For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆరోగ్యానికి రక్ష : నేచురల్ ఎనర్జీ గ్రీన్ డ్రింక్స్

By Mallikarjuna
|

నేచురల్ ఎనర్జీ గ్రీన్ డ్రింక్స్
గ్రీన్ ఫుడ్స్ ఎల్లప్పుడు ఆరోగ్యకరమైనవిగా మరియు న్యూట్రిషియన్ మరియు ఎనర్జీ అందించే ఆహారాలుగా గుర్తించడం జరిగింది. ఆకుకూరలు, కేలా, కొత్తిమీర మరియు పుదీనా వంటి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఇవి ప్రోటీనులు, కార్బోహైడ్రేట్స్, మినిరల్స్, న్యూట్రీషియన్ కు ఒక మంచి మూలం. గ్రీన్ వెజిటేబుల్స్ గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు కలిగిఉన్నాయి అందుకే డైటీషియన్స్, డాక్టర్స్ మీ రెగ్యులర్ డైట్ లో గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ను చేర్చుకోమని సలహాలిస్తుంటారు.

గ్రీన్ వెజిటేబుల్స్ ను ఉడికించి లేదా ఉడికించ కుండా కూడా తీసుకోవచ్చు. గ్రీన్ జ్యూస్ లు అనేకం ఉన్నా యి. అవి మీ శరీరానికి తక్షణ ఎనర్జీ అంధిస్తాయి. గ్రీన్ జ్యూస్ లను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల, మీ శరీరంలో పోషకాలు లోపించిన వాటిని తిరిగి తీసుకొస్తుంది మరియు మీ శరీరంలో రోగనిధక శక్తిని పెంచుతుంది.

కొన్ని గ్రీన్ వెజిటేబుల్ జ్యూస్ లున్నాయి. కొన్ని రకాల గ్రీన్ వెజిటేబుల్ జ్యూస్ లను తయారుచేయడం చాలా సులభం మరియు అవి మీ శరీరానికి ఆరోగ్యకరమైనవి ..మరి వాటి లాభాలేంటో ఒక సారి చూద్దాం...

1. ఆకుకూరలు మరియు కోకోనట్ జ్యూస్

1. ఆకుకూరలు మరియు కోకోనట్ జ్యూస్

ఈ జ్యూస్ తయారుచేయడానికి ఒక కప్పు కొబ్బరి పాలు, పేస్ట్ చేసిన ఆకుకూరల. ఆకుకూరలను, త్రుణధాన్యాలు, అరటిపండు మరియు దాల్చిన చెక్క అన్నీ వేసి బాగా మెత్తగా పేస్ట్ చేయాలి . ఇందులో అరటిపండు, దాల్చిన చెక్క వేయడం వల్ల ఈ గ్రీన్ జ్యూస్ కొద్దిగా తియ్యగా ఉంటుంది. ఈ జ్యూస్ ఎనర్జీ అంధిచండంలో, ప్రోటీన్స్ మరియు యాంటీఆక్సిడెంట్స్ అంధించడంలో గొప్ప నప్రయోజనకారి, ఇది శరీరాన్ని శుభ్రపరుస్తుంది. జీర్ణాశయాన్ని క్లియర్ చేస్తుంది.

2. అలోవెరా జ్యూస్

2. అలోవెరా జ్యూస్

కలబంద రసంలో శక్తిని అందించడమే కాదు, అనేక ఆరోగ్యప్రయోజనాలున్నాయి. అలోవెరా జ్యూస్ అద్భుతమైన డిటాక్సిఫైయింగ్ లక్షణాలున్నాయి. ఇది శరీరాన్ని శుభ్రం చేయడానికి మరియు జీవక్రియలు మెరుగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది. ఇంకా ఇది శరీరాన్ని హైడ్రేషన్ లో ఉంచుంతుంది. అలోవెరా మొక్క నుండి జ్యూస్ ను తాయారు చేయవచ్చు .

3. కీరద దోస మరియు ఆకు కూర

3. కీరద దోస మరియు ఆకు కూర

ఆకు కూర మరియు కీరదోసకాయను రెండింటిని ముక్కలుగా చేసి, మిక్సీలో వేసి మెత్తగా పేస్తట్ చేయాలి. ఇందులో కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి మరియు కొన్ని దాల్చిన చెక్క వేసి కొద్దిగా నీళ్ళు పేసి గ్రైండ్ చేయాలి . కీరదోస బాడీ క్లెన్సర్ గా అద్బుతంగా సహాయపడుతుంది. మరియు ప్రోటీనులను అందిస్తుంది. ఆకు కూరలో అనేక యాంటీఆక్సిడెంట్స్, ప్రోటీనుల మరియు న్యూట్రీషియన్స్ కలిగి ఉంది . ఇది ఆరోగ్యకరంమరియు శక్తిని అంధిస్తుంది.

4. పుదీనా మరియు నిమ్మరసం

4. పుదీనా మరియు నిమ్మరసం

పుదీనా రిఫ్రెష్ మరియు రివైవింగ్ ఏజెంట్. నిమ్మరసం , పుదీనా రెండింటి మిశ్రమనం తక్షణ శక్తిని అంధించేవే . ఇవి శరీరానికి తగినంత తేమను అందిస్తుంది. రీ హైడ్రేషన్ లక్షణాలు కలిగి ఉండటం వల్ల తక్షణ శక్తిని అంధిస్తాయి . ఈ రెండింటిని మీక్సిలో వేసి దానికి ఉప్పు, దాల్చిన చెక్క చేర్చి పేస్ట్ లా చేయాలి. ఈ జ్యూస్ చాలా ఆరోగ్యకరం మరియు తయారుచేయడం చాలా సులభం.

5. గ్రీన్ గార్డెన్ జ్యూస్

5. గ్రీన్ గార్డెన్ జ్యూస్

ఈ జ్యూస్ తయారుచేయడానికి ఆకుకూర కాలే, ఒక కప్పు కీరదోసముక్కలు , మరో కప్పు ఆకుకూరలు, కొత్తిమీరమరియు పార్సలే అన్ని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి. అందులో కొద్దిగా నీళ్ళు, పెప్పుర్ వేసి మిక్స్ చేసి తీసుకోవాలి . ఇది ఫర్ ఫెక్ట్ ఎనర్జీ డ్రింక్

English summary

Natural energy green drinks

Green foods have always been considered as healthy options for gaining nutrients and energy for the body.
Story first published: Wednesday, January 29, 2014, 20:17 [IST]
Desktop Bottom Promotion