For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బరువు తగ్గించి.. ఆరోగ్యంగా ఉంచే 15 సూపర్ ఫుడ్స్

|

సూపర్ ఫుడ్స్ ఎల్లప్పుడూ మంచి న్యూట్రీషియన్స్, ప్రోటీన్స్ ను కలిగి ఉంటాయి మరియు ఇవి ఆరోగ్యానికి చాల ఉత్తమమైనవి . ఇవి మనిషిలో ఎనర్జిలెవల్స్ ను అమాంతం పెంచేస్తాయి మరియు బరువు తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి.

READ MORE:పొట్ట కొవ్వును గణనీయంగా తగ్గించే ఉత్తమ ఆహారాలివి..!

అలాంటి సూపర్ ఫుడ్స్ ను మన రెగ్యులర్ డైట్ లో ఎలాంటి సందేహం లేకుండా చేర్చుకోవచ్చు. మరి బరువు తగ్గించే ఆ సూపర్ ఫుడ్స్ ఏంటో ఈ క్రింది స్లైడ్ ద్వారా తెలుసుకుందాం....

 ఆపిల్స్:

ఆపిల్స్:

లోక్యాలరీ డైట్ ఫుడ్స్ ఎప్పుడు ఫైటోన్యూట్రీషియన్స్, డైటరీ ఫైబర్ మరియు యాంటీఆక్సిడెంట్స్ తో నిండి ఉంటాయి. ఇవి వ్యాధులను నివారిస్తాయి మరియు మంచి ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి.

ఓట్స్ :

ఓట్స్ :

ఓట్స్ లో కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉండుటం వల్ల ఇది సెరోటినిన్ వంటి హార్మోనులను విడుదల చేస్తాయి. ఇది మీరు విశ్రాంతి పొందడానికి మరియు ఫ్యాట్ కరిగించడానికి గ్రేట్ గా సహాయపడుతాయి.

పెరుగు:

పెరుగు:

పాల కంటే చాలా త్వరగా సులభంగా జీర్ణం అయ్యే ఆహార పదార్థం ఇది . ఎందుకంటే వీటిలో క్యాల్షియం మరియు విటమిన్ బి అధికంగా ఉండి, వ్యాధినిరోధకతను పెంచుతాయి. మరియు ఆకలి కోరికలను తగ్గిస్తాయి. బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేసి కోలన్ క్యాన్సర్ ను తగ్గిస్తాయి

దానిమ్మ:

దానిమ్మ:

దానిమ్మలో యాంటీఆక్సిడెంట్స్ మరియు ఫోలిక్ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి . మరియు అందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. మరియు క్యాలరీలు తక్కువ. దాంతో మీరు స్వీట్ తినాలనే కోరికలను తగ్గిస్తాయి(వీటని అలాగే నేరుగా లేదా జ్యూసులు లేదా సలాడ్స్ )రూపంలో తీసుకోవచ్చు. ఇది అదనపు బరువు పెరగకుండా సహాయపడుతుంది.

బ్లూ బెర్రీస్ :

బ్లూ బెర్రీస్ :

బ్లూ బెర్రీస్ లో యాంటీఆక్సిడెంట్స్ , హైఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మీ పొట్టను ఫుల్ గా ఉండేందుకు సహాయపడుతుంది. ఎక్కువ సమయం ఆకలి కానివ్వదు

లెంటిల్స్ :

లెంటిల్స్ :

లెంటిల్స్ లో ఫైబర్ మరియు ప్రోటీన్స్ అధికంగా ఉన్నాయి. లెంటిల్స్ లో అవసరం అయ్యే గంజి, కార్బోహైడ్రేట్స్ ఉండటం వల్ల ఇది మెటబాలిక్ ప్రొసెస్ ను మెరుగుపరుస్తుంది. మరియు కొవ్వును కరిగించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

సాల్మన్:

సాల్మన్:

సాల్మన్ ప్రోటీనులు అధికంగా ఉంటాయి . ఇది మిమ్మల్ని పొట్ట నిండుగా ఉండేట్లు చేస్తుంది కానీ కొద్దిగా కూడా బరువు పెరగకుండా చేస్తుంది. ఇందులో ఒమేగా ఫ్యాటీ 3యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. మరియు ఇన్సులిన్ సెన్సివిటిని మరియు హార్ట్ ను హెల్తీగా ఉంచుతుంది

గ్రీన్ టీ:

గ్రీన్ టీ:

ప్రతి రోజూ రెండు మూడు కప్పుల గ్రీన్ టీ త్రాగడం వల్ల అదనపు బరువును చాలా త్వరగా తగ్గించడానికి సహాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ ఫ్యాట్ ను కరిగిస్తుంది మరియు క్యాలరీలను బర్న్ చేస్తుంది.

పుచ్చకాయ:

పుచ్చకాయ:

పుచ్చకాయలో 92శాతం నీరు ఉంటుంది. ఇందులో విటమిన్ ఎ మరియు సి, మరియు లైకోపిన్ అధికంగా ఉన్నాయి. అంతే కాదు పవర్ ఫుల్ యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వల్ల బరువును చాలా ఎఫెక్టివ్ గా తగ్గిస్తుంది .

 ఫ్లాక్స్ సీడ్స్ :

ఫ్లాక్స్ సీడ్స్ :

ఫ్లాక్స్ సీడ్ ను ఒక చెంచాను ప్రతి రోజూ తీసుకోవాలి. ఎందుకంటే ఇందులో ఉండే ఒమేగా 3ఫ్యాటీ యాసిడ్స్ మరియు అధిక మొత్తంలో ఫైబర్ కలిగి ఉంటుంది. ఇది ఆకలిని పెంచకుండా కంట్రోల్ చేస్తుంది . మరియు శారీరకంగా ఫిట్ గా ఉండేందుకు సహాయపడుతుంది. ఫ్లాక్స్ సీడ్స్ ను ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో మిక్స్ చేసి, అందులో సలాడ్స్, లేదాసూప్స్, చట్నీలను, లేద ఎగ్ బురుజును చిలకరించి తీసుకోవచ్చు.

మష్రుమ్స్ :

మష్రుమ్స్ :

వెజిటేరియన్స్ అయితే, మాంసాహారలకు బదులుగా మీకు నచ్చిన రుచికరమైన ఫుడ్స్ ఎంపిక చేసుకోవడం ఉత్తమ ఎంపిక. మాంసాహారానికి ప్రత్యామ్నాయంగా మష్రుమ్ ను తీసుకోవడం వల్ల ఇది క్యాలరీలను తగ్గిస్తుంది మరియు బరువును కూడా తగ్గిస్తుంది.

హాట్ చిల్ పెప్పర్స్ :

హాట్ చిల్ పెప్పర్స్ :

భోజనానికి అరగంట ముందు హాట్ చిల్ పెప్పర్స్ ను తీసుకోవడం వల్ల మీరు రెగ్యులర్ గా తీసుకొనే ఆహారం యొక్క మోతాదు కంటే 10శాతం తక్కువగా తీసుకోగలుగుతారు. బరువు తగ్గించడంలో ఇది ఒక గ్రేట్ ఫుడ్ గా భావిస్తారు.

బాదం:

బాదం:

బాదంలో యాంటీఆక్సిడెంట్స్, న్యూట్రీషియన్స్, మరియు ప్రోటీన్స్ అధికంగా ఉండటం బరువు తగ్గించడానికి గ్రేట్ గా సహాయపడుతుంది. బాదం నమలడం వల్ల విడుతలయ్యే ఫ్యాట్స్ ఆకలిని కానివ్వకుండా ఎక్కువ సమయం పొట్ట నిండుగా ఉండే భావన కలిగిస్తుంది . మరియు ఇందులో ఉండే హై ఫైబర్ కంటెంట్ బరువు తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

 ఆలివ్ ఆయిల్ :

ఆలివ్ ఆయిల్ :

ఆయిల్ కు మరియు ఫ్యాట్స్ కు పరస్పర సంబంధం కలిగి ఉంటుంది. వీటిలో ఉండే పాలీ అన్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఆకలి కానివ్వకుండా చేస్తుంది. మరియు వీటిలో ఓలిక్ యాసిడ్ ఎక్సెస్ ఫ్యాట్ ను బ్రేక్ డౌన్ చేస్తుంది.

 క్రాన్ బెర్రీ జ్యూస్:

క్రాన్ బెర్రీ జ్యూస్:

క్రాన్ బెర్రీ జ్యూస్ లో ఆంటీయాక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇది ఒక ఎక్సలెంట్ డ్యూరియాటిక్ డ్రింక్. ఇది శరీరంలో ఎక్సెస్ వాటర్ ను మొత్తం తొలగిస్తుంది . అదనపు నీరు చేరడం వల్ల పొందే బరువును తగ్గిస్తుంది.

English summary

15 Super Foods For Weight Loss: Telugu health Tips

Health tips in Telugu 15 Super Foods For Weight Loss. Super foods have the best nutrients for maintenance and betterment of our health. They boost our energy level and also aids weight loss.
Desktop Bottom Promotion