For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇష్టంగా, ఇష్టమైనవి తినాలి కానీ బరువు తగ్గాలి ఎలా?

|

నాజూకైన సన్నని నడుము, తీరైన శరీర సౌష్టవం ఇప్పుడు అపురూపమైపోయాయి. ఈ ఉరుకుల పగుల జీవితంలో మారిన పరిస్థితులు, ఆహారపు అలవాట్లలో వచ్చిన పెను మార్పులు నాజూకు శరీరాన్ని దూరం చేస్తున్నాయి. సన్నబడాలంటే తినడం తగ్గించాలి కానీ, కడుపునిండా తినమంటున్నారేమిటి అని ఆశ్చర్యపోతున్నారా! ఇష్టమైన ఆహారాలు తిన్నా నాజూగ్గా ఎలా ఉండవచ్చో చూద్దాం....

సన్నగా కనబడడానికి, సన్నబడడానికి చాలా మంది టీనేజర్స్ పడరాని పాట్లు పడుతున్నారు. జిమ్‌ ల చుట్టూ తిరుగుతున్నారు. బ్యూటీషియన్లకు వేలకు వేలు సమర్పించుకుంటున్నారు. ఇన్ని తిప్పలు పడినా ఫలితం ఆవగింజలో అరభాగం కూడా వుండడంలేదు. వీరి ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. కొన్ని రోజుల పాటు కొన్ని రకాల జబ్బులు కూడా వచ్చి పడుతున్నాయి. రోజుల తరబడి కడుపు మాడ్చుకోవడం వలన జీవప్రక్రియ దెబ్బతింటుంది. దీని ప్రభావం కండరాల మీద పడుతుంది. చిన్న వయసులోనే కీళ్ళనొప్పులు, ఎక్కువ దూరం నడవలేకపోవడం వంటివి బాధిస్తాయి.

ఒక పౌండ్ ఫ్యాట్ , 3500క్యాలరీలకు సమానం. 500 క్యాలరీలను కరిగించుకోవడం కోసం డైట్ మరియు వ్యాయామంలో మార్పులు చేసుకుంటే ఒక వారంలో ఒక పౌండ్ బరువు తగ్గవచచు. మీరు ప్రస్తుతం ఉన్న బరువును అలాగే మెయింటైన్ చేస్తూ క100క్యాలరీలను తగ్గించుకోవడం, పెద్దవారిలో ప్రతి సవంత్సరం అధనపు 1 లేదా రెండు పౌండ్లు పెరగకుండా చూసుకోవచ్చు.

తప్పనిసరిగా తినాలి:

తప్పనిసరిగా తినాలి:

శరీరంలో అన్ని అవయవాలు సక్రమంగా తమ పని తాము చేసుకుపోవాలంటే ఆహారం తీసుకోవడం తప్పనిసరి. రోజంతా చురుకుగా పనిచేయాలంటే కేలరీలు తప్పనిసరి. పౌష్టికాహారం తీసుకోవడం ద్వారానే కేలరీలు పొందడం సాధ్యమవుతుంది. కొన్ని రోజుల పాటు ఉపవాసాలు చేసి, ఆ తరువాత కేలరీల వినియోగం గణనీయంగా తగ్గిపోతుంది. కేలరీలు వినియోగం తగ్గినప్పుడు కొవ్వు వచ్చి చేరుతుంది.

ఆహారంలో ఎక్కువ భాగం గింజలు వుండే విధంగా ప్లాన్ చేసుకోవాలి:

ఆహారంలో ఎక్కువ భాగం గింజలు వుండే విధంగా ప్లాన్ చేసుకోవాలి:

తీసుకొనే ఆహారాన్నే మూడు లేదా నాలుగు భాగాలుగా విభజించుకోవాలి. ప్రొటీన్లు తీసుకోవడం తప్పనిసరి, ప్రొటీన్లు మిమ్మల్ని ఉత్సాహంగా, ఉల్లాసంగా వుంచుతాయి. గంటల తరబడి పనిచేసినా నీరసం రాకుండా ప్రొటీన్లు కాపాడతాయి. తృణధాన్యాలు తీసుకొనేటప్పుడు ఫైబర్ అధికంగా వున్నవాటినే తీసుకోవాలి. దీనితోబాటు చక్కెర తక్కువ వున్నవాటినే ఎంపిక చేసుకోవాలి. పప్పుదినుసులు లేదా పప్పులలో అమైనో యాసిడ్లు సమృద్ధిగా ఉంటాయి, కాలరీలు, కొవ్వు తక్కువగా ఉంటాయి. మొలకెత్తిన గింజలలో అమైనో యాసిడ్లు సమృద్ధిగా ఉంటాయి, వీటిని మీ ఆహారంలో చేర్చుకోవచ్చు.

రోజుకు కనీసం ఐదు రకాల పండ్లన్నా తీసుకోవాలి:

రోజుకు కనీసం ఐదు రకాల పండ్లన్నా తీసుకోవాలి:

తాజా పండ్లు కూరగాయలలో విటమిన్లు, ఫైబర్ అధికంగా లభిస్తాయి. 60 నుంచి 70 శాతం ఆహారం తీసుకొని మిగతా 30 నుంచి 40 శాతం నీటిని తాగాలి. అంటే రోజుకి 12 గ్లాసుల నీరు తాగడం తప్పనిసరి. బేకరీ ఉత్పత్తులకు పూర్తిగా దూరం కాకుండా తీసుకొనే పరిమాణాన్ని తగ్గించుకుంటే సరిపోతుంది. బేకరీ ఉత్పత్తులతో పాటు పళ్ళు కూరగాయలు తీసుకుంటే శరీరానికి కావలసిన విటమిన్లు, పోషకాలు అందుతాయి.

శరీరాన్ని కష్టపెట్టే వ్యాయామాల కన్నా రోజూ కొంత సేపు నడిస్తే మంచిది:

శరీరాన్ని కష్టపెట్టే వ్యాయామాల కన్నా రోజూ కొంత సేపు నడిస్తే మంచిది:

కనీసం అరగంటకి తక్కువ కాకుండా నడవడం అలవాటు చేసుకోవాలి. రోజు మొత్తంలో ఏ సమయంలోనైనా నడవచ్చు. అయితే తెల్లవారుజామున నడిస్తే ఫలితాలు మరింత మెరుగ్గా వుంటాయి. మీడైట్ ప్లాన్‌ ను తరచూ మార్చకుండా కొన్ని వారాల పాటు కొనసాగించాలి. మూడు నాలుగు వారాలకొకసారి మాత్రమే డైట్ ప్లాన్‌ ను మార్చాలి. తరచూ మార్చడం వలన జీవప్రక్రియ దెబ్బతింటుంది.

క్యాలరీలు కరిగించే వ్యాయామం:

క్యాలరీలు కరిగించే వ్యాయామం:

ప్రతి రోజూ వంద క్యాలరీలన్ కరిగించుకోవడం వల్ల సంవత్సరానీకి 10పౌండ్ల బరువును తగ్గించుకోవచ్చు. వీటిలో ఏదో ఒకదాన్ని ప్రయత్నించండి: 1. నడక: 20 నిముషాలు2. గార్డెన్ లో కలుపు తీయడం లేదా పువ్వులు కోయడం 20 నిముషాలు, పచ్చిక కోయడం 20 నిముషాలు, అరగంట పాటు ఇంటిని శుభ్రం చేయడం, పది నిముషాలు జాగింగ్ చేయడం.

మాంసాహారం తక్కువ చేయండి:

మాంసాహారం తక్కువ చేయండి:

తరచూ శాఖాహారాన్ని తీసుకోవడం వల్ స్లిమ్ గా మారడానికి అలవాటు పడుతారు. మాంసాహారం కంటే శాఖాహారం బరువు తగ్గడానికి బాగా సహాయపడుతుంది. బర్గర్, లెంటిల్స్, సూప్స్, మరియు ఇతర టేస్టీ లెగ్యుమ్ జాతీ ఆహారాలు ఫైబర్ తో నిండి ఉంటాయి.

గ్రీన్ టీ:

గ్రీన్ టీ:

రెగ్యులర్ గా గ్రీన్ టీ తాగడం, బరువు తగ్గించుకోవడంలో ఒక స్ట్రాటజీ ఉంది. గ్రీన్ టీ బరువు తగ్గించటంలో చాలా ప్రభావవంతముగా పనిచేస్తుందని కనుగొన్నారు. అలాగే బరువు నష్టం చికిత్సలో ఏటువంటి ఆహార నియంత్రణ లేకుండా బరువు క్షీణత మాత్రలు సహాయం చేస్తాయి. మరిగే నీటిలో ఉత్తమ నాణ్యత గల గ్రీన్ టీ ఆకులను వేసి కొన్ని నిమిషాల పాటు అలా ఉంచి వడకట్టండి. ఈ గ్రీన్ టీని రోజులో 2 నుంచి 3 సార్లు త్రాగితే కనిపించే ఫలితాలను మీరే చూడండి.

అల్పాహారంగా ఓట్స్:

అల్పాహారంగా ఓట్స్:

ఓట్మీల్ కరగని ఫైబర్ ని కలిగి ఉంటుంది, దీన్లో మీకు ఎక్కువ సమయం ఆకలి కాకుండా ఉండే కొన్ని కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, అవి మీకు మంచి బలాన్ని చేకూరుస్తాయి. ఆరోగ్య స్పృహ కలిగి ప్రజలకు ఓట్ మీల్ ఒక ఆరోగ్యకరమైన హెల్తీ బ్రేక్ ఫాస్ట్ రిపిపి. అందువల్లనే ఓట్ మీల్ పొట్టను ఫుల్ గా ఉండాలా చేస్తుంది మరియు దీర్ఘకాలం ఆకలి కాకుండా నియంత్రిస్తుంది. ఇందులో ఆకలి తగ్గించే ఫైబర్ వీటిని బీటా గ్లూకాన్స్ వంటివి పుష్కలంగా ఉండి తిన్న ఆహారం నిధానంగా జీర్ణం అయ్యేలా చూస్తుంది. దాంతో ఆకలి తగ్గుతుంది.

నిద్ర:

నిద్ర:

రాత్రుల్లో లేటుగా కాకుండా, ప్రతి రోజూ ఒక నియమిత సమయానికి పడుకొని రాత్రుల్లో ఎక్కువ సమయం నిద్రపోవడం వల్ల సంవత్సరంలో 14పౌండ్ల బరువుతగ్గవచ్చని మిచిగన్ యూనివర్సిటీ పరిశోధనలో తేలింది . నిద్ర పనిలేకుండా కార్యకలాపాలు, సాధారణ బుద్దిహీన అల్పాహారం, వల్ల మీరు అప్రయత్నంగా 6% కేలరీలను తగ్గించగలదు అని నిరూపించారు.

ఎక్కువ తింటున్నాం కాబట్టి ఎక్కువసేపు వ్యాయామం చేయాలనుకోవటం పొరబాటని నిపుణులు అంటున్నారు:

ఎక్కువ తింటున్నాం కాబట్టి ఎక్కువసేపు వ్యాయామం చేయాలనుకోవటం పొరబాటని నిపుణులు అంటున్నారు:

కొద్దిపాటి వ్యాయామాలతో అందంగా ఆరోగ్యంగా వుండడం సాధ్యమవుతుంది. మీ ఆహారపు అలవాట్లని మార్చుకొన్నట్లయితే అందాన్ని పదికాలల పాటు కాపాడుకోవచ్చు. ప్రతి మూడు లేదా నాలుగు గంటలకొకసారి ఆహారం తీసుకుంటూ వుండాలి (నిద్రపోయే సమయంలో తప్ప). కడుపును ఖాళీగా వుంచితే గ్యాస్ చేరే అవకాశం వుంది. కాబట్టి మూడు నాలుగు గంటలకు మించి కడుపును ఖాళీగా వుంచుకోకండి.

English summary

How to lose weight without dieting

Are you looking for ways to loss weight without dieting? Weight put up is the most common problem in today’s lifestyle. Many people often go on diet but after some days they fail to support rules of dieting and again turn to their usual meals.
Story first published: Saturday, March 15, 2014, 13:14 [IST]
Desktop Bottom Promotion