For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కేవలం ఒక నెలలో బరువు తగ్గించే ఆహార నియమాలు

|

బరువు తగ్గడానికి మీరు ఎంత వ్యాయామం చేస్తున్నారన్నది విషయం కాదు, వ్యాయామంతో పాటు మీరు తగినంత డైట్ టిప్స్ ను అనుసరించకపోయినట్లైతే సందేహం లేకుండా మరింత అధిక బరువును మీరు చేరుకోబోతున్నారని తెలుసుకోవాలి. బరువు తగ్గడం మనం తీసుకొనే ఆహారం మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో డైట్ ను అనుసరించడానికి ఎటువంటి ఆహారం తీసుకోవాలి. ఎలా తీసుకోవాలనే నియమాలు చాలా మందికి తెలిసుండకపోవచ్చు. కాబట్టి, బరువు తగ్గడానికి వ్యాయామంతో పాటు, ఖచ్చితంగా సరైన కరెక్ట్ డైట్ ను అనుసరించడం కూడా చాలా ముఖ్యం అని తెలుసుకోవాలి.

ఈ ఆర్టికల్లో, మీరు బరువు తగ్గడానికి సహాయపడే ఉత్తమ డైట్ టిప్స్ ను చూడవచ్చు. ఈ డైట్ టిప్స్ ను అనుసరించడం వల్ల మీరు ఒక నెలలో బరువు తగ్గించుకోగలుగుతారు. ఈ ఉత్తమ డైట్ టిప్స్ తో పాటు కొంచెం వ్యాయామం కూడా చాలా అవసరం అవుతుంది. మరి ఒక నెలలో మనం బరువు తగ్గించుకోవడానికి సహాయపడే డైట్ టిప్స్ ఎలా ఉన్నాయో ఈ క్రింది స్లైడ్ ద్వారా తెలుసుకుందాం...

ఒక నెలలో బరువు తగ్గించుకోవడానికి 8 ఉత్తమ డైట్ టిప్స్ ఈ క్రింది విధంగా...

బ్రేక్ ఫాస్ట్

బ్రేక్ ఫాస్ట్

బ్రేక్ ఫాస్ట్ ను తినకపోవడం వల్ల మరింత బరువు పెరిగే అవకాశం ఉంది. బ్రేక్ ఫాస్ట్ తినకపోవడం వల్ల శరీరంలో జీవక్రియలు తగ్గుముఖం పడుతాయి. బరువు తగ్గాలని కోరుకొనే వారు ఇలా చేయడం మంచిది కాదు. కాబట్టి, ప్రతి రోజూ రెగ్యులర్ గా బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడం మర్చిపోకండి.

నీళ్ళు

నీళ్ళు

మీరు బరువు తగ్గాలని కోరుకుంటున్నట్లైతే, ముఖ్యంగా మీరు తెలుసుకోవల్సిన విషయం శరీరంలోని కణాలు నిరంతరం హైడ్రేషన్ లో ఉంచుకోవాలి. నీరు శరీరంలో కణాలను తేమగా ఉంచి, మెటబాలిజం యొక్క రేటును పెంచుతుంది . బరువు తగ్గాలని కోరుకొనే వారు రోజుకు కనీసం 3 లీటర్ల నీరు తప్పనిసరిగా తీసుకోవాలి.

బ్రేక్ ఫాస్ట్ లో ప్రోటీనులు తప్పనిసరి

బ్రేక్ ఫాస్ట్ లో ప్రోటీనులు తప్పనిసరి

బరువు తగ్గించుకొనేందుకు పాటించే నియమాల్లో ప్రోటీనులు తప్పనిసరి మరియు ఇది ఫ్యాట్ బర్న్ చేయడానికి సహాయపడుతుంది. అందువల్ల బ్రేక్ ఫాస్ట్ లో తీసుకొనే సెరెల్స్ లేదా ఓట్ మీల్ ఒక ఉత్తమ ఐడియా . అలాగే బ్రేక్ ఫాస్ట్ కు గుడ్డు కూడా ఒక ఉత్తమ ఆహారం. ఐతే మీరు తీసుకొనే బ్రేక్ ఫాస్ట్ ఎక్కువగా తీసుకోకూడదు.

ఫ్రీక్వెంట్ మీల్స్

ఫ్రీక్వెంట్ మీల్స్

వ్యాయామంతో పాటు మీరు అనుసరించాల్సిన మరో ముఖ్యమైన విషయం సరైన ఫౌష్టికాహారంను తీసుకోవాలి. ఇది మీ శరీరంలోని మెటబాలిజం రేటును మెరుగుపరుస్తుంది . ప్రతి రెండు గంటలకొకసారి కొద్ది కొద్దిగా తీసుకోవడం చాలా అవసరం . అలాగే భోజనంతో పాటు పండ్లు లేదా వెజిటేబుల్స్ తీసుకోవడం చాలా ముఖ్యం.

కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం నివారించాలి

కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం నివారించాలి

బరువు సమస్యతో బాధపడేవారు కార్బోమైడ్రేట్ ఫుడ్స్ ను నివారించడం ఉత్తమం. ఇవి శరీరంలో ఫ్యాట్ ను నిల్వచేస్తాయి . అందువల్ల అన్నం మరియు పంచదార వంటివి తీసుకోవడం నివారించాలి. బరువు తగ్గాలనుకొనే వారు ఖచ్చితంగా పంచదార తీసుకోవడం నిలిపివేయాలి. పంచదారకు ప్రత్యామ్నాయంగా తేనె తీసుకోవచ్చు.

భోజనం

భోజనం

రాత్రి తీసుకొనే భోజనం ఎక్కువగా తీసుకోవడం నివారించండి. డిన్నర్ కు తీసుకొనే ఆహారంలో కార్బోహైడ్రేట్స్ లేకుండా చూసుకోవాలి . బాగా ఉడికించిన వెజిటేబుల్స్ డిన్నర్ లో తీసుకోవడం ఒక ఉత్తమ ఎంపిక

ఉప్పు

ఉప్పు

ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో నీటి అంశాన్ని తగ్గించేస్తుంది. దాని వల్ల మరింత బరువు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి, మీ రెగ్యులర్ డైట్ లో సాల్ట్ ఫుడ్స్ ను పూర్తిగా నివారించాలి.

ఫైబర్ అధికంగా ఉన్న ఆహారాలు

ఫైబర్ అధికంగా ఉన్న ఆహారాలు

బరువు తగ్గించుకొనే నియమాల్లో పాటించాల్సిన మరో నియమం ఫైబర్ అధికంగా ఉన్న ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. వివిధ రకాలైన ఫైబర్ ఫుడ్స్ ను మీ డైలీ డైట్ లో చేర్చుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా భోజనానికి ఫైబర్ ఫుడ్స్ తీసుకోవడం ప్రయోజనకరం.

English summary

The Best Diet Tips To Lose Weight In Just A Month


 No matter how much you exercise with weight loss in mind, if you do not adopt the requisite diet, results are undoubtedly going to be elusive. One's diet forms the key to achieving weight loss -- something that most of us are aware about. 
Story first published: Friday, October 17, 2014, 10:18 [IST]
Desktop Bottom Promotion