For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కొత్త సంవత్సరంలో బరువు తగ్గించే ఫిట్ నెస్ టిప్స్

|

సాధారణంగా బరువు తగ్గించుకోవాలనే ఆలోచన లావుగా ఉన్న ప్రతి ఒక్కరికీ అనిపిస్తుంటుంది. కానీ బరువు తగ్గించుకొనే పద్దతులను అనుసరించడంలోనే వెనకడుగు వేస్తుంటారు. కారణం, టై కుదరలేదని, లేదా, బద్దకం, లేదా వాయిదాలు వేస్తుంటారు. అలాంటి వారు పాత సంవత్సరగానికి గుడ్ బై చెబుతూ కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ, కొత్త సంవత్సరంలో ఖచ్చితంగా బరువు తగ్గి, గ్రేట్ గా స్లిమ్ గా కనబడాలనే, తీర్మానాలను చేసుకోండి. బరువు తగ్గించుకోవడానికి సమయం లేకున్నా కూడా, అనేక మార్గాలున్నాయి. కానీ, ఫిట్ గా ఉండటం అనే చాలా ముఖ్యమైన అంశము. బరువు తగ్గాలనుకొనేవారు ముందుగా ఫిట్ గా ఉండాలనే వెయిట్ లాస్ ప్రోగ్రామ్ ను ఫిక్స్ చేసుకోవాలి.
అలా ఈ కొత్త సంవత్సరంలో నిజంగా బరువు తగ్గాలని, ఫిట్ మరియు హెల్తీ గా ఉండాలని కోరుకుంటున్న వారికోసం బోల్డ్ స్కై కొన్ని సులభ మార్గాలను అంధిస్తోంది. మీరు 2014సంవత్సరంలో ఎటువంటి తీర్మానాలు మీరు చేయకుండా ఉంటే, మొదట మీరు ఈ బరువు తగ్గించే తీర్మానాన్ని మీ లిస్ట్ లో టాప్ లో ఉంచుకోండి.

దీపావళి, క్రిస్మస్, న్యూఇయర్ హాలిడే సీజన్ లో అనుకోకుండా మీరు కొన్ని పౌండ్ల్ బరువును పెరిగి ఉంటే, ఆ బరువును తగ్గించుకోవడానికి ఇది మంచి సమయం. ఈ కొత్త సంవత్సర సందర్భంగా ఈ ఫిట్ నెస్ చిట్కాలు మీరు మరింత అందంగా కనబడేలా చేస్తాయి...

డైట్ ను సెట్ చేసుకోవాలి:

డైట్ ను సెట్ చేసుకోవాలి:

ఈ సంవత్సరం ప్రారంభంలో, ఒక ప్రధానమైన ఫిట్ నెస్ చిట్కా, మీరు హెల్తీ డైట్ చార్ట్ తో ప్రారంభించాలి. బరువు తగ్గడానికి ఇది ఒక ఉత్తమమైన అనుకూల ఆలోచన.

వ్యాయామం:

వ్యాయామం:

వ్యాయామం చేయడం మర్చిపోకండి . ఇది ఈ కొత్త సంవత్సరంలో పాటించాల్సిన మొదటి ఫిట్ నెస్ చిట్కావ. కొన్ని పౌండ్ల బరువును తగ్గించుకోండానికి వ్యాయామం కూడా ఇక ప్రధానమైన అంశం.

టీవి ముందు:

టీవి ముందు:

టెలివిజన్ ముందు కూర్చొని ఏ మాత్రం తినడకూదు. ఏమైనా సరే ఈ పనిని మాత్రం మానేయాలి. టీవి ముందుకూర్చొని తినడం వల్ల మీరు ఎంత తింటున్నారో మీకే తెలియకుండా మీరు ఎక్కువ తినవచ్చు.

ఒంటిగా వ్యాయామం:

ఒంటిగా వ్యాయామం:

వ్యాయామాన్ని ఒంటరిగా చేయడం చాలా ఉత్తమం. ఇతరులతో కలిసి వ్యాయామం చేయడం నిజంగా పనిచేయకపోవచ్చు. అందువల్ల, ఈ కొత్త సంవత్సరంలో బరువు తగ్గడానికి ఒక ఉత్తమ చిట్కా, ఒంటరిగా వ్యాయామం చేయడం.

పవర్ ఫుల్ ఫుడ్:

పవర్ ఫుల్ ఫుడ్:

మీరు డైట్ అనుసరిస్తున్నప్పుడు, మీరు ఆరోగ్యకరమైన సరైన పోషకాహారం, పవర్ఫుల్ ఫుడ్ ను తీసుకోవాలని గుర్తుంచుకోవాలి. ప్రోటీన్స్, న్యూట్రీషియన్స్ మరియు హెల్తీ ఫ్యాట్స్ తీసుకోవడం మీకు ఈ కొత్త సంవత్సరంలో బరువు తగ్గడానికి చాలా అవసరం.

తక్కువ మోతాదులో ఆహారం తీసుకోవడం అనుసరించండి:

తక్కువ మోతాదులో ఆహారం తీసుకోవడం అనుసరించండి:

రోజులో తక్కువ ఆహారం తీసుకోవడం వల్ల మీరు యాక్టివ్ గా మరియు హెల్తీ గా ఉంటారు . ఇది ఒక ముఖ్యమైన ఫిట్ నెస్ చిట్కా. దీన్ని మీరు ఖచ్చితంగా అనుసరించాల్సి ఉంటుంది. మద్యమద్యలో విరామం ఇస్తు రోజులో చాలా తక్కువ మోతాదలో మూడు, నాలుగు సార్లు తినడం వల్ల ఆకలిగా కూడా అనిపించదు.

మానసిక స్థితి:

మానసిక స్థితి:

మీరు ఫిట్ గా ఉండటానికి మీ మానసిక స్థితి కూడా ఒక కారణం. మీ మానసిక స్థితి బాగుండాలంటే మీ శరీరాన్ని హైడ్రేషన్ లో ఉంచుకోవాలి. బరువు తగ్గడానికి ఇది ఒక ఉత్తమ చిట్కా.

అప్పుడప్పుడు గమనిస్తుండటం:

అప్పుడప్పుడు గమనిస్తుండటం:

బరువు తగ్గడం రాత్రికి రాత్రే జరగకపోవచ్చు. కొన్ని నెలల్లో తప్పకుండా మార్పు కనిసితస్తుంది. కాబట్టి, పైన తెలిపిన చిట్కాలు పాటిస్తూనే, మీ బరువు తగ్గడాన్ని గమనిస్తుండాలి. అప్పుడే మీరు ఎంతవరకూ బరువు తగ్గాలో తెలుపుతుంది. అలాగే మీకు నచ్చిన సెలబ్రెటీని మనస్సులో ఉంచుకోవడం వల్ల అది మీలో చైతన్యం నింపుతుంది.

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్:

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్:

బరువు తగ్గాలనుకొనే వారు, ఈ కొత్త సంవత్సరం, మొదటి నెలలో వెజిటేరియన్ డైట్ ను పూర్తిగా అనుసరించాలి. అధికంగా మాంసాహారం తీసుకోవడం వల్ల మిమ్మల్ని దీర్ఘకాలంలో ఆరోగ్యంగా ఉంచదు.

చాక్లెట్:

చాక్లెట్:

ఒక బెస్ట్ అండ్ మోస్ట్ ఫ్రెండ్లీ ఫిట్ నెస్ చిట్కా మిల్క్ చాక్లెట్ ను నివారించి డార్క్ చాక్లెట్ ను తినడానికి ప్రయత్నించండి. ఈ డార్క్ చాక్లెట్ మిమ్మల్ని దీర్ఘకాలం జీవించేలా చేస్తుంది. మరియు ఇది గుండెకు చాలా ఆరోగ్యకరం.

కొచెన్ రూల్స్:

కొచెన్ రూల్స్:

ఈ నియమాన్ని చాలా మంది పాటించవకపోవచ్చు. మీరు స్లిమ్ గా కనబడాలని కోరుకుంటున్నట్లైతే, మీరు కొన్ని నియమాలు పాటించడం ఇప్పటి నుండే అనుసరించాలి. ఒక సారి డిన్నర్ ముగించుకొన్న తర్వాత తిరిగి కిచెన్ వైపు చూడకూడదు. కిచెన్ లోకి వెళ్ళడం వల్ల ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. దాంతో మీరు బరువును కంట్రోల్ చేయలేరు.

హెల్తీ ఫుడ్:

హెల్తీ ఫుడ్:

మీ డైలీ డైట్ లో ముఖ్యంగా చేర్చాల్సిన హెల్తీ ఫుడ్స్, పూర్తి పోషకాలు, ప్రోటీనులు, విటమిన్లు కలిగి ఉన్న హెల్తీ ఫుడ్స్ ను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. ముఖ్యంగా మీ రెగ్యులర్ డైట్ లో ఎగ్ వైట్ చేర్చుకోవడం చాలా అవసరం. ఎగ్ వైట్ లో ప్రోటీనులు మరియు ఆరోగ్యానికి మేలు చేసే ఫ్యాట్స్ కలిగి ఉన్నాయి. ఇది మీరు ఫిట్ గా ఉంచడానికి బాగా సహాయపడుతాయి. ఈ చిన్న చిన్న చిట్కాలను పాటించడం వల్ల ఈ కొత్త సంవత్సరంలో మీరు ఫిట్ గా ఉండటానికి బరువు తగ్గడానికి బాగా సహాయపడుతాయి...

English summary

Fitness Tips For The New Year

For those of you who are self conscious about your weight and wanting to look great, we have in store for you some of the possibilities which might help you loose that flab to become fab. This year 2014, the first thing on most of your resolutions list is to loose weight and to look great.
Desktop Bottom Promotion