For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉపవాసం ఎలా చేయాలి, ఎంత సమయం చేయాలి?

|

ఆధునిక జీవన విధానంలో అనారోగ్య సమ స్యలు అధికమవుతున్నాయి. ఆహార అలవాట్లు అనా రోగ్యసమస్యలు అధికం కావడానికి, తగ్గడానికి దోహ దం చేస్తాయి. చక్కటి ఆరోగ్యానికి ఉపవాసం దివ్య ఔషధమని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ఉప వాసం వల్ల శరీరంలోని జీర్ణ వ్యవస్థతో సహా అన్ని వ్యవస్థలు శుభ్రపడి ఆరో గ్యం చేకూరుతుంది. జీర్ణ వ్యవస్థలో మలినాలు పేరుకుపోయి మనిషి పలు వ్యా ధులకు గురవుతాడు. ఆ మలినాలను శరీరం నుంచి తొలగించి నట్లయితే ఆరోగ్యం సమకూరుతుంది. ఉపవాసం చేసినట్లయితే ఆ మలినాలు బయటకు వెళ్ళిపోయి శారీరక వ్యవస్థలు మళ్ళీ ఆరోగ్యవంతంగా మారు తాయని ఆయుర్వేదం సూచిస్తోంది. ఉపవాసం మానసిక ఉన్నతికి, తద్వారా చక్కటి ఆరోగ్యం, ఆలో చనా విధానంలో మంచి మార్పునకు అవకాశం కలిగి స్తుంది. ఉపవాసం అనుభవం ఎంతో ఆనందాన్ని కలి గిస్తుంది. తక్కువ సమయం ఉపవాసం చేసినా జీర్ణవ్య వస్థ మెరుగుపడి ఉత్తేజితమవుతుంది. తద్వారా జీర్ణ కోశం చక్కగా పనిచేసేది అవుతుంది. ఆహార పదా ర్థాలు బాగా జీర్ణం కావడం వల్ల విషతుల్యమైన మలి నాలు ఎక్కువ ఉత్పత్తి కావు. మతపరమైన ఆచార వ్యవహారాలలో, స్వస్థత కోసం అనుసరించే విధానంలో ఉపవాసం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఉపవా సం చేస్తే శరీరంలో ఉన్న విష తుల్య వ్యర్ధాలు బయటకు వెళ్ళి పోయి మనస్సు, శరీరం

What are the Health Benefits of Fasting?

శుభ్రపడి తేలికవుతాయి. జీర్ణకోశవ్యవస్థకు చక్కటి విశ్రాంతి కలుగుతుంది. శరీరమంతా హాయిగా, తేలికగా,తాజాగా అనిపించి శక్తిని పుంజుకుంటుంది.

రకాలు :

వండని పదార్ధాలతో ఉపవాసం : ఈ ఉపవాసం ఆహారపదార్ధాలకు బదులుగా పండ్లు, పచ్చికూరగా యలు తింటారు.

పానీయాలతో ఉపవాసం : ఇందులో ఆహారానికి బదులుగా మంచి నీళ్ళు, పండ్ల రసాలు, కూరగాయల రసాలు, హెర్బల్‌ టీ, గోరువెచ్చటి నీరు, నిమ్మరసం, తేనె కలుపుకుని తాగడం. పానీయాలతో ఉపవాసం ఏడాదిలో మూడు సార్లు అదీ వసంత కాలంలో ఆచ రించవచ్చు.

వండిన పదార్ధాలతో ఉపవాసం : ఈ తరహా ఉపవాసంలో ఉడికించిన కూరగాయలు, వండిన పెసరపప్పును, గింజలను తీసుకుంటారు.

సంపూర్ణ ఉపవాసం : ఈ తరహా ఉపవాసం చేసేవారు మంచి నీళ్ళు కూడా తాగరు.

విధానాలు : ఉపవాసం అలవాటు లేకుండా అప్పుడే కొత్తగా మెదలు పెట్టేవారు తక్కువ సమయం ఉపవాసం చేసి ఆ తరువాత ఎక్కువ రోజులు చేయ డానికి ప్రయత్నించాలి. ఏమి తినకుండా , ఒక్కసారి భోజనం చేసి లేదా ఆహార పదార్ధాలను కొన్నింటిని మినహాయించుకుని తినవచ్చు. ఉపవాసం పూర్తయ్యాక ఆహారాన్ని ఒకేసారి ఎక్కువగా తీసుకోకూడదు.

ఈ విషయాన్ని మరువరాదు. ఉపవాస సాఫల్యత అది పూర్తయ్యాక తీసుకునే ఆహారం పైనే ఆధారపడి వుంటుంది. ఉపవాస సమయంలో పొట్టలో ఖాళీయైన స్థానంలో తిరిగి అధికంగా చేర్చినట్లయితే ఉపవాసం వల్ల ప్రయోజనం వుండదు. మితిమీరిన సమయంలో ఉపవాసం చేస్తే జీవక్రియను దెబ్బతీస్తుంది. జీర్ణ శక్తి తగ్గుతుంది. శరీరం బలహీన పడుతుంది. అందువల్ల ఉపవాసం ఎలా, ఎంతకాలం చేయాలనే విషయం తెలుసుకుని ఆచరించాలి. ఒక నిపుణుడి పర్యవేక్షణ లేకుండా సంపూర్ణ ఉపవాసం చేయడమన్నది మంచిదది కాదు. శరీరం పరిశుభ్రంగా ఉంచుకోవాలి. తగినంత మానసిక, శారీరక విశ్రాంతి తీసు కోవాలి. తీవ్రంగా శారీరక వ్యాయామం చేయరాదు.అయితే నడక, యోగ, స్వల్ప వ్యాయామం చేయవచ్చు. ఉపవాసంలో తాజాగా తీసిన పండ్లు, కూరగాయల రసాలు మంచివి. బాటిళ్ళలో నిల్వ ఉంచిన వాటిని అస్సలు తీసుకోకూడదు. శారీరకంగా, మానసికంగా బాధపడే సమయంలో ఉపవాసం ఉండకూడదు. అలాగే మహిళలు రుతుస్రావం, గర్భినీ సమ యంలో, శరీరం బలహీనంగా, అలసటచెంది ఉన్న సమయంలో ఉపవాసం చేయడమనేది ఎంత మాత్రము మంచిది కాదు.

What are the Health Benefits of Fasting?1

ప్రయోజనాలు: శరీరం శక్తివంతమవుతుంది. మనస్సు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. మానసిక వికాసం కూడా ఎంతగానో కలుగుతుంది. శారీరక, మానసిక రుగ్మతలను అధిగమించడానికి ఉపవాసం దోహదం చేస్తుంది. మనో వ్యాకులత, సో మరితనం, అలసట ఇతర దీర్ఘ కాలిక రుగ్మతలు సంపూర్ణం గా తొలగిపోతాయి.

ఉపవాస కాలంలో శరీరం స్వస్థత పొందడం ప్రారంభమవుతుంది. సక్రమంగా వినియోగించుకోలేకపోవడం వల్ల శక్తి జీర్ణ వ్యవస్థ నుండి జీవక్రియ రోగనిరోధక వ్యవప్థపై మళ్ళుతుంది. ఎక్కవ సమయం ఉపవాసం ఉండి అనంతరం ఆహారం తీసుకనే సమయంలో ఎక్కువ జాగ్రత్త ఉండాలి. తగిన అవగా హన ఉండాలి. ఉపవాసం పూర్తయ్యాక ఘన పదార్ధం తీసుకోవడానికి ఎక్కువ సమయం తీసుకో వాలి. ముందుగా పోషక విలువలున్న ఆహారాన్ని కొద్ది కొద్దిగా తీసు కోవాలి. అప్పుడే ఉపవాస ఫలితాలు దక్కు తాయి.

English summary

What are the Health Benefits of Fasting?

People have fasted as a spiritual practice since ancient times. Today, there are a lot of people claiming that fasting also has a lot of health benefits. 
 As fasting whole day can lower your energy levels and make you feel weak and hungry, here are some tips to have a healthy fasting. If you are embarking on having a fast on Shivratri, then follow this health guide to have a healthy and spiritual fasting.
Desktop Bottom Promotion