For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బరువు పెరుగుతామనే భయం లేదు,నిరభ్యతరంగా తివనవచ్చు

|

జాక్ ఫ్రూట్ (పనసకాయ)చూడగానే నోరూరిస్తూ కలర్ ఫుల్ గా ఉంటుంది. ముఖ్యంగా ఇవి మన ఇండియాలో ఎక్కువగా అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా కేరళ, తమిళనాడు, కర్ణాటకాలో ఎక్కువగా పండిస్తారు. పండిచడం మాత్రమే కాదు, తినడం కూడా ఎక్కువే. పనసకాయలో న్యూట్రిషియన్ తక్కువ అని చాలా అనుకుంటారు. అయితే ఇతర పండ్లలో లాగే వీటిలో కూడా అధిక న్యూట్రీషియన్స్ కలిగి ఉంటుంది. పనసకాయలో అధిక పోషకాంశాలతో పాటు, న్యూట్రీషియన్స్ కూడా ఎక్కువే.

పనసకాయలోని ముఖ్యమైన హెల్త్ బెనిఫిట్ ఇది మన శరీరంలో అదనపు కిలలో బరువు తగ్గించడంలో అద్భుతంగా సహాయపడుతుంది. బరువు పెరుగుతామనే ఎటువంటి భయం లేకుండా సంతోషంగా వీటిని తినవచ్చు. పనసకాయ బరువు పెరగనివ్వదు. మరియు ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. మరి బరువు తగ్గించడంలో ఎలా సహాయపడుతుందో చూద్దాం..

Jackfruit For Weight Loss?

1. లోఫ్యాట్: పనసకాయలో సాచురేటెడ్ ఫ్యాట్స్ చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి, పనసకాయ వల్ల బరువు పెరగము అనేది వాస్తవం. ఈ పండులో చాలా వరకూ ఫ్యాట్స్ చాలా తక్కువగా ఉంటుంది. బరువు పెరుగుతామనే భయం లేకుండా ఎక్కువగా తీసుకోవచ్చు . బరువు తగ్గాలనుకొనే వారు పనసకాయను నిరభ్యంతరంగా తీసుకోవచ్చు.

2. తక్కువ సోడియం: జాక్ ఫ్రూట్(పనసకాయలో)చాలా తక్కువ సోడియం కంటెంట్ కలిగి ఉంది. ఇది కూడా బరువు తగ్గడానికి చాలా అద్భుతంగా సహాయపడుతుంది. అందువల్ల, తక్కువ సోడియం కంటెంట్ బరువు పెరగకుండా సహాయపడుతుంది. సోడియం కంటెంట్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల బరువు పెరగడం జరుగుతుంది. కాబట్టి బరువు తగ్గాలని కోరుకొనే వారికి ఇది ఒక ఉత్తమ ఎంపిక . బరువు తగ్గాలనుకొనే వారు జాక్ ఫ్రూట్ తినడం ఖచ్చితంగా ఆరోగ్యకరమైనది.

3. ఫైబర్ అధికంగా ఉంటుంది: జాక్ ఫ్రూట్ లో అధికంగా ఫైబర్ కంటెంట్ కలిగి ఉంటుంది. ఈ ఫైబర్ ఫ్యాట్ లేయర్స్ ను బ్రేక్ చేయడానికి మరియు శరీరంలో కొవ్వు కరిగించడానికి సహాయపడుతుంది. అందుకు మనం తీసుకొన్న ఆహారం త్వరగా జీర్ణం అవ్వడానికి సహాయపడుతుంది. అలాగే డైజెస్టివ్ సిస్టమ్ ను క్లియర్ చేస్తుంది. ఫైబర్ కంటెంట్ శరీరానికి ఎనర్జీని అందిస్తుంది. మరియు జీవక్రియలను వేగవంతం చేస్తుంది. కాబట్టి, బరువు తగ్గాలనుకొనే వారికి ఇది ఒక ఆరోగ్యకరమైన చాయిస్.

4.పోషకాలు మరియు న్యూట్రీషియన్స్: జాక్ ఫ్రూట్ లో విటమిన్స్, మినిరల్స్ మరియు న్యూట్రీషియన్స్ శరీరానికి అవసరం అయ్యేన్ని ఉన్నాయి. జాక్ ఫ్రూట్ లో శరీరాన్నిడిటాక్సిఫై చేసే న్యూట్రీషియన్స్ పుష్కలంగా ఉన్నాయి.ఈ హెల్తీ న్యూట్రీషియన్స్ అదనపు కిలోల బరువును తగ్గిస్తాయి. దాంతో పాటు ఆరోగ్యాన్ని అందివ్వడంతో పాటు, చర్మం, జుట్టు మరియు శరీరానికి ఇతర న్యూట్రీషినల్ బెనిఫిట్స్ కూడా అందిస్తాయి.

English summary

Jackfruit For Weight Loss?

Jackfruit is a pulp fruit available in the coastal states of India. It is largely grown and eaten in the states of Kerala, Tamil Nadu and Karnataka. Jackfruit is supposed to be poor in nutrition by many people. But this fruit is as nutritional as any other fruit. Jackfruit has many minerals and nutrients stored in it.
Story first published: Wednesday, April 30, 2014, 17:35 [IST]
Desktop Bottom Promotion