For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఏడు రోజుల్లో ఏడు కేజీల బరువు తగ్గడం: చిట్కాలు

|

మీరు ఏడు రోజుల్లో ఏడు కిలోల బరువు తగ్గాలనుకుంటున్నారా? ఇది మీకు జరగని పని అనిపించవచ్చు, కానీ, మీరు నమ్మితే కనుక ఈ సులభమైన డైట్ టిప్స్ ను పాటించగలిగితే, మీరు ఖచ్చితంగా కొన్ని పౌండ్ల బరువును తగ్గించుకోవచ్చు. కొత్త సంవత్సరం కొన్ని తీర్మానాలు చేసుకుంటారు కదా, ఆ లిస్ట్ లో, మీరు ఖచ్చితంగా ఈ సంవత్సరం ఎలాగైనా సరే బరువు తగ్గించుకోవాలని మీ అంతట మీరు ప్రామిస్ చేసుకుంటారు. గడిచిన కొన్ని నెలలుగా మీరు అనుకోకుండా బరువు పెరుగి ఉంటారు. కాబట్టి, ఈ కొత్త సంవత్సరం మీరు బరువు తగ్గడానికి ఒక కొత్త ప్లాన్ తో బరువు తగ్గించే ప్రోగ్రామ్ ను ఫిక్స్ చేసుకోండి.

ఈ టిప్స్ ను మీరు చూడగానే 7రోజుల్లో 7కేజీల బరువు తగ్గడం కొంచెం సులభమే అనిపించవచ్చు, అయితే ఈ చిట్కాలను అనుసరించడానికి మీకు చాలా ఓపిక కలిగి ఉండాలి. అలాగే మీకు ఇష్టమైన వాటిలో కొన్నింటిని త్యాగం చేయాల్సి ఉంటుంది. మీలో బరువు తగ్గాలనే నిశ్చితమైన మనస్సు, అనుసరించే శక్తి ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా 7రోజుల్లొ 7 కేజీల బరువు తగ్గడానికి తప్పకుండా చేరుకుంటారు. క్రింది ఇచ్చిన కొన్నిసింపుల్ డైట్ టిప్స్ చాలా ప్రయోజనకరంగా, చాలా త్వరగా బరువు తగ్గగలరు.

అతి సులభంగా బరువు తగ్గాలనుకొనే వారికి 7 రోజుల డైయట్ ప్లాన్

అయితే, మీరు 7రోజుల్లో, 7కేజీల బరువు తగ్గడం కోసం రెడీగా ఉన్నారా?మీరు రెడీ అంటే, అందుకు ఇక్కడ కొన్ని చిట్కాలు మీరు అనుసరించడానికి రెడీగా ఉన్నాయి...వీటిని అనుసరించి 7రోజుల్లో 7 కేజీల బరువును తగ్గించుకోండి.

మొదటి రోజు:

మొదటి రోజు:

డైట్ లో ఇది చాలా ముఖ్యమైన అంశం. ఇది కొంచె ఆరోగ్యకరంగా మరియు లైట్ గా మొదవలుతుంది. అదేంటంటే పండ్లు మరియు పండ్లు మాత్రమే. బరువు తగ్గాలని ఖచ్చితంగా అనుకొనే వారు, రోజులో మీరు సహజంగా తీసుకొనే ఏ ఆహారాలు తీసుకోకుండా కేవలం పండ్లు మాత్రమే తీసుకోవాలి. అరటి పండ్లు తప్ప రోజులో అన్ని రకాల పండ్లు తీసుకుంటూ తగినన్ని నీళ్ళను త్రాగాలి.

రెండవ రోజు:

రెండవ రోజు:

మీరు 7రోజుల్లో 7కేజీల బరువు తగ్గించుకోవాలంటే, మీరు కఠినంగా వెజిటేబుల్ డైట్ ను అనుసరించాల్సిందే. వెజిటేబుల్స్ ను ఉపయోగించి హెల్తీ సలాడ్స్ ను తయారుచేసుకొని కలర్ ఫుల్ మీల్స్ ను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. ఉడికించిన మరియు పచ్చి వెజిటేబుల్స్ మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల మీరు త్వరగా ఒకటి రెండు రోజుల్లో క్రమంగా బరువు తగ్గడం ప్రారంభమౌతుంది. సీజనల్ గా పొందే అన్ని రకాల వెజిటేబుల్స్ ను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల తప్పకుండా ఫలితం ఉంటుంది. వీటితో పాటు 8గ్లాసుల నీరు త్రాగడం మర్చిపోకండి.

మూడవ రోజు:

మూడవ రోజు:

3వ రోజు నిజంగా కలర్ ఫుల్ డే. ఎందుకంటే, 3వ రోజున మీ రెగ్యులర్ డైట్ లో ఫ్రూట్ మరియు వెజిటేబుల్స్ ను రెండింటిని మిక్స్ చేసి తీసుకోవాలి. మీరు 7రోజుల్లో, 7కేజీల బరువుతగ్గడానికి మీరు ఖచ్చితంగా డైట్ టిప్స్ ను అనుసరించాల్సిందే, మీ డేను ఒక బౌల్ ఫ్రూడ్ మరియు ఒక బౌల్ వెజిటేబుల్ సలాడ్స్ తో మీ భోజనాన్ని ముగించాలి మరియు డిన్నర్ కు మీకు నచ్చిన పండ్లు, కూరగాయలను తినవచ్చు. 3వ రోజున అరటి పండ్లు బరియు బంగాళదుంపలను చేర్చుకోకండి.

నాల్గవ రోజు:

నాల్గవ రోజు:

4వ రోజున మీరు పాలు మరియు అరటి పండ్లను మాత్రమే తీసుకోవాలి. అలాగే స్మూతీ, మిల్క్ షేక్స్ లేదా అరటిపండు, పాలు కాంబినేషన్ మాత్రమే చేర్చుకోవాలి. మీరు 7కేజీలను, 7వారాల్లో తగ్గాలనుకుంటే, ఈ డైటి టిప్ ను 4వ రోజున తప్పని సరిగా పాటించాలి. పాలు బాగా మరిగించి మీగ తీసిన పాలను మాత్రమే త్రాగాలి.

ఐదవ రోజు:

ఐదవ రోజు:

5వ రోజున మీ డైట్ లో అన్నం చేర్చుకోవాలి. అన్నంతో పాటు 7లేదా8 ఉడికించిన లేదా అలాగే పచ్చిగానే(బాగా పండిన)టమోటోలను మీ డైట్ లో చేర్చుకోవాలి. రోజంతా మద్యలో గ్యాప్ ఇస్తూ టమోటోలను తీసుకొని, రాత్రి మాత్రం డిన్నర్ ను చేయకుండా మానేయాలి. తర్వాత నీళ్ళు 12 గ్లాసుల నుండి 15గ్లాసులకు పెంచాలి.

ఆరవ రోజున:

ఆరవ రోజున:

6వ రోజున మధ్యాహ్నా భోజనం కు ఒక కప్పు అన్నం తీసుకొని, రోజంతా పండ్లను తీసుకోవాలి. బరువు తగ్గడానికి ఇది చాలా ముఖ్యమైన రోజు. ఖచ్చితంగా బరువు తగ్గాలనుకొనే వారి, వెజిటేబుల్తో తయారుచేసిన అన్నం మాత్రమే తీసుకోవాలి.

ఏడవ రోజు:

ఏడవ రోజు:

7వ రోజు ఒక కప్పు అన్నంతో పాటు మీకు నచ్చిన అన్ని రకాల వెజిటేబుల్స్ ను మీరు తీసుకోవచ్చు. మరియు ఫ్రూట్ జ్యూసులు, నీళ్ళు తగినన్ని త్రాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ మొత్తం తొలగిపోతాయి. కాబట్టి, ఒక్కపూట అన్నంతో రోజంతా పండ్ల రసాలను తీసుకోవల్సి ఉంటుంది.

English summary

Lose 7kgs In 7 Days: Diet Tips

Do you want to lose 7kgs in 7 days? This might seem impossible at first, but we can assure you that if you follow this simple diet tips, you will surely lose tons of weight.
Desktop Bottom Promotion