For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వేసవిలో తేలికగా జీర్ణం అయ్యే కొన్ని ఆహారాలు

|

వేసవి కాలం వచ్చిందంటే వాతావరణంలో చాలా మార్పులు చేటు చేసుకుంటా, వేడి వాతవరణం మన ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది. దానికి తోడు, వేసవితోపాటు పెళ్ళిళ్ళ సీజన్ మరియు ఫెస్టివల్ సీజన్ కూడా మొదలవుతుంది. మరో ముఖ్యమైన విషయమం సమ్మర్ వెకేషన్ అందరి ఆకర్షిస్తుంది మరియు అలరిస్తుంది. పిల్లులు, పెద్దలు అందరూ కూడా వెకేషన్స్ కు బయటప్రదేశాలకు వెళ్ళి ఎంజాయ్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతారు. సమ్మర్ లో ఇంట్లో ఉన్న బయట ప్రదేశాలకు వెళ్ళిన ఆరోగ్యం మీద తగినంత శ్రద్ద తీసుకోవడం చాలా అవసరం . ఎందుకంటే వేసవిలో చాలా త్వరగా అనారోగ్యం చెందుతారు. వివిధ రకాల ఇన్ఫెక్షన్, మరియు స్టొమక్ ఇన్ఫెక్షన్ మరియు అజీర్ణం వంటి సమస్యలు సాధరణ సమస్యలు. కాబట్టి, ఈ వేసవి సీజన్ లో ఎటువంటి ఇన్ఫెక్సైనా మరియు జీర్ణ సమస్యలైనా నివారించడానికి తప్పనిసరిగా ఆరోగ్యం మీద తగినంత శ్రద్ద చూపాలి.

వేసవి సీజన్ లో జీర్ణక్రియను మెరుగుపరిచి మరియు జీర్ణ సమస్యలు నయం చేసే వివిధ రకాల ఆహారాలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ డైజెస్టెడ్ ఫుడ్స్ ను వేసవి సీజన్ లో మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. వేసవి జీర్ణక్రియను మెరుగుపరిచే కొన్ని ఆహారాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి...

1. పండ్లు

1. పండ్లు

పండ్లు, ముఖ్యంగా సిట్రస్ పండ్లను ఎంపిక చేసుకోవడం ద్వారా, వాటిలో అధికంగా ఉండే ఫైబర్ మరియు వాటర్ కంటెంట్ వేసవిలో జీర్ణక్రియను మరింత మెరుగుపరిచేందుకు ఎక్కువగా సహాయపడుతాయి. ఈ పండ్లలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు స్టొమక్ ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది. ఇంకా పండ్లను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం ద్వారా అలసటను మరియు నీరసాన్ని తగ్గిస్తుంది. అందువల్ల సమ్మర్ లో డైజెస్టివ్ గుడ్ ఫుడ్స్ పండ్లు.

2. తృణధాన్యాలు

2. తృణధాన్యాలు

ఓట్స్, బియ్యం, గోధుమలు, రాగులు వంటివి తేలికగా జీర్ణం అవ్వడంలో సహాయపడుతాయి. ఇవి మాత్రమే కాదు తృణధాన్యాల క్రిందే ఈ ధాన్యాలు వచ్చిన వాటిని తప్పకు మీ రెగ్యులర్ డైట్ లో చేర్చడం వల్ల జీర్ణవ్యవస్థకు చాలా ఉపయోగకరం. అందుకే వీటిని తప్పక ఆహారంలో చేర్చండి. తృణధాన్యాలతో తయారుచేసే బ్రెండ్ మరియు ఇతర ఆహారాలను కూడా చేర్చుకోవచ్చు. తృణధాన్యాలతో తయారుచేసిన ఆహారాలు జీర్ణక్రియను మెరుగుపరిచే బరువును కూడా తగ్గిస్తాయి. అందుకే సమ్మర్ లో తృణధాన్యాలతో తయారుచేసిన ఆహారాలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వండి.

3. పెరుగు

3. పెరుగు

పెరుగు మరియు పాలు ఈ రెండూ కూడా జీర్ణక్రియను మెరుగుపరచడంలో అద్భుతంగా సహాయపడుతాయి. పెరుగు పొట్టకు సంబంధించిన ఎటువంటి జీర్ణ సమస్యలనైనా చాలా సులభం నయంచేసే గుణాలు పాలు, పెరుగులో పుష్కలంగా ఉన్నాయి. ఇంకా, మీరు ఇతర పొట్ట సంబంధిత సమస్యలతో బాధపడుతున్నప్పుడు, ఎక్కువగా పెరుగు తినమని డాక్టర్స్ సలహాలిస్తుంటారు. పెరుగు జీర్ణవ్యవస్థను మరింత స్ట్రాంగ్ గా ఉంచేందుకు సహాయపడుతుంది.

4. నీళ్ళు

4. నీళ్ళు

వేసవి అంటేనే శరీరంలో నీరు తగ్గిపోయి మనల్ని నీరసంగా మార్చేసే హాట్ సీజన్ కాబట్టి, శరీరంలో కోల్పోయిన నీటిని తిరిగి బర్తీ చేయడానికి తగినన్ని నీరు త్రాగడం వల్ల చాలా అవసరం. నీటితో పాటు నీటి కంటెంట్ అధికంగా ఉండే పండ్లు మరియు జ్యూసులను తీసుకోవడం వల్ల ఆరోగ్యం, మరియు జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అందుకు ఒక మంచి ఉదాహరణ : లైమ్ వాటర్. ఒక గ్లాస్ తేనె మరియు నిమ్మరసం మిశ్రమంతో కలిపిన నీటితో మీ దిన చర్యను ప్రారంభించడం వల్ల మీ జీర్ణ సమస్యలన్నింటి నివారించవచ్చు .

5. సలాడ్స్

5. సలాడ్స్

ఫ్రెష్ గ్రీన్ వెజిటేబుల్స్ తో తయారుచేసే సలాడ్స్ కార్బోహైడ్రేట్స్ మరియు ఫైబర్ అధికంగా ఉంటాయి. అంతే కాదు, ఇవి సరైన జీర్ణక్రియకు కూడా తోడ్పడుతాయి. కాబట్టి, వేసవి కాలంలో తాజా కూరగాయలను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి . ఈ సలాడ్స్ ఫార్ములాను మీరు ఉపయోగించడం ద్వారా మరింత ఆరోగ్యం. భోజనానికి భోజనానికి మధ్య మీరు వీటిని తీసుకోవచ్చు.

6. సూప్స్

6. సూప్స్

చిక్కగా ఉండే సూపులు మరో హెల్తీ మరియు మంచి ఆహారాలు ఇవి జీర్ణక్రియను చాలా తేలికగా మెరుగుపరుస్తాయి. వేసవి సీజన్ లో సూప్ జీర్ణం అవ్వడానికి చాలా తేలిక మీకు జీర్ణ సమస్యలున్నప్పుడు క్లియర్ సూప్ చికెన్ బ్రోత్, మరియు వెరైటీ వెజిటేబుల్స్ తో తయారుచేసి సూపులను ఎంపిక చేసుకోవచ్చు. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా అదనపు కిలోల బరువు కూడా తగ్గిస్తాయి.

English summary

Summer Foods That Aid Digestion

Summer is the time of hot temperatures right it is also the time of festivals and marriages. Summer vacations is another attraction where families go out of station. There are many chances of getting stomach infection and indigestion. This summer you need to take extra care of what you are eating to prevent any indigestion.
Story first published: Friday, May 16, 2014, 17:25 [IST]
Desktop Bottom Promotion