For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తొడలవద్ద కొవ్వు కరిగించుకోవడానికి సులభ మార్గాలు

|

మనషి అందంగా కనబడాలంటే, శరీరం యొక్క చర్మ ఛాయతో పాటు, శరీరం యొక్క కొలతలు కూడా ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే చక్కటి శరీర సౌష్టవంతో పాటు, చర్మ ఛాయ కలిగి ఉన్నప్పుడే, పరిపూర్ణంగా అందంగా కనబడుతారు. శరీరంలో పొట్ట రాకూడదని చాలా మంది ఎన్నోడైట్ టిప్స్ మరియు వ్యాయామాలు, జిమ్స్ లు అని చేయనన్ని ప్రయత్నాలుండవు. అలాగే బరువు, ఎత్తుకు తగ్గట్టు, కాళ్ళ, చేతుల లావుకూడా అందాన్ని తెలుపుతుంది. ముఖ్యంగా మహిళలు నాజూగ్గా ఉండాలంటే కాళ్ళు చేతులు సన్నగా నాజూగ్గా కనబడాలి. కాళ్ళు సన్నగా కాంతివంతంగా ఉన్నప్పుడు వారు షార్ట్ డ్రెస్సులను వేసుకోవడానికి ఇష్టపడుతారు. అయితే, తొడల వద్ద కొవ్వు కరిగించుకోవడం కొంచెం కష్టమే అవుతుంది. నిజానికి బెల్లీ ఫ్యాట్ ఏర్పడిన తర్వాత తొడలలో కొవ్వు కరిగించడం కష్టం అవుతుంది. కాబట్టి, మీరు థై ఫ్యాట్ (తొడల వద్ద కొవ్వు)ను త్వరగా తగ్గించుకోవాలంటే డైట్ మరియు వ్యాయామాల యొక్క కాంబినేషన్ టిప్స్ ను తప్పనిసరిగా అనుసరించాలి.

థై ఫ్యాట్ కరిగించుకోవడానికి ఒక్క డైట్ లో మార్పులు చేసుకుంటే మీ లక్ష్యం అంతటి పూర్తి కాదు, డైట్ లో మార్పులు చేసుకొని మీరు వ్యక్తిగతంగా ఎంత ప్రయత్నించినా థై ఫ్యాట్ తగ్గదు. కాబట్టి, డైట్ లో మార్పులతో పాటు, థై ఫ్యాట్ కరిగించుకోవడానికి థై ఫ్యాట్ వ్యాయామాలను చేయాలి. ఈ వ్యాయామాలు కండరాల మీద బాగా పనిచేస్తాయి. వాతావరణంలో మార్పులతో కొన్ని సందర్భాల్లో మీరు వ్యాయామానికి వెనకడుగు వేస్తుంటారు. అలాకాకుండా దీర్ఘకాల వ్యాయామాల వల్ల మంచి ఫలితం ఉంటుంది.

తొడలు,బొజ్జను కరిగించి స్లిమ్ గా మార్చేయోగాసనాలు:క్లిక్ చేయండి

కాబట్టి, జీవనశైలిలో మార్పులను తప్పనిసరిగా చేసుకొన్నట్లైతే తప్పకుండా థై ఫ్యాట్ తగ్గించుకోవడానికి సహాయపడుతుంది. అలాగే డైట్ లో మార్పు చేసుకోవడం వల్ల మీరు వ్యాయామంలో కోల్పోయిన శక్తిని మీ శరీరంలో నింపడానికి డైట్ గొప్పగా సహాయపడుతుంది. థై ఫ్యాట్ వ్యాయామం స్కిప్పింగ్ ఆడటం మరియు డ్యాన్స్ చేయడం ఇటువంటి వ్యాయామాలు, సాధారణంగా చేసే జిమ్ వ్యాయామాల కంటే చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. కాబట్టి, థై ఫ్యాట్ తగ్గించుకోవడానికి ఉపయోగపడే కొన్ని చిట్కాలు ఈ క్రింది విధంగా ఇవ్వబడ్డాయి.

నడక:

నడక:

నడక అనగానే వినడానికి బోర్ గా అనిపించినా, థైప్యాట్ కరిగించుకోవడానికి ఒక ఉత్తమ వ్యాయామం రెగ్యులర్ నడక. మీరు ఆఫీసుకు దగ్గరలో ఉన్నట్లైతే మీరు క్యాబ్ తీసుకోవడానికి బదులుగా నడిచి వెళ్ళండి.

మెట్లు ఎక్కడం:

మెట్లు ఎక్కడం:

ఎలివేటర్లలో వెళ్ళడానికి బదులుగా మెట్లను ఎక్కడం ప్రాక్టీస్ చేసుకోండి. మెట్లు ఎక్కడం వల్ల, థై ఫ్యాట్ కరిగించుకోవడంలో ఇది ఒక నేచురల్ వర్కౌట్ లా పనిచేస్తుంది.

సైక్లింగ్ :

సైక్లింగ్ :

తొడ వద్ద కొవ్వును త్వరగా తగ్గించుకోవడానికి సైక్లింగ్ చాలా మంచి వ్యాయామం. మీరు సైకిల్ తొక్కినప్పుడు, తొడల వద్ద కండరాలకు ఎక్కువ ఒత్తిడి కలుగుతుంది. ఫలితంగా కండరాలు బలంగా మారి కొవ్వు కరుగుతుంది.

అనిమల్ ఫ్యాట్ ను తగ్గించండి:

అనిమల్ ఫ్యాట్ ను తగ్గించండి:

చాలా వరకూ తొడల వద్ద సెల్యులైట్ గా ఉంటుంది. ఈ సెల్యులైట్ కు ప్రధానకారణం అనిమల్ ఫ్యాట్. కాబట్టి, తొడల వద్ద ఫ్యాట్ తగ్గించుకోవాలంటే అనిమల్ ఫ్యాట్ తప్పనిసరిగా తగ్గించుకోవాలి.

పరుగు:

పరుగు:

పరుగు మరో సులభ వ్యాయామం. ఇది తొడల వద్ద అనేక పౌండ్ల కొవ్వును కరిగిస్తుంది. కాబట్టి, జిమ్ కు వెళ్ళి అక్కడ ట్రేడ్ మిల్ మీద నడక కంటే, ఆరుబయట పరుగు తీసి నేచరును ఎంజాయ్ చేయాలి.

యోగ:

యోగ:

కొన్ని ప్రత్యేకమైన యోగాసనాలు తొడల వద్ద కొవ్వును కరిగించుకోవడానికి తప్పనిసరిగా సహాయపడుతాయి. ఉదాహరణకు, సూర్యనమస్కారం. మరియు డాగ్ పొజిషన్లో నిలబడటం ద్వారా చాలా ఎఫెక్టివ్ గా తొడల వద్ద కొవ్వు కరిగించుకోవచ్చు.

జంక్ ఫుడ్:

జంక్ ఫుడ్:

థైఫ్యాట్ సెల్యులైట్ అని ఇంతకు ముందే చెప్పాము. ఇది మీ ట్రాన్స్ ఫ్యాట్ ను విడుదల చేస్తుంది. కాబట్టి, జంక్ ఫుడ్ తినడం నివారించడం వల్ల చాలా తేలికగా తొడల వద్ద కొవ్వు కరిగించుకోవచ్చు.

స్కిప్పింగ్:

స్కిప్పింగ్:

స్కిప్పింగ్ చాలా ఎఫెక్టివ్ గా ఫలితాలను చూపించే ఒక సులభ వ్యాయామం. తొడల వద్ద కొవ్వు కరిగించుకోవడానికి ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

ఆఫీ చుట్టూ రౌండ్లు వేయడం:

ఆఫీ చుట్టూ రౌండ్లు వేయడం:

ఒకే చోట ఎక్కువ సమయం కుర్చీలో కూర్చోవడం కంటే, ఆఫీసులో మద్యమద్యలో చిన్న విరామం తీసుకోని అటు ఇటు తిరాగాలి.

నీరు ఎక్కువగా త్రాగాలి:

నీరు ఎక్కువగా త్రాగాలి:

ఎక్కువగా నీరు త్రాగడం వల్ల కడుపు నిండుగా ఉన్న అనుభూతి కలుగుతుంది. దాంతో మీరు తక్కువగా తింటారు. మరియు మీ శరీరంలో టాక్సిన్స్ తొలగిపోతాయి.

కార్బోహైడ్రేట్స్ ను తగ్గించండి:

కార్బోహైడ్రేట్స్ ను తగ్గించండి:

బరువు చాలా త్వరగా తగ్గించుకోవాలని చూసినప్పుడు, మీరు తీసుకొనే కార్బోహైడ్రేట్స్ మీద ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలి. సెరల్స్ మరియు బ్రౌన్ రైస్ ను ఎక్కువగా తీసుకోవాలి.

సాల్సా:

సాల్సా:

మీరు కాళ్ళకు వ్యాయామంలా అనిపించే కొన్ని సాల్సా వంటి డ్యాన్సులను చేయడం మంచిది.

బిగువైన థై స్లాక్స్ ధరించాలి:

బిగువైన థై స్లాక్స్ ధరించాలి:

తొడల వద్ద కొవ్వు కరిగించుకోవాలంటే తొడలను గట్టిగా పట్టిఉంచే ఎప్పుడూ, టైట్ గా ఉండే స్లాక్స్ ధరించాలి.

వ్యాయామానికి అనుకూలంగా ఉండే షూలను ధరించాలి:

వ్యాయామానికి అనుకూలంగా ఉండే షూలను ధరించాలి:

థైఫ్యాట్ ను కరిగించుకోవాలనుకొన్నప్పుడు, వ్యాయామానికి అనుకూలంగా ఉండే స్నీకర్స్ లేదా స్పోట్స్ షూలను ధరించాలి.

English summary

Steps To Lose Thigh Fat Fast

Having well toned thighs is a dream that many people cherish. Women want nice thighs so that they can show them off in short dresses. However, thigh fat is very hard to lose. In fact, after belly fat, thigh fat is the most difficult to shed. So if you want to lose thigh fat fast, you need to follow a combination of diet and exercise tips.
Desktop Bottom Promotion