For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సాయంత్రం కంటే, ఉదయం నడకతో గొప్ప ప్రయోజనాలు

|

ఉదయం నడక వల్ల మీరు ఆరోగ్యానికి ఎక్కువ మేలు జరుగుతుందని మీకు తెలుసా? ఉదయం కొంచెం చురుకుగా, జోరుగా నడక సాగించడంతో మీ శరీరంకు ఒక మంచి వ్యాయామాన్ని అందించిన వారు అవుతారు. ముఖ్యంగా ఉదయం నడిచే నడకతో చాలా ఎక్కువ ప్రయోజనాలుంటాయి. ప్రస్తుత రోజుల్లో ఉదయం నడకకు వెళ్ళడానికి చాలా మంది కష్టంగా భావిస్తున్నారు, ఈ ప్రక్రియను సాయంత్రానికి మార్చుకుంటున్నారు.

ప్రస్తుత రోజుల్లో ఎన్ని జాగ్రత్తలు తీసుకొన్నా, ప్రజల్లో ఏదో ఒక రూపంలో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి, కాబట్టి, సాయంత్రం కంటే ఉదయం సమయంలో నడక సారిచడం ఉత్తమ ఎంపికగా చేసుకొనే ఉదయం నడకకు వెళ్ళండి. ఉదయం సమయంలో ఎటువంటి కాలుష్యం లేకుండా, తాజాగా ఉండే గాలి మీ ఊపిరితిత్తులకు చాలా మేలు చేస్తుంది. మరియు ఉదయం నడక వల్ల చాలా త్వరగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఉదయం సమయంలో బ్రిస్క్ వాక్ చేయడం చాలా ఉత్తమం.

నడకతో ఎంత లాభం..ఎంత లాభం...తెలుసుకోవాలంటే : క్లిక్ చేయండి

మరి ఇకెందుకు ఆలస్యం, నడకను మొదలు పెట్టడానికి ముందు నడవల్ల గొప్ప ప్రయోజనాలను తెలుసుకోండి.

ఒత్తిడి తగ్గిస్తుంది:

ఒత్తిడి తగ్గిస్తుంది:

మీరు అధిక ఒత్తిడికి గురవుతుంటే, మార్నింగ్ వాక్ కు వెళ్ళండి . ఇది మీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇది మీ మనస్సును ప్రశాంతంగా ఉంచతుంది. నడక వల్ల ఒత్తిడి తగ్గించుకోవడం మాత్రమే కాదు మనలోని ఆందోళనలు తగ్గిస్తాయి.

కొలెస్ట్రాల్:

కొలెస్ట్రాల్:

అధిక కొలెస్ట్రాల్ తో బాధపడుతున్నట్లైతే మీరు ఖచ్చితంగా మార్నింగ్ వాక్ వెళ్ళాల్సిందే. ఉదయం వాక్ చేయడం వల్ల ఇది మంచి కొలెస్ట్రాల్ హెచ్ డిఎల్ లెవల్స్ ను పెంచుతుంది.

వ్యాధినిరోధకత పెంచుతుంది:

వ్యాధినిరోధకత పెంచుతుంది:

మీకు మంచి వ్యాధినిరోధక శక్తి అవసరం అవుతుంది. మీలోని చిన్న చిన్న వ్యాధులను మరియు సిక్ నెస్ ను ఎదుర్కోవడానికి వ్యాధినిరోధకత చాలా అవసరం అవుతుంది. అందువల్ల, వ్యాధినిరోధకత పెంచుకోవడానికి ఉదయం నడక చాలా మంచి ఎంపిక.

గర్భిణీ స్త్రీలకు:

గర్భిణీ స్త్రీలకు:

గర్భందాల్చినప్పుడు నడక మంచిదేనా? అని చాలా మందిలో అపోహ ఉంటుంది. గర్భిణీ స్త్రీలకు ఉదయం నడక ఆరోగ్యానికి చాలా మంచిది మరియు ప్రయోజనకరం. ఉదయం నడక వల్ల ఇది గర్భస్రావం జరగకుండా నిరోదిస్తుంది.

గుండె ఆరోగ్యానికి మేలుచేస్తుంది:

గుండె ఆరోగ్యానికి మేలుచేస్తుంది:

ఉదయం నడక మీ గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఒక గంటకు 3, 4 మైళ్ళు నడక సారించడం వల్ల ఇది హార్ట్ డిసీజ్ ను తగ్గిస్తుంది. రక్తప్రవాహం మెరుగ్గుగా ఉండాలంటే, నడక చాలా ఉత్తమం.

మంచి నిద్ర:

మంచి నిద్ర:

15-20నిముషాలు నడక వల్ల, రాత్రిల్లో మంచి నిద్రకు సహాకరిస్తుంది. ఇది శరీరం విశ్రాంతి తీసుకోవడానికి బాగా సహాయపడుతుంది. కాబట్టి, మీరు మంచిగా నిద్రపోవడానికి నడక చాలా అవసరం.

క్యాన్సర్ ను దూరంగా ఉంచుతుంది:

క్యాన్సర్ ను దూరంగా ఉంచుతుంది:

మద్యవయస్సు మహిళకలు నడకు చాలా ఆరోగ్యకరం. ఉదయం నడక వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాధాన్ని తగ్గిస్తుంది.

బరువు తగ్గిస్తుంది:

బరువు తగ్గిస్తుంది:

మీరు కొన్ని పౌండ్స్ బరువు తగ్గించుకోవాలంటే, ఖచ్చితంగా మార్నింగ్ వాక్ కు వెళ్ళాల్సిందే . ఉదయం నడక వల్ల ఆరోగ్యానికి మంచిది. కాలరీలను కరిగిస్తుంది మరియు ఇది జీవక్రియలను మెరుగుపరుస్తుంది. ఈ రెండూ కూడా బరువు తగ్గడానికి అద్భుతంగా సహాయపడుతాయి.

మధుమేహగ్రస్తులకు:

మధుమేహగ్రస్తులకు:

మీరు వ్యాయామం చేస్తే మీలో గ్లూకోజ్ లెవల్స్ తగ్గుతాయన్న విషయం మీకు తెలుసా? అందువల్ల, మార్నింగ్ నడక మధుమేహగ్రస్తులకు చాలా ప్రయోజనం. ఇది వారిలో బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్లో ఉంచుతంది.

టెన్షన్:

టెన్షన్:

పని వద్ద స్ట్రెస్ లెవల్స్ పెరిగి టెన్షన్ కు గురి అయ్యేవారు చాలా మందే ఉంటారు. అటువంటి వారికి ఉదయం నడక చాలా అద్భుతాలనే క్రియేట్ చేస్తుంది. మార్నింగ్ వాక్ వల్ల బ్లడ్ ప్రెజర్ కంట్రోల్లో ఉంటుంది మరియు హైపర్ టెన్షన్ కు వ్యతిరేకంగా పోరాడుతుంది.

కండరాలను బలోపేతం చేస్తుంది:

కండరాలను బలోపేతం చేస్తుంది:

ఉదయం నడక వల్ల కండరాలు బలోపేతం చేస్తుంది. ఎములకు ద్రుడంగా ఉంచుతుంది. కాబట్టి, డైలీ వాక్ చేయసి, మీ కండరాలను బలోపేతం చేసుకోండి.

మెదడు చురుకుదనంకు:

మెదడు చురుకుదనంకు:

మీ మెదడు చురుకుగా పనిచేయాలంటే, అందుకు, మెదడకు ఎక్కువగా ఆక్సిజన్ అవసరం అవుతుంది. మార్నింగ్ వాక్ వల్ల గొప్ప ఆరోగ్యప్రయోజనం రక్తప్రవాహాన్ని పెంచి దాంతో మీ మెదడు ప్రక్రియలను మెరుగుపరుస్తుంది.

English summary

Why Morning Walks Are Good For You!

Did you know that morning walks are extremely good for one's health. When you walk briskly, you are giving your body the best of exercises, especially when it is done in the morning. Today, there are tons of people who find it difficult to make time to go for a morning walk and usually opt for evening walks.
Desktop Bottom Promotion