైడ్రేషన్ లో ఉంచడమే కాదు, ఫిట్ గా కూడా ఉంచుతుంది. బెల్లీ ఫ్యాట్ కరిగించుకోవడానికి 30నిముషాలు ట్రేడ్ మీల్ పై నడవాల్సి ఉంటుంది. వర్క్ చేసేప్పుడు, శ్వాసలోపలికి తీసుకోవడం మరియు బయటకు వదలడం ద్వారా బెల్లీఫ్యాట్ కరిగించుకోవచ్చు.

డే 2

డే 2

లోక్యాలరీ ఫుడ్ మరియు వ్యాయామం: రెండవ రోజున మీరు లోక్యాలరీ ఫుడ్ కు ప్రాధాన్యత ఇవ్వాలి. తగినంత నీరు త్రాగడం మాత్రం మర్చిపోకండి, నీరు ఎంత త్రాగితే అంత మంచిది. అప్పుడే మిమ్మల్ని యాక్టివ్ గా ఉంచుతుంది . లోక్యాలరీ ఫుడ్ తీసుకోవడం ఒక మంచి ట్రిక్, అది మీ టమ్మీ బ్లోట్ చెయ్యదు.

డే 3

డే 3

జ్యూస్ మరియు వ్యాయామం : మూడవ రోజు, తాజా జ్యూస్ మరియు స్మూతీ. ఇది మీ టమ్మీని ఫిల్ చేయడానికి సహాయపడుతుంది, మరియు ఇది ఆకలిని నివారిస్తుంది. బెల్లీ ఫ్యాట్ కరిగించుకోవడానికి ఈ వెయిట్ లాస్ టిప్ తప్పనిసరిగా అనుసరించాల్సి ఉంటుంది.

డే 4 గోధుమలతో తయారుచేసిన ఆహారాలు మరియు వ్యాయామం

డే 4 గోధుమలతో తయారుచేసిన ఆహారాలు మరియు వ్యాయామం

ఇక నాల్గవ రోజున గోధుమలతో తయారుచేసిన ఆహారాలు తీసుకోవడం వల్ల మీకు అవసరం అయ్యే ఎనర్జీని అందిస్తుంది. అంతే కాదు, వ్యాయామంలో జాగింగ్, ట్రేడ్ మీల్ వంటివి సహాయపడుతాయి.

డే 5 ఫైబర్ ఫుడ్ మరియు వ్యాయామం

డే 5 ఫైబర్ ఫుడ్ మరియు వ్యాయామం

బెల్లీ ఫ్యాట్ ను 10రోజుల్లో కరిగించుకోవాలంటే, ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. ఇది మలబద్దకానికి గురిచేయదు. ఇంకా మీరు తగినంత నీరు త్రాగాలి మరియు మిమ్మల్నిమీరు హైడ్రేషన్ లో ఉంచుకోవాలి.

డే6 నట్స్ మరియు వ్యాయామం

డే6 నట్స్ మరియు వ్యాయామం

డే 6న నట్స్ తీసుకోవడం చాలా మంచిది. అవి ఎనర్జీ లెవల్స్ ను పెంచుతాయి. ఇంకా శరీరానికి అవసరం అయ్యే ప్రోటీన్స్ మరియు విటమిన్స్ సరిపడా అందించి శరీరం ఫిట్ గా మరియు హెల్తీగా ఉండేలా చేస్తాయి. ఇంకా ఇది, ఆకలి కోరికలను తగ్గిస్తాయి.

డే 7 గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ మరియు వ్యాయామం

డే 7 గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ మరియు వ్యాయామం

బెల్లీ ఫ్యాట్ ఫాస్ట్ గా కరిగించుకోవడానికి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ గ్రేట్ గా సహాయపడుతాయి. కొద్దిగా బ్రొకోలీ మరియు ఆకుకూరలను సలాడ్స్ రూపంలో తీసుకోవడం ద్వారా రోజంత మీ పొట్ట ఫుల్ గా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది.

డే 8

డే 8

కలర్ ఫుల్ ఫ్రూట్స్ మరియు వ్యాయామం: డే 8, మీ ప్లేట్ నిండా కలర్ ఫుల్ ఫ్రూట్స్ తీసుకొని తినాలి. వీటిలో నీటి శాతం అధికంగా ఉంటుంది. బెల్లీ ఫ్యాట్ ను 10 రోజుల్లో కరిగించుకోవడానికి ఇది ఒక ఉత్తమ ఉపాయం.

డే 9

డే 9

డైరీ ఫుడ్ మరియు వ్యాయామం: ముఖ్యంగా మహిళలు ఓస్టియోపోరోసిస్ ను నివారించడానికి డైరీ ఫుడ్స్ చాలా బాగా సహాయపడుతాయి. కాబట్టి, మీ రెగ్యులర్ డైట్ లో పెరుగు, స్కిమ్డ్ మిల్క్ మరియు వీటితో పాటు ఒక గంట సేపు వ్యాయామం బెల్లీ ఫ్యాట్ 10 రోజుల్లో కరిగించుకోవడం కోసం చాలా అవసరం.

డే 10

డే 10

గుడ్లు మరియు వ్యాయామం: గుడ్లలో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. ఎవరైతే త్వరగా బరువు తగ్గాలని కోరుకుంటున్నారో, వారికి ఇది గొప్పగా సహాయపడుతుంది. ఇది తక్షణ ఎనర్జీ లెవల్స్ ను అంధిస్తుంది మరియు బెల్లీ ఫ్యాట్ ను కరిగిస్తుంది.

English summary

Burn Belly Fat In 10 Days!


 Belly fat is a major problem for women. The fat encircling the stomach is annoying and a put off too. Burning belly fat can be done with the help of consuming the right foods and most importantly, at the right time.
Story first published: Saturday, September 20, 2014, 12:06 [IST]
Desktop Bottom Promotion