For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బరువు తగ్గించుకోవడానికి సహాయపడే ఇండియన్ డైట్

|

చాలా వరకూ మన ఇండియాలో ఎక్కువ మంది నాజూగ్గా కనబడాలని, హెల్తీగా ఉండాలని తగిన జాగ్రత్తలు తీసుకుంటుంటారు. ముఖ్యంగా ఎక్కువ హెల్త్ కాన్సియష్ ఉన్నవారు, బరువు తగ్గించుకోవడానికి తగిన డైట్ ను అనుసరిస్తుంటారు. చాలా కఠిమైన డైట్ తో నుండి వెయిట్ లాస్ సప్లిమెంట్స్ తీసుకోవడం చేస్తుంటారు. బరువు తగ్గించుకోవడం కోసం, మార్కెట్లో డైట్ ఫుడ్స్ తో పాటు, వెయిట్ లాస్ సప్లిమెంట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అవి చాలా తర్వగా కొన్ని పౌండ్ల క్యాలరీలను తగ్గించడానికి సహాయపడుతాయి. అయితే వీటికంటే చాలా ఉత్తమమైన పద్దతి బరువు తగ్గించుకోవడానికి ఒక స్ట్రిట్ డైట్ ను అనుసరించడమే.

ఇండియన్ ఫుడ్స్ ఎక్కువ కారంగా మరియు ఆయిల్ తో తయారుచేసినవై ఉంటాయని కొంత మంది తరచూ తప్పుదోవపట్టిస్తుంటారు. కానీ, ఈ ఇండియన్ ఫుడ్స్ గురించి ఒక నిజం కూడా, ఉంది ఈ ఆహారాలు అనారోగ్యం అయినా కానీ, వాటిలో కొన్ని ఆహారాలు బరువు తగ్గించడంలో చాలా గొప్పగా సహాయపడేవిగా ఉన్నాయి.

కొన్ని రకాల ఆహారాలు, చేపలు, త్రుణధాన్యాలు, మరియు లెంటిల్స్ వంటివి ప్రతి ఒక్కరి ఇండియన్ మీల్స్ లో ఉపయోగించే ఆహారాలు. ఈ ఆహారాలను మన రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల దాదాపు 500క్యాలరీలను కలిగి ఉంటాయి. కొన్ని ప్రత్యేకమైన ఆహారాలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.

ఎప్పుడైతే మీరు వెయిట్ లాస్ ప్రోగ్రామ్ లో ఉంటారో, అప్పుడు ప్రతి రోజూ మీరు 1200 క్యాలరీలను ఒక్క రోజుకు తీసుకోవాలి మరియు 1000 క్యాలరీలను జిమ్, వ్యాయామం ద్వారా కరిగించేయాలి . బరువు తగ్గించుకోవడానికి ఇండియన్ డైట్ అనుసరించే వారు, కొన్ని నెలల తర్వాత అద్భుతమైనటువంటి మార్పును మీరు గమనించగలరు.

కొన్ని పౌండ్ల క్యాలరీలను మరియు బరువును తగ్గించే కొన్ని ఇండియన్ ఫుడ్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి...

బ్రౌన్ రైస్

బ్రౌన్ రైస్

బరువు తగ్గించే క్రమంలో పూర్తిగా అన్నం మానేయనవసరం లేదు. సాధారణ రైస్ కు ప్రత్యామ్నాయంగా బ్రౌన్ రైస్ ను ఒక కప్పును ప్రతి రోజూ తీసుకోవచ్చు. బ్రౌన్ రైస్ లో ఎక్కువ న్యూట్రీషియన్ విలువలున్నాయి.

ఫ్రెష్ వెజిటేబుల్స్

ఫ్రెష్ వెజిటేబుల్స్

బరువు తగ్గించుకోవడానికి ఇండియన్ డైట్ లో ముఖ్యమైన ఆహారం, మీ ప్లేట్ నిండా తాజాగా కూరగాలతో నింపాల్సిందే. అయితే బరువు తగ్గించుకొనే క్రమంలో ఆలూ మరియు బ్రింజాల్ ను నివారించాలి.

కాయధాన్యాలు

కాయధాన్యాలు

వీటిలో సోలబుల్ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో ట్రై గ్లిజరైడ్ మరియు కొలెస్ట్రాల్ తగ్గించడానికి సహాయపడుతుంది. ఇది బరువు తగ్గించుకోవడానికి మంచిది.

తృణధాన్యాలు

తృణధాన్యాలు

తృణధాన్యాలలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది మరియు లోఫ్యాట్ తగ్గిస్తుంది. అందువల్ల మీరు ఫ్యాట్ తగ్గించుకోవాలని చూస్తుంటే మీ రెగ్యురల్ డైట్ లో తృణధాన్యాలు చేర్చుకోండి . వీటిలో ప్రోటీన్స్, విటమిన్స్, యాంటీఆక్సిడెంట్స్, మరియు ఫైటోకెమికల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యంగా ఉండటానికి ఎంతో అవసరం అవుతాయి.

శరీరాన్ని చల్లదం కలిగించే ఆహారాలు

శరీరాన్ని చల్లదం కలిగించే ఆహారాలు

బరువు తగ్గించే మరో బెస్ట్ ఇండియన్ ఫుడ్ కీరదోసకాయ. మీ పొట్టకు చల్లదానాన్ని కలిగిస్తుంది. ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల మీ పొట్టను నిండుగా ఉండేలా చేస్తుంది మరియు బరువు తగ్గించే ఒక అద్భుతమైన ఆహారం

మసాలా దినుసులు

మసాలా దినుసులు

ఇండియన్ ఫుడ్స్ లో ఎల్లప్పుడూ మసాలా దినుసులను జోడించాల్సిందే. మీరు త్వరగా బరువు తగ్గించుకోవాలనుకుంటే, మీ రెగ్యులర్ డైట్ లో దాల్చిన చెక్క, లవంగాలు, జీలకర్ర, అల్లం, ఆవాలు, పసుపు మరియు మిరియాలు వంటివి చేర్చుకోవాలి. వంటల్లో వీటిని ఉపయోగించడం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతాయి.

చేపలు

చేపలు

బరువు తగ్గించే ఇండియన్ డైట్ లో, మీరు ఖచ్చితంగా చేర్చుకోవల్సిన మరో ఆహారం చేపలు. ఎందుకంటే వీటిలో ప్రోటీనులు మరియు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి కొన్ని పౌండ్ల తగ్గించుకోవడానికి చాలా సులభంగా సహాయపడుతాయి.

నట్స్ అండ్ సీడ్స్

నట్స్ అండ్ సీడ్స్

బరువు తగ్గించే హెల్తీ ఫుడ్స్ లో వెరైటీ నట్స్ మరియు సీడ్స్ కూడా ఉన్నాయి. గుప్పెడు వేరుశెనగలు మరియు బాదం ప్రతి రోజూ తినడం వల్ల మన శరీరానికి కావల్సిన ఎనర్జీని అందివ్వడంతో పాటు, క్యాలరీలను తగ్గిస్తుంది. ఇక విత్తనాలు, గుమ్మడి మరియు ఫ్లాక్ సీడ్స్ వంటివి బ్యాడ్ కొలెస్ట్రాల్ ను తొలగించి మంచి కొలెస్ట్రాల్ ను మెరుగుపరుస్తుంది.

వెల్లుల్లి

వెల్లుల్లి

వెల్లుల్లిల్లో క్రొవ్వు కరిగించే గుణాలు అలిసిన్ పుష్కలంగా ఉంది. ఇది చెడు కొలెస్ట్రాల్ ను తొలగిస్తుంది. దాంతో శరీరంలో నిల్వ ఉన్న కొవ్వు తొలగిపోతుంది. కాబట్టి పురుషులు ఈ ఇండియన్ స్పైసీ వెల్లుల్లిని రెగ్యులర్ గా తింటే శరీర బరువును తగ్గించుకొని, గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉండవచ్చు.

ఓట్స్

ఓట్స్

ఓట్స్ అమెరికన్ ఫుడ్ అని చాలా మంది అనుకుంటారు, కానీ ఇది నిజానికి ఇండియన్ ఫుడ్డే! ఈ హెల్తీ ఫుడ్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది. అందువల్ల ఇది పొట్ట నిండుగా ఉండేలా చేస్తుంది. మరియు ఇది ఎక్కువ శక్తిని అందిస్తుంది. దాని వల్ల ఎక్కువ క్యాలరీలు బర్న్ అవ్వడానికి సహాయపడుతుంది.

రాగి మాల్ట్

రాగి మాల్ట్

రాగి మాల్ట్ ఒక సాధారణమైన ఎనర్జీ డ్రింక్. రాగి మాల్ట్ ను సౌత్ ఇండియన్స్ చాలా మంది రెగ్యురల్ గా తీసుకుంటుంటారు. చాలా త్వరగా బరువు తగ్గించుకోవాని కోరుకొనే వారు తర్వాత రెండు వారాలు ఉదయం ఒక గ్లాస్ రాగీ మాల్ట్ ను త్రాగాలి.

జ్యూస్

జ్యూస్

మూడు వారాల పాటు జ్యూస్ డైట్ మెయింటైన్ చేసి ఆరోగ్యంగా మరియు నేచురల్ గా బరువు తగ్గించుకోవచ్చు . బరువు తగ్గించుకొనే పద్ధతుల్లో బెస్ట్ ఇండియన్ డైట్ లో జ్యూస్ డైట్ ఒకటి. ప్రతి రోజూ గ్రీన్ జ్యూస్ డైట్ ను అనుసరించాలి. జ్యూస్ డైట్ లో ఆకుకూరలు, ఉప్పు మరియు పెరుగును ఉపయోగించుకోవచ్చు.

English summary

The 'Indian' Diet To Lose Weight


 Most Indians want to follow a diet to lose weight. From crazy fad diets to weight loss supplements, there are a lot of things available in the market to help you drop the pounds. But, the best thing that can cut the calories quickly is following a strict diet.
Story first published: Friday, December 5, 2014, 15:16 [IST]
Desktop Bottom Promotion