For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

త్వరగా, హెల్తీగా బరువు తగ్గించుకొనేందకు మోడల్స్ యొక్క డైట్ టిప్స్

|

మహిళల విషయంలో బరువు తగ్గించుకోవడం ఒక పెద్ద సమస్యగానే చెప్పవచ్చు . కొత్త సంవత్సరం రాభోతున్నది అంటే కొంతమంది కొన్ని తీర్మానాలు తీసుకుంటుంటారు. ఈ సంవత్సరం ఎలాగైనా సరే బరువు తగ్గాలని నిర్ణయించుకుంటారు. ముఖ్యంగా బరువు తగ్గించుకోవడం కోసం మహిళలలు వివిధ రకాలుగా ఆలోచిస్తుంటారు. అయితే కొంత మంది మోడల్స్ ను మనం గమనించినట్లైతే, వారు చాలా స్లిమ్ గా మరియు ఫిట్ గా ఎలా ఉండగలుగుతున్నారు. వారు స్లిమ్ బాడీతో పాటు, కాంతివంతమైన చర్మంను ఏవిధంగా కలిగి ఉంటారు.

ఫిట్నెస్ మోడల్స్ వారు అంత ఫిట్ గా ఉండటానికి అనుసరించే కొన్ని డైట్ టిప్స్ ను బోల్డ్ స్కై మీతో షేర్ చేసుకుంటున్నది. ఇయర్ ఎండ్స్ లోపు ఏవిధంగా బరువు తగ్గాలి. మోడల్స్ యొక్క డైట్ టిప్స్ ను మీతో షేర్ చేసుకుంటున్నది బోల్డ్ స్కై. మోడల్స్ ను సేకరించిన ఈ డైట్ టిప్స్ శరీరాన్ని ఫిట్ గా ఉంచడంతో పాటు, కొన్ని పౌండ్ల బరువును తగ్గిస్తుంది.

వ్యాయామం మరియు ఎటువంటి ఒత్తిడి లేకుండా పాజిటివ్ గా ఉండటం పెద్ద మార్పును తీసుకొస్తుంది. మరి మీరు త్వరగా మరియు ఆరోగ్యంగా బరువు తగ్గించుకోవడం కోసం.. ఫిట్ నెస్ మోడల్స్ నుండి సేకరించిన కొన్ని డైట్ టిప్స్ మీకోసం ఈ క్రింది విధంగా...

ఎప్పుడూ హైడ్రేషన్ లో ఉండాలి:

ఎప్పుడూ హైడ్రేషన్ లో ఉండాలి:

మోడల్స్ తమ శరీరంను ఎప్పుడూ హైడ్రేషన్ లో ఉంచుకోవడం వల్ల వారు త్వరగా బరువు తగ్గుతారు. నిరంతరం శరీరానికి సరిపడా తేమను అందిస్తుంటారు. సరిపడా నీళ్ళు , పండ్ల రసాలు త్రాగడం మరియు అన్ కార్బోనేటెడ్ వాటర్ ను తీసుకోవడం వల్ల టాక్సిన్స్ శరీరం నుండి బయటకు నెట్టివేయబడుతాయి.

అతి తక్కువ భోజనం:

అతి తక్కువ భోజనం:

తినే ఆహారంను చాలా తక్కువగా తీసుకోవాలనే ఆలోచనను మనస్సులో ఫిక్స్ చేసుకోవడం వల్ల బరువు తగ్గించుకోవచ్చు. మీరు తీసుకొనే భోజనం చాలా తక్కువ పరిమాణంలో తీసుకోవడం వల్ల ఇది బరువును కంట్రోల్ చేయడానికి సహాయపడుతుంది.

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్:

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్:

మీ రెగ్యులర్ డైట్ లో గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ను తీసుకోవడం చాలా అవసరం. గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ ఆరోగ్యానికి పోషకాలను అందిస్తూనే బరువు తగ్గించి మిమ్మల్ని ఫిట్ గా ఉంచుతుంది.

ఏరియేటెడ్ బెవరేజస్ కు దూరంగా ఉండటం:

ఏరియేటెడ్ బెవరేజస్ కు దూరంగా ఉండటం:

కార్బొనేటెడ్ మరియు ఏరియేటెడ్ బెవరేజెస్ బరువు పెరగడానికి కారణం అవుతాయి. అలాగే డయాబెటిస్ వంటి సమస్యలకు కూడా కారణం అవుతుంది.

బబుల్ గమ్:

బబుల్ గమ్:

మోడల్స్ డైట్ టిప్స్ లో బెస్ట్ డైట్ టిప్ షుగర్ ఫ్రీ బబుల్ గమ్ కు దూరంగా ఉండాలి. వీటిని తినడం వల్ల ఎసిడిటికి కారణం అవ్వడంతో పాటు, ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఎదురౌవుతాయి.

మీ భోజనంలో పండ్లను చేర్చుకోవాలి:

మీ భోజనంలో పండ్లను చేర్చుకోవాలి:

రెగ్యులర్ డైట్ లో నీరు ఎక్కువగా ఉన్న పండ్లను చేర్చుకోవాలి . పుచ్చకాయ, ఆరెంజ్ మరియు పియర్స్ వంటి వాటిని చేర్చుకోవడం చాలా అవసరం.

వెజిటేబుల్స్ ను తప్పక తీసుకోవాలి :

వెజిటేబుల్స్ ను తప్పక తీసుకోవాలి :

బరువు తగ్గించడంలో అనేక తాజాగా కూరలు బాగా సహాయపడుతాయి. కాబట్టి, బరువు తగ్గించే పీచు పదర్థాలను డైట్ లిస్ట్ లో చేర్చుకోవాలి.

మంచి నిద్ర:

మంచి నిద్ర:

త్వరగా బరువు తగ్గాలంటే నిద్ర చాలా అవసరం. మీరు రోజుకు కనీసం 7-8గంటలు నిద్రపోవడం చాలా అవసరం.

మంచి చిరుతిండ్లు:

మంచి చిరుతిండ్లు:

చిరుతిండ్లు ఏవి పడితే అవి తినకుండా, ఆరోగ్యానికి సహాయపడేవి తీసుకోవాలి. ముఖ్యంగా కొన్ని రకాల డ్రై నట్స్ బాగా సహాయపడుతాయి.

మసాలా దినుసులు:

మసాలా దినుసులు:

శరీరంలో కొవ్వును త్వరగా కరిగించడానికి కొన్ని ఇండియన్ మసాలాలను అద్భుతంగా సహాయపడుతాయి . మోడల్స్ డైట్ ప్లాన్ ను మీరు అనుసరించాలంటే మీ రెగ్యులర్ డైట్ లో మసాలాలను జోడించాలి.

చెమటలు పట్టేలా వ్యాయామాలు చేయాలి:

చెమటలు పట్టేలా వ్యాయామాలు చేయాలి:

రొటీన్ కు బిన్నంగా వ్యాయామాలు చేస్తూ చెమటలు పట్టించాలి. మోడల్స్ రోజుకు ఒక గంటకు పైగా వర్కౌట్స్ చేయడం వల్ల వారు ఫిట్ గా మరియు మంచి షేప్ కలిగి ఉంటారు.

ప్రోటీనులు :

ప్రోటీనులు :

మీ భోజనంలో ప్రోటీనులు ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. ప్రోటీన్స్ తో పాటు మంచి ఫ్యాట్స్ కలిగిన ఆహారాలను తీసుకోవాలి.

శరీరంను శుభ్రం చేసే మీల్స్:

శరీరంను శుభ్రం చేసే మీల్స్:

భోజనంలో శరీరంను డిటాక్సిఫై చేసే అనేక ఆహారాలున్నాయి. ఇవి త్వరగా బరువు తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతాయి. వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఇవి సమతుల్యం చేస్తాయి.

బరువును ట్రాక్ చేస్తుండాలి:

బరువును ట్రాక్ చేస్తుండాలి:

బరువు తగ్గించుకొనే క్రమంలో మరి ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవల్సిన విషయం, మీ రెగ్యులర్ డైట్ తో పాటు, రెగ్యులర్ వెయిట్ ను కూడా ట్రాక్ చేస్తుండాలి. ఏమాత్రం హెచ్చుతగ్గులు కనిపించినా వెంటనే జాగ్రత్తలు తీసుకొని క్రమంలో పెట్టడం ద్వార వారు ఎప్పుడు ఫిట్ గా హెల్తీగా కనబడుతుంటారు.

మాంసాహారం:

మాంసాహారం:

మోడల్స్ అనుసరించే డైట్ టిప్స్ ను మీరు కూడా అనుసరించాలని కోరుకుంటున్నట్లైతే, మీ రెగ్యులర్ డైట్ నుండి రెడ్ మీట్ ను తొలగించి లీన్ మీట్ కు ప్రాధాన్యత ఇవ్వాలి.

English summary

Diet Tips From Models To Lose Weight

Losing weight has become a major issue when it comes to women. As the year comes to a close, New Year resolutions are being thought about and dieting 'will' be on the top of the list for many women. As women usually think a lot in regard to weight loss, there are some who wonder how models stay the way they are - fit, beautiful and ever glowing no matter what they eat.
Desktop Bottom Promotion