For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఒక వారంలో మీ పొట్ట ఫ్లాట్ అయ్యే ఫిట్నెస్ టిప్స్

|

టమ్మీ ఫ్యాట్ ను పూర్తిగా తగ్గించుకొని, పొట్ట ప్లాట్ గా నాజుగ్గా ఉండాలని ఎవరి ఉండదు చెప్పండి. అలా ఫ్లాట్ టమ్మీ, లేదా ఫ్లాట్ ఏబ్స్ కలిగి ఉండాలని చాలా మంది కోరిక కలిగి ఉంటారు. ముఖ్యంగా యవ్వనస్తుల్లో ఈర్ష్య. ఎవరైనా నాజుగ్గా సన్నగా, పొట్టలేకుండా ఉన్నవారి చూస్తే, వారిని చూసి ఈర్ష్య పడటం సహజం. ప్రతి ఒక్కరూ వారికి నచ్చిన డ్రెస్సులను స్కిన్నీ డ్రెస్సులను వేసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతారు. అటువంటప్పుడు టమ్మీ ఎక్కువగా ఉంటే అందంగా కనబడరు కాబట్టి, మొదట టమ్మీ ఫ్యాట్ ను ఎలా కరిగించుకోవాలని చూస్తుంటారు.

టమ్మీ ఫ్యాట్ ను కరిగించుకోవడానికి అనేక మార్గాలు, పద్దతుల, చిట్కాలు, ఫుడ్స్ నెట్ లో హల్ చేస్తుంటాయి. అయితే, ఒక్క వారంలో టమ్మీ కరిగించుకోవడం సాధ్యమేనా? అవును సాధ్యమే. ఫ్లాట్ టమ్మీ పొందాలనుకుంటారు కానీ, వారు సరైన చిట్కాలను అనుసరించకపోవడంతో పలితాన్ని పొందలేరు. కాబట్టి ఫ్లాట్ టమ్మీ పొందాలంటే కొన్ని చిట్కాలు తప్పనిసరిగా 2 వారాలు లేదా అంతకంటే ఎక్కువ సమయమే పాటించాల్సి ఉంటుంది . అలా చేయడం వల్ల ఉత్తమ మరియు శాశ్వత ఫలితాలను పొందవచ్చు.

ఒక వారంలో పొట్ట ఫ్లాట్ గా పొందడానికి కొన్ని ఉపయోగకరమైన ఒక వారం టిప్స్ ను హైలైట్ చేయబడింది. మరియు ఈ చిట్కాలు రెండు వారాల పాటు అనుసరిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఈ టిప్స్ లో వర్కింగ్ టిప్స్ కొన్ని రోజులు చేయడం వల్ల ఫ్లాట్ టమ్మీ పొందవచ్చు. వర్క్ అవుట్స్ తో పాటు, డైట్ కూడా ఫర్ ఫెక్ట్ గా ఉంటే, పొట్టను తప్పకుండా ఫ్లాట్ గా మార్చుకోవచ్చు. అలా ఒక వారంలో రెండు వారాల్లో పొట్టను ప్లాట్ గా మార్చుకోగలిగినప్పుడు అలాగే కొనసాగించాలి. మరి ఆ ఎఫెక్టివ్ టిప్స్ ఏంటో ఒకసారి చూద్దాం:

షుగర్ ను తీసుకోవడం పూర్తిగా నివారించాలి:

షుగర్ ను తీసుకోవడం పూర్తిగా నివారించాలి:

టమ్మీ ఫ్యాట్ కు ప్రధాన కారణం పంచాదర తీసుకోవడం వల్లే. కాబట్టి, మీరు ప్రతి రోజూ రెగ్యులర్ గా తీసుకొనే పంచదారను కట్ చేస్తే టమ్మీ ఫ్యాట్ తప్పకుండా తగ్గుతుంది. ఇలా రెండు వారాలా పాటు క్రమం తప్పకుండా చేయాలి. రెండు వారాల్లో టమ్మీ తగ్గించుకోవాలంటే ఈ చిట్కా చాలా అవసరం . ముఖ్యంగా బేకరీ ప్రొడక్ట్స్, జంక్ ఫుడ్, ఐస్ క్రీమ్స్ మరియు పాలు టమ్మీకు చాలా చెడు చేస్తాయి. పొట్ట ఉదరంలో కొవ్వు ఏర్పడుటకు కారణం అవుతుంది.

సింగిల్ వెజిటేబుల్ డైట్:

సింగిల్ వెజిటేబుల్ డైట్:

ఒకటి రెండు వారల్లో టమ్మీ ఫ్లాట్ గా పొందాలంటే, మీరు తీసుకొనే ఆహారం మీద ఎక్కువ శ్రద్ద తీసుకోవాలి . మీరు సింగిల్ వెజిటేబుల్ డైట్ ను అనుసరించాలి లేదా సింగిల్ ఫ్రూట్ డైట్ ను కూడా అనుసరించవచ్చు . సహజంగా వెజిటేబుల్స్ టమోటో లేదా ఆకుకూరలు వంటివి టమ్మీ ఫ్లాట్ పొందడానికి అద్భుతంగా సహాయపడుతాయి. ఆపిల్స్ మరియు పైనాపిల్ కూడా టమ్మీ ఫ్లాట్ గా పొందడానికి బాగా సహాయపడుతాయి.

వ్యాయామం మరియు వ్యాయామం:

వ్యాయామం మరియు వ్యాయామం:

తక్షణం బరువు తగ్గించుకొని, టమ్మీ ఫ్లాట్ గా పొందాలంటే పొట్టను ఈ చిట్కాను తప్పనిసరిగా అనుసరించాల్సిందే. రోజుకు కనీసం 3-4గంట వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. ముఖ్యంగా ఎక్కువగా పొట్ట మీద ఎక్కువ శ్రద్ద పెట్టినప్పుడు కనీసం ఒక గంట వ్యాయామం తప్పనిసరి. వ్యాయామం మీ ఫ్యాట్ ను కరిగించడంతో పాటు, శాస్వత ఫలితాలను ఇస్తుంది . అందుకు జిమ్ లేదా యోగా లేదా ఇతర వ్యాయామాలు ఏదైనా చేయవచ్చు .

ప్రోటీనులను రెగ్యులర్ డైట్ లో పెంచాలి:

ప్రోటీనులను రెగ్యులర్ డైట్ లో పెంచాలి:

మన శరీరంలో కొవ్వును విచ్ఛిన్నం చేయడానికి ప్రోటీనులను చాలా అవసరం అవుతుంది. అందువల్ల, ఎంత ఎక్కువగా ప్రోటీనులను తీసుకుంటే అంత ఫ్యాట్స్ ను కరిగించుకోవచ్చు. రెగ్యులర్ డైట్ లో ఎక్కువ ప్రోటీనులున్న ఆహారంను తీసుకోవాలి. అందుకు ఫిజీషియన్ లేదా డాక్టర్ యొక్క సలహా తీసుకోవాలి. ఈ చిట్కాను ఎప్పుడూ అనుసరించాలి.

నీళ్ళు మరియు నిమ్మరసం:

నీళ్ళు మరియు నిమ్మరసం:

టమ్మీ ఫ్యాట్ కు కడుపు ఉబ్బరం కూడా ఒక కారణం అవుతుంది. కాబట్టి, ఈ కడుపు ఉబ్బరం మరియు జీర్ణ సమస్యలను నివారించుకోవడానికి ఒక గ్లాసు గోరువెచ్చని నీటికి నిమ్మరసం మరియు తేనె మిక్స్ చేసి ప్రతి రోజూ ఉదయం తప్పని సరిగా తీసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా ఒకటి రెండు వారలు లేదా ఇంకా కొద్దిరోజులు క్రమం తప్పకుండా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఫ్లాట్ టమ్మీని తప్పకుండా పొందవచ్చు.

English summary

Fitness Tips To Get A Flat Stomach In A Week

Who does not want a flat tummy to flaunt? The flat tummy or abs is getting popular not only among youth but middle aged women also do not like flabby stomachs. Every body wants to wear clothes that flaunt their perfect curves and sexy tummy.
Story first published: Wednesday, March 12, 2014, 16:14 [IST]
Desktop Bottom Promotion