For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బరువు తగ్గడం కొరకు : తేనె-గోరువెచ్చని నీరు

By Lakshmi Perumalla
|

తేనె ఆహారాలు మరియు పానీయాలలో మంచి ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన తీపి మూలంగా ఉన్నది. మన శరీరం ఫిట్ మరియు ఆరోగ్యకరముగా ఉండటానికి తేనె ఉపయోగపడుతుందని చాలా మంది వైద్యులు చెప్పుతున్నారు. తేనెను వినియోగించుకోవటానికి అనేక మార్గాలు ఉన్నాయి. మీరు ప్రతి రోజు ఒక చెంచా పచ్చి తేనెను త్రాగవచ్చు. అంతేకాకుండా పానీయాలు లేదా డిజర్ట్స్ లలో కలుపుకొని త్రాగవచ్చు. తేనెను ఉపయోగించే వారికీ వెచ్చని నీటిలో కలిపి తీసుకోవటం అనేది ఒక మంచి మార్గం.

వెచ్చని నీటితో తేనెను కలిపిన తర్వాత కొన్ని చుక్కల నిమ్మరసం కలపాలి. వెచ్చని నీటిలో తేనెను కలిపి త్రాగటం వలన బరువు తగ్గటానికి సహాయపడుతుంది. వాటి గురించి క్రింద తెలుసుకుందాము.
గోరువెచ్చని నీళ్ళు-తేనె మిశ్రమతో మరికొన్ని ఆరోగ్యప్రయోజనాలు: క్లిక్ చేయండి

జీర్ణక్రియ

జీర్ణక్రియ

ప్రతి రోజు ఉదయం వెచ్చని నీటితో తేనెను మరియు నిమ్మరసంను కలిపి త్రాగితే మంచి జీర్ణక్రియ కొరకు మరియు కడుపు క్లియర్ చెయ్యడానికి సహాయపడుతుంది. ఆహారం సరిగ్గా విచ్ఛిన్నం అవటానికి కాలేయంలో రసాలను ఉత్పత్తి చేయటంలో సహాయపడుతుంది.ఇది సులభంగా ఆహారంలో కలిసి జీర్ణ వాహిక సడలించడానికి సహాయపడుతుంది. కడుపు ఉబ్బరం మరియు అనవసరముగా బరువు పెరుగుటను నివారించేందుకు సహాయపడుతుంది.వెచ్చని నీటితో తేనె మరియు నిమ్మరసం అనేవి ఒక మార్గం ద్వారా బరువు తగ్గించడంలో సహాయపడతాయి.

ప్రక్షాళన

ప్రక్షాళన

వెచ్చని నీటిలో తేనె కలిపి త్రాగితే కడుపు ఉబ్బరం మరియు త్రేనుపు సమస్యలు కలిగించే అవాంఛిత విషాన్ని మరియు పదార్థాల నుండి శరీరంను శుభ్రపరుస్తుంది. అంతేకాక తరచుగా మూత్రవిసర్జనకు కారణమైన విషాన్ని తొలగించడానికి సహాయపడుతుంది. మూత్రం టాక్సిన్స్ క్రిందికి పంపి శరీరంను శుభ్రపరుస్తుంది. బరువుకు గణనీయమైన పెరుగుదలకు కారణం అయిన కలుషితాలు తొలగించటం ద్వారా బరువు తగ్గటానికి సహాయపడుతుంది. తేనెలో శుభ్రపరిచే లక్షణాలు ఉండుట వలన బరువు తగ్గించేందుకు సహాయపడుతుంది.

ఎనర్జీ బూస్టర్

ఎనర్జీ బూస్టర్

తేనె మరియు వెచ్చని నీరు ఒక అద్భుతమైన ఎనర్జీ బూస్టర్ గా పనిచేస్తాయి. శరీరంలో అధిక స్థాయిలో శక్తిని ఉత్పత్తి చేసి శరీరం యొక్క జీవక్రియను పెంచటానికి సహాయపడుతుంది. తేనె సరైన పని కొరకు శరీర అవయవాలను ప్రేరేపిస్తుంది. ఎక్కువ జీవక్రియ జరుగుటవలన కేలరీలు కరుగుతాయి. కేలరీలు మరియు కొవ్వులు బర్న్ అవుట వలన క్రమంగా బరువు తగ్గుతారు. ప్రతి రోజు ఉదయం నిమ్మతో కూడిన వేడి నీటిని తీసుకుంటే రోజంతా శక్తి కలిగి ఉంటారు.

ఆకలి కోరిక

ఆకలి కోరిక

వెచ్చని నీటితో తేనెను మరియు నిమ్మరసం ను కలిపి త్రాగితే ఆకలి కోరికలను తగ్గిస్తుంది. ఉదయం క్రమం తప్పకుండా తీసుకుంటే రోజులో తీసుకొనే ఆహారం మొత్తం తగ్గుతుంది. తేనె మరియు నిమ్మతో కూడిన వెచ్చని నీరు ఆకలి కోరికలను,చక్కెర స్థాయిని తగ్గించుట,తగినంత శక్తిని అందిస్తుంది. అంతేకాక ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అందువలన ప్రతి రోజు ఉదయం ఒక గ్లాస్ వెచ్చని నీటితో తేనెను మరియు నిమ్మరసం ను త్రాగటం మొదలు పెడితే గణనీయంగా బరువు కోల్పోతారు.

పోషకాలు మరియు విటమిన్లు

పోషకాలు మరియు విటమిన్లు

తేనె మరియు నిమ్మతో కూడిన వెచ్చని నీరు శరీర రోగనిరోధక శక్తి పెంచడానికి సహాయపడుతుంది.ఇది బరువు తగ్గించేందుకు సహాయపడే అవసరమైన యాంటీ ఆక్సిడెంట్లు,విటమిన్లు మరియు పోషకాలను కలిగి ఉంటుంది. ఇది పొట్ట యొక్క ఉబ్బరం నివారించడానికి సహాయపడే వ్యతిరేక శోథ లక్షణాలు ఉంటాయి. ఆ విధంగా తేనె మరియు నిమ్మతో కూడిన వెచ్చని నీటితో బరువు తగ్గించేందుకు సహాయపడే కొన్ని మార్గాలను తెలుసుకున్నాము.

English summary

honey with warm water for weight loss

Honey is a very healthy and yummy source of sweetness in foods and drinks. Regular intake of honey is advised by many doctors to keep the body fit and healthy. There are many ways to consume honey. You can eat one spoon raw honey every day; mix it with beverages or in deserts. One good way of consuming honey is by mixing it in warm water.
Desktop Bottom Promotion