For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బరువు తగ్గాలనుకొనేవారు ఉదయం చేయాల్సిన 10 ఆరోగ్యకరమైన పనులు

|

మీరు త్వరగా బరువు తగ్గాలని కోరుకుంటున్నారు, కానీ అది కుదరం లేదు?మరి అట్లైతే మీ బరుతు తగ్గించేకోవడానికి ప్రతి రోజూ ఉదయం మీరు ఖచ్చితంగా చేయాల్సిన కొన్ని వెయిట్ లాస్ ప్లాన్స్ ఉన్నాయి.

Ten Healthy Things To Do In The Morning

బరువు తగ్గించుకోవడంలో ముఖ్యంగా ప్లానింగ్ చేసుకోవడం ఎంత ముఖ్యమో, వాటిని అనుసరించడం కూడా అంతే ముఖ్యం. మీరు ఖచ్చితంగా బరువు తగ్గించుకోవాలని ఆశిస్తున్నట్లైతే, ప్రతి రోజూ ఉదయం మీరు చేయాల్సిన కొన్ని ఆరోగ్యకరమైన మార్గాలున్నాయి . వీటిని కనుక మీరు అనుసరించినట్లైతే తప్పనిసరిగా బరువు తగ్గించుకోగలుగుతారు.

బరువు తగ్గించుకొనే క్రమంలో మరీ ముఖ్యంగా అనుసరించాల్సిన పద్దతి ఏటంటే, ఉదయం నిద్రలేవగానే ఒక గ్లాసు వేడి గోరువెచ్చని నీటిలో, కొద్దిగా నిమ్మరసం, తేనె మిక్స్ చేసి పరకడుపుతో తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల శరీరంలో జీవక్రియలు వేగవంతం అవుతాయి. మరియు అదనపు బరువును కొన్ని పౌండ్లలో తగ్గించుకోవచ్చు.

READ MORE: ఉదయం చేసే వ్యాయామంతో బోలెడు ప్రయోజనాలు

ఇలా హని మరియు లెమన్ వాటర్ త్రాగడం మాత్రమే కాదు, మీ దిన చర్యను ఆరోగ్యకరమైన హై ప్రోటీ బ్రేక్ ఫాస్ట్ తో ప్రారంభించాలి. ఈ చిట్కాలతో బరువు తగ్గడం పెద్ద సవాలు లాంటిందే. వీటితో పాటు మరికొన్ని హెల్తీ చిట్కాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి...

నీళ్ళు త్రాగాలి

నీళ్ళు త్రాగాలి

ఉదయం నిద్రలేవగానే, ఒక గ్లాసు గోరువెచ్చని నీరు త్రాగాలి . ఈ హెల్తీ చిట్కా మీ మనస్సును మరియు శరీరాన్ని రిఫ్రెష్ చేస్తుంది. గోరువెచ్చని నీళ్ళు తీసుకోవడం వల్ల ఎక్కువ క్యాలరీలను కరిగిస్తుంది.

నిమ్మరసం

నిమ్మరసం

ఒక గ్లాసు లెమన్ జ్యూస్ ను తీసుకోవాలి. ఈ లెమన్ జ్యూస్ ను కాళీ పొట్టతో తీసుకోవడం వల్ల , చాలా త్వరగా బరువు తగ్గుతారు.

యాలకల టోస్ట్

యాలకల టోస్ట్

ఆకలి?రెండు స్లైస్ ల టోస్ట్ ను తయారుచేసుకోవాలి. టోస్ట్ మీద కొద్దిగా యాలకలపొడిని చిలకరించి వేడి వేడిగా తినాలి . ఇలా చేయడం వల్ల క్యాలరీలు త్వరగా కరిగిపోవడానికి సహాయపడుతుంది.

తేనె గ్రీన్ టీ

తేనె గ్రీన్ టీ

ప్రతి రోజూ ఉదయం, ఒక కప్పు గ్రీన్ టీ తీసుకోవాలి. గ్రీన్ టీకి పంచదారకు బదులుగా తేనెను మిక్స్ చేసి తీసుకోవాలి.

జాగింగ్

జాగింగ్

ఉదయం నడక లేదా చిన్న పాటి జాగింగ్(పరుగు)వల్ల త్వరగా బరువు తగ్గించుకోవచ్చు. ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది . మీ శరీరం ఫిట్ గా ఉండటానికి సహాయపడుతుంది. వ్యాధినిరోధకతను పెంచుతుంది.

బ్రేక్ ఫాస్ట్ ను ఫుల్ గా తినాలి

బ్రేక్ ఫాస్ట్ ను ఫుల్ గా తినాలి

బ్రేక్ ఫాస్ట్ ను ఎక్కువగా తీసుకోవాలి. రోజంతా మీకు ఆకలి అనిపించకూడదనుకుంటే, ఉదయం బ్రేక్ ఫాస్ట్ తప్పనిసరిగా ఎక్కువగా తీసుకోవాలి. అందులోనూ అధిక ప్రోటీనులున్న ఎగ్ మరియు బ్రౌన్ బ్రెడ్ వంటి ఆహారాలను రెగ్యులర్ గా తీసుకోవాలి.

లంచ్ మీల్

లంచ్ మీల్

మద్యాహ్నాం భోజనానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా అవసరం. మీరు భోజనంలో తీసుకొనే పదార్థాల్లో ప్రోటీన్స్, మినిరల్స్ మరియు న్యూట్రీషియన్స్ అధికంగా ఉండేలా చూసుకోవాలి.

ఎక్కువ విశ్రాంతి పనికిరాదు

ఎక్కువ విశ్రాంతి పనికిరాదు

వేగంగా బరువు తగ్గాలనుకొనేవారు, ఎక్కువ విశ్రాంతి తీసుకోవాలనే విషయాన్ని మర్చిపోవాలి. చిన్నపాటి విరామాలు తీసుకుంటు సరిపోతుంది.

సూర్యరశ్మి తగలాలి

సూర్యరశ్మి తగలాలి

ఆహారంతో తీసుకొన్నప్పుడు పొందే విటమిన్స్ మాత్రమే కాకుండా,శరీరానికి మరో ప్రధానమైన విటిమిన్ డి చాలా అవసరం అవుతుంది. ఈ విటమిన్ ఉదయం సూర్యరశ్మి వల్ల పొందవచ్చు.

జిమ్

జిమ్

మీకు నడక లేదా జాగింగ్ కు వెళ్ళడం ఇష్టం లేకపోతే, జిమ్ కు వెళ్ళండి. ఉదయాన్నే నిద్రలేచి జిమ్ కు వెళ్ళి కనీసం 40నిముషాలు గడపాలి . అప్పుడే శరీరంలో అదనపు క్యాలరీలు కరిగిపోతాయి.

English summary

Ten Healthy Things To Do In The Morning

Want to lose weight quickly, but not able to? Then, here are some of the best things you can do in the morning to speed up your weight loss plan. Weight loss is one of the easiest things to achieve if you have set your eyes on the goal. These healthy things to do in the morning need your complete focus in order to turn from flab to fab.
Desktop Bottom Promotion