For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పదే పది రోజుల్లో చిరు బొజ్జను కరిగించడం ఎలా

By Super
|

పది రోజుల్లో పొట్ట కరిగించడం సాధ్యమేనా? ఆశ్చర్యంగా ఉంది కదూ, అవును పది రోజుల్లో చిరుబొజ్జను కరిగించడం అంత కష్టమైన పని కాదు. రెగ్యులర్ డైట్ లో సరైన మార్పులో, లైఫ్ స్టైల్ మరియు వ్యాయామంలో చిన్న మార్పులు చేసుకోవడం వల్ల ఫ్లాట్ టమ్మీని 10 రోజుల్లో పొందవచ్చు. ఒక ప్రత్యేకమైన డైటరీ ఫుడ్ మరియు వ్యాయామం పద్దతులను అనుసరించడం వల్ల ఆబ్డామినల్ ఫ్యాట్(పొట్ట ఉదరంలో)కొవ్వు కరిగించుకోవడం పొట్టను ఫ్లాట్ గా మార్చుకోవడం సాధ్యం అవుతుంది.

శరీరం యొక్క మొటబాలిజం రేటును పెంచుకోవడమే , శరీరంలోని కొవ్వు నిల్వలను తగ్గించుకోవడానికి అద్భుతంగా సహాయపడుతుంది. పది రోజుల్లో ఫ్లాట్ టమ్మీ పొందడానికి ఈ క్రింది స్ట్రాటజీని అనుసరించండి.

డే 1:

డే 1:

పది రోజుల్లో ఫ్లాట్ టమ్మీ పొందలంటే మొదట మీ ఇంట్లో నుండి జంక్ ఫుడ్స్ ను నివారించండి. జంక్ ఫుడ్ కు బదులుగా న్యూట్రీషియన్ ఫుడ్స్ తో నింపండి. అలాగే ఫైబర్ అధికంగా ఉన్న ఆహారాలు అంటే పండ్లు , వెజిటేబుల్స్, పౌల్ట్రీ, లీన్ బీఫ్ , త్రుణ ధాన్యాలు, లోఫ్యాట్ డైరీప్రొడక్ట్స్ , బీన్స్, నట్స్, సీడ్స్ మొదలైన వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. హాట్ డాగ్స్ లేదా సాసేజస్ లేదా క్యాండీ బార్స్ వంటివి మీ ఇంట్లో నిల్వ చేయకూడదు. అన్ని రకాల కార్బోహైడ్రేట్ ఫుడ్స్ ను నివారించాలి. రోజుకు 10-12 గ్లాసుల నీరు త్రాగడం ప్రారంభించాలి. ఇలా చేయడం వల్ల శరీరంలోని జీవక్రియలను శుభ్రం చేస్తుంది. దాంతో శరీరంలోని కొవ్వును తొలగిస్తుంది. అలాగే ఒకటి లేదా 3 రోజులు ఉపవాసం ఉండటం, ఆరోజుల్లో కేవలం 3-5ఆపిల్ సైడర్ వెనిగర్ ను తీసుకోవాలి.

*రెండు చెంచాల ఆర్గానిక్ ఆపిల్ సైడర్ వెనిగర్ మరియు ఒక చెంచా తేనెను ఒక గ్లాసు నీటిలో మిక్స్ చేసి తీసుకోవాలి.

* దీన్ని రోజుకు రెండు మూడు సార్లు తీసుకుంటే, కొవ్వు తగ్గడం ప్రారంభం అవుతుంది.

డే 2 :

డే 2 :

రెండవ రోజున ఉడికించిన లేదా పచ్చి కూరలు తీసుకోవాలి. అలాగే వెజిటేబుల్ సూప్ లేదా చికెన్ సూప్ ను తీసుకోవడం వల్ల బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది. అయితే ప్రతి రెండు మూడు గంటలకొకసారి ఏదోఒకటి తీసుకొనేలా చూడాలి. ఇది శరీరం యొక్క మెటబాలిక్ రేటును పెంచుతుంది మరియు బ్లడ్ షుగర్ లెవల్స్ ను క్రమబద్దంగా ఉంచుతుంది. అలాగే 5నుండి6 సార్లు వరకూ పండ్లు మరియు వెజిటేబుల్స్ తీసుకోవడం వల్ల ఆకలి కోరికలు తగ్గుతాయి. కార్బోహైడ్రేట్ ఫ్రూట్స్ అంటే అరటిపండ్లు, ఆపిల్ వంటి తీసుకోవాలి. అలాగే మీరు రెగ్యులర్ గా వ్యాయామం చేస్తుంటే కనుక, ఆ వ్యాయామంను అలాగే కొనసాగించాలి . డైట్ లో ఈ మార్పులు చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

డే 3 :

డే 3 :

మీరు తీసుకొనే బ్రేక్ ఫాస్ట్ లో 50శాతం కార్బోహైడ్రేట్స్ ను తీసుకోవాలి . మీరు త్వరగా కొవ్వును కరిగించుకోవాలంటే, లోకార్బో డైట్ తీసుకోవడం చాలా అవసరం, ఒక కప్పు ఓట్ మీల్ లో 50 గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. మీరు తీసుకొనే ఇతర మీల్స్ లో లీన్ ప్రోటీన్ కలిగిన ఆహారాలను కొద్దిగా తీసుకోవాలి. మీరు హైప్రోటీన్ కలిగిన పెరుగు, ఫ్రెష్ ఫ్రూట్స్ మరియు వెజిటేబుల్స్ ను స్నాక్ టైమ్ ల తీసుకోవాలి. శరీరంలో కొవ్వు తగ్గించుకోవడానికి లోఫ్యాట్ కలిగిన ఆలివ్ ఆయిల్, లేదా ఫిష్ ఆయిల్ ను తీసుకోవాలి. అలాగే మొయోనైజ్ ను, మార్గరైన్, బట్టర్, ఇతర వెజిటేబుల్ ఆయిల్స్ కూడా తీసుకోవాలి. అలాగే ప్రాణాయమం వంటి వ్యాయామాలు చేయడం బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడానికి అద్భుతంగా సహాయపడుతాయి.

* ఉదరం భాగంలో లోయర్ బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడానికి ప్రాణాయమం బాగా సహాయపడుతుంది. అందుకు ఊపిరి గట్టిగా పీల్చి కొన్ని సెకండ్లు అలాగే ఉండి తర్వాత ఊపిరి నిదానంగా వదలాలి.

* ఈ వ్యాయామంను కనీసం 10 సార్లు చేస్తే ఉత్తమ ఫలితం ఉంటుంది.

డే 4:

డే 4:

నాల్గవ రజున ఓట్ మీల్ తో పాటు, మూడు గుడ్లులలోని తెల్లపదార్థంను తీసుకోవాలి మరియు కూరగాయాలు లేదా ఆకుకూరలను మీ బ్రేక్ ఫాస్ట్ లో చేర్చుకోవాలి. అలాగే మీరు స్నాక్ గా రెడ్ పెప్పర్ తో తయారుచేసిన చికెన్ లేదా కీరదోషకాయతో వండిన టర్కీ బ్రెస్ట్ ను తీసుకోవచ్చు. అలాగే వెజిటేబుల్స్, చికెన్, ఆలివ్ ఆయిల్ తో తయారుచేసిన లచ్ ను లచ్ సమయంలో తీసుకోవచ్చు . అలాగే ఆకలివేసినప్పుడు నట్స్ తీసుకోవచ్చు . ఇది ఆకలి కరికను తగ్గిస్తుంది. అలాగే కొన్ని క్రంచెస్ చేయడం వల్ల పొట్ట ఉదరబాగంలో కొవ్వు కరుగుతుంది.

* తలక్రిందిబాగంలో చేతులను ఉంచి నిటారుగా వెళ్లకిలా పడుకోవాలి. పాదాలను ఫ్లోర్ కి ఆనించి, అలాగే నిధానంగా మోకాలును ముందుకు బెడ్ చేయాలి.

*పొట్ట యొక్క కండరాలు వదులవ్వాలంటే క్రంచెస్ బాగా సహాయపడుతాయి.కాబట్టి చేతులను ఫ్లోర్ మీద ఉంచి, సపోర్ట్ గా ఉంచి భుజాలను పైకి లేపాలి.

* ఇలా రెండు మూడు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

డే 5 :

డే 5 :

అలాగే డే 5న లోఫ్యాట్ మిల్క్ మరియు పండ్లు తీసుకోవాలి. అలాగే ఒకటి లేదా రెండు అరటిపండ్లు కూడా తీసుకోవాలి. ఇది మీ శరీరంకు అవసరం అయ్యే కార్బోహైడ్రేట్స్ ను అందిస్తుంది. అలాగే బెజిటేబుల్ సూప్ లేదా సలాడ్స్ తీసుకోవడం వల్ల పొట్ట నిండుగా ఉన్న అనుభూతి కలిగిస్తుంది . అలాగే శరీరంకు అవసరం అయ్యే పోషకాలను అందిస్తుంది. అలాగే ఎక్కువగా నీరు తీసుకోవాలి. కొద్దిపాటి వ్యాయామం ఖచ్చితంగా అవసరం అవుతుంది.

* ఫ్లోర్ మీద వెళ్ళకిలా పడుకొని మోకాళ్ళను ముందుకు ముడుచుకొని చేతులను బాగా చాపి పాదాలను త్రాకేవిధంగా పడుకోవాలి.

* ప్రాణాయామం తప్పనిసరిగా అనుసరించాలి.

* గాలి పీల్చి మరియు గాలి వదలడం వల్ల కొవ్వు కరగడానికి సహాపడుతుంది.

డే 6:

డే 6:

అలాగే డే 6న గ్రీన్ బీన్స్ గుడ్డు మరియు టమోటో లను బ్రేక్ ఫాస్ట్ లో చేర్చుకోవాలి. అలాగే కోడ్ ఫిల్లెట్ లేదా గ్రిల్డ్ చికెన్ బ్రెస్ట్ ను స్నాక్ గా తీసుకోవాలి. అలాగే చేపలు లేదా లీన్ మీట్ తీసుకోవచ్చు. అలాగే పండ్లు మరియు కూరగాయాలు తీసుకోవడం మర్చిపోకండి . వీటితో పాటు చిన్న పాటి నడక మరియు సిటప్స్ చేయండి.

* క్రమంగా క్రంచెస్ మరియు సిటప్స్ ను పెంచాలి. త్వరగా కొవ్వు తగ్గించుకోవాలంటే ఇలా చేయడం ఉత్తమం.

డే 7:

డే 7:

మీరు గ్రిల్డ్ లేదా బాయిల్డ్ చికెన్ లేదా డక్ బ్రెస్ట్ ను బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవాలి. వీటితో పాటు ఉడికించిన ఆకుకూర లేదా గ్రిల్డ్ టమోటోలను తీసుకోవచ్చు. ఇంకా బ్రాజిల్ నట్స్ లేదా వాలర్ మెలోన్ సీడ్స్ లేదా స్టీమ్డ్ బ్రొకోలీని స్నాక్ గా తీసుకోవాలి. మీరు వ్యాయమంలో కొద్దిపాటి మార్పలు అవసరం. ప్రతి రోజూ ఏరోబిక్స్ వ్యాయామం చేస్తే ఉత్తమ ఫలితం ఉంటుంది.

* వ్యాయామంల మార్పులు చేసుకోవడం ద్వారా శరీరానికి ఒక షాక్ లా అనిపిస్తుంది. మరియు శరీరంలో జీవక్రియలను వేగవంతం చేస్తుంది . దాంతో బెల్లీ ఫ్యాట్ త్వరగా కరగడానికి సహాయపడుతుంది.

* అలాగే అరగంట పాటు ఏరోబిక్స్ వ్యాయమం చేయాలి.

డే 8:

డే 8:

తక్కువ పోషకాలున్న ఆహారంను తీసుకోకండి. బ్రేక్ ఫాస్ట్ కు వీట్ బ్రెడ్ మరియు వైట్ ఆమ్లెట్ ను తీసుకోవాలి. అలాగే 10 నుండి 12 గ్లాసుల నీరు తప్పనిసరిగా తీసుకోవాలి.అలాగే హెల్తీ స్నాక్ అంటే సోకా క్రిప్స్ పెరుగులో డిప్ చేసి తీసుకోవాలి.

* రెగ్యులర్ వ్యాయామం కంటే, స్విమ్మింగ్ కు ప్రాధాన్యత ఇవ్వండి ,

డే 9:

డే 9:

తిరిగి వెజిటేరియన్ డైట్ ను అనుసరించండి. చాలా తక్కువ క్యాలరీలున్న వెజిటేబుల్స్ ను రోజుమొత్తంలో తీసుకోవాలి. ఇది మీ డైజెస్టివ్ సిస్టమ్ ను క్లీన్ చేయడానికి సహాయపడుతుంది. దాంతో శరీరంలో కొవ్వు నిల్వలు కరిగించడానికి సహాయపడుతుంది. మరింత ఉత్తమ ఫలితం కోసం ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి.

* 30 నిముషాల నుండి 40 నిముషాలు వాకింగ్ సమయాన్ని పెంచాలి.

* క్రంచెస్ చేయడం మరియు సిటప్స్ చేయడం లేదా స్విమ్మింగ్ లేదా ఏరోబిక్స్ చాలా మంచిది.

డే 10:

డే 10:

ఇక పదివ రజున బ్రేక్ ఫాస్ట్ గా గోధుమలతో తయారుచేసిన ఆహారాలకు మరియు పండ్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. లోఫ్యాట్ కలిగి, అధిక ఫైబర్ కలిగిన స్నాక్స్ మరియు సూప్స్ తీసుకోవడం చాలా అవసరం. అలాగే వ్యాయామం చేయడం మర్చిపోకండి . రోప్ జంపింగ్ లేదా లెగ్ టక్ ఎక్సర్ సైజ్ చేయాలి . లోషుగర్, లో కార్బోహైడ్రేట్స్ కలిగిన డైట్ కు ప్రాధాన్యత ఇస్తే ఫాస్ట్ గా ఫ్లాట్ టిమ్మీని పొందవచ్చు.

Story first published: Thursday, October 2, 2014, 8:46 [IST]
Desktop Bottom Promotion