For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పురుషుల కొరకు వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ అప్షన్స్

By Mallikarjuna
|

ప్రతి రోజూ మనం తీసుకొనే బ్రేక్ ఫాస్ట్ ఆరోజుకు ఎంత ముఖ్యమో మనందరికీ తెలిసిన విషయమే. డాక్టర్లు, డైటీషియన్లు ఉదయం తీసుకొనే అల్పాహారాన్ని ఎక్కువ మోతాదు తీసుకోమని సలహాలిస్తుంటారు. అదే రోజంతా మీకు కావల్సిన శక్తిని అందిస్తుంది. ఉదయం తీసుకొనే ఆహారంతోనే శరీరంలోనికి అవసరమయ్యే పోషకాలు, న్యూట్రీషియన్స్, ప్రోటీనలు అందుతాయని చెబుతుంటారు.

మనలో చాలా మందికి అల్పాహారం యొక్క విశిష్టత తెలియదు. ఆరోగ్యకరమైన అల్పాహారం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉంటుంది. చాలా మంది సమయం కుదరకో లేకపోతే బరువు తగ్గాలన్న ఆలోచనతోనో అల్పాహారాన్ని మితంగా లేదా ప్రత్యేకించి శ్రద్ద తీసుకోకుండా అప్పటికప్పుడు తయారుచేసుకునే నూడుల్స్ వాటితో సరిపెట్టుకుంటున్నారు.

మీరు ఎంపిక చేసుకొనే 10 వరస్ట్ బ్రేక్ ఫాస్ట్ ఐటమ్స్: క్లిక్ చేయండి

ఇటువంటి అనారోగ్యకరమైన అల్పాహార అలవాట్ల వల్ల ఎన్నో పాట్లు పడవలసి వస్తుంది. ఆరోగ్యంపై ఇవి దుష్ప్రభావం చూపిస్తాయి. కొలెస్టరాల్, గుండెకి సంబంధించిన వ్యాధులు, లైంగిక సమస్యలు ఇటువంటివి ఎన్నో తలెత్తుతాయి. కాబట్టి, ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో ఎంపిక చేసుకొనే కొన్ని వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ లు మీకోసం కొన్ని ...

మీరు నివారించాల్సిన టాప్ 9 బ్రేక్ ఫాస్ట్ మిస్టేక్స్ : క్లిక్ చేయండి

పాన్ కేక్

పాన్ కేక్

పాన్ కేక్స్ ను హెల్తీగా తయారు చేయడం చాలా కష్టంఅయిన పని. ఇందులో అధనపు కొవ్వు చేరడానికి అవసరం అయ్యే ఫ్యాటింగ్ ఫ్లోర్ కలిగి ఉంటుంది. బట్టర్ మరియు పంచదార కూడా ఎక్కువే. ఇది చాలా తియ్యగా ఉంటుంది. అదే విధంగా అధిక క్యాలరీలను శరీరానికి అంధిస్తుంది. దాంతో అదనపు కొవ్వు శరీరంలో చేరుతుంది.కాబట్టి రెగ్యులర్ గా పాన్ కేక్స్ ఎంపిక చేసుకోవడం ఆరోగ్యదాయకం కాద. రుచి ఎక్కువగా ఉండటం కోసం మైదా మరియు పంచదార సిరప్ తో తయారుచేస్తారు .

రంగు తృణధాన్యాలు మరియు స్వీట్ సిరియల్స్

రంగు తృణధాన్యాలు మరియు స్వీట్ సిరియల్స్

ఉదయం అల్పాహారంగా సెరియల్స్ ను అనారోగ్యకరమైనది, సెరియల్స్ ప్యాకెట్ మీద ఉన్న పదార్థాల్లోని కంటెంట్ లిస్ట్ ను ఖచ్చితంగా తెలుసుకోవాలి. కొన్ని సెరియల్స్ రుచి అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే వాటి పంచదార మరియు ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ మిక్స్ చేయబడి ఉంటుంది.

ప్రోసెస్డ్ మాంసం

ప్రోసెస్డ్ మాంసం

బాకాన్, హామ్స్ మరియు సాసేజెస్ లు ఈ విభాగం లో కి వస్తాయి. వారాంతపు ఆహ్లాదం లో భాగం గా వీటిని పరిగణించడం అంటే గుండె సమస్యలకి దగ్గరగా వెళుతున్నట్లే. ఆరోగ్యకరమైన అల్పాహారానికి కావలసినవి మధ్యాహ్న భోజనం వరకు ఆకలి వేయకుండా కడుపు నిండుగా అనిపించే లీన్ ప్రోటీన్లు. చికెన్ అలాగే గుడ్లు ఈ లీన్ ప్రోటీన్లకు ఆధారం.

వేయించినవి

వేయించినవి

మీ దినచర్యకు బ్రేక్ ఫాస్ట్ చాలా ముఖ్యం, మీరు ఎప్పుడు కానీ మీ బ్రేక్ ఫాస్ట్ ను మిస్ చేయకూడదు . అందుకు డీప్ ఫ్రై చేసిన చేపలు, బంగాళదుంప, పూరీలు,భతురాస్ లేదా సమోసాలు వంటివి ఎట్టి పరిస్థితుల్లోను బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోకూడదు. ఈ స్టఫ్ బాడీలో అధిక శాతంలో కొలెస్ట్రాల చేరుతుంది. దాంతో రోజుమొత్తంలో అవాంఛిత కొవ్వును శరీరం మొత్తం విస్తరింపచేస్తుంది.

స్వీట్స్

స్వీట్స్

ఇండియాలో కొన్ని ప్రదేశాల్లో ముఖ్యంగా బెంగాల్ మరియు ఉత్తర ప్రాంతాల్లో బేక్ ఫాస్ట్ కు ఎక్కువగా స్వీట్స్ ను వండుతుంటారు. ఇది నెమ్మదిగా మీ ధమనులు బ్లాక్ చేసేందుకు తగినంత కొలెస్ట్రాల్ ను మీ శరీరంలో నింపుతుంది. ఇంకా పాస్ట్రైస్ మరియు డోనట్స్ తినడం మీ బ్రేక్ ఫాస్ట్ లో ఇంత కంటే మరింత వరెస్ట్ ఎంపిక ఏదీ ఉండదు.

వడ పావ్

వడ పావ్

బ్రేక్ ఫాస్ట్ కోసం జంక్ ఫుడ్ కంటే మరో వరస్ట్ ఫుడ్ మరొకటి ఉండదు. స్టఫ్ చేసిన వడ పావ్, బర్గర్, పిజ్జా, సమోస, కచోరి వంటివి బ్రేక్ ఫాస్ట్ కు ఒక వరెస్ట్ ఎంపిక . ఇవి న్యూట్రీషియన్స్ తక్కువ మరియు ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువ. ఇది మీ శరీరానికి అధిక శాతంలో కొవ్వును చేర్చుతుంది.

English summary

Worst Breakfast Options For Men

The importance of breakfast is a well known fact. It is the meal of the day that is most crucial since it is had after a longer break than normal meals. While your lunch or dinner is typically had after 3-4 hours of your previous meal, your breakfast is mostly had after 7-8 hours of your previous day dinner.
Story first published: Tuesday, January 28, 2014, 20:34 [IST]
Desktop Bottom Promotion