For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బరువు సులభంగా తగ్గేందుకు భోజన ప్రియులకి15 చిట్కాలు

|

వింటర్ హాలీడేస్ తరువాత ప్రజలందరూ అధిక బరువును తగ్గించుకునేందుకే ప్రెఫరెన్స్ ఇస్తారు. మీరు భోజన

ప్రియులైతే బరువు తగ్గడం కొంచెం కష్టమైన విషయమే. అయితే అసాధ్యం మాత్రం కాదు.

భోజనప్రియులైనా బరువు తగ్గాలని మీరనుకుంటున్నారు కాబట్టి మీకు కచ్చితంగా డిటర్మినేషన్ అవసరం. బరువు తగ్గుతారన్న నమ్మకంతో పాటు పాజిటివ్ మైండ్ ఫ్రేం ఎంతో ముఖ్యం. ఒకవేళ మీకు బంధుమిత్రుల నుంచి సహకారం అందితే ఇంకా మంచిది. భోజన ప్రియులకి ఆహారాన్ని దూరంగా ఉంచడం ఎంతో కష్టమైనా అంశం. అయితే, ఫుడ్ క్రేవింగ్స్ ను మీరు కంట్రోల్ చేయగలిగితే ఇది అసాధ్యం మాత్రం కాదు. మీరు ఫుడ్ క్రేవింగ్స్ ను కంట్రోల్ చేయడమే బరువు తగ్గడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.

రెండో సారి ఆహార వడ్డనలకు నో చెప్పడం ద్వారా మీ ఆకలిని తగ్గించుకోవచ్చు. విపరీతమైన ఆకలి కలిగిన వారికి, భోజన ప్రియులకు ఈ టిప్స్ బరువు తగ్గేందుకు కచ్చితంగా ఉపయోగపడతాయి. చదవండి మరి.

మంచినీళ్ళను ప్రత్యామ్నాయంగా వాడడం

మంచినీళ్ళను ప్రత్యామ్నాయంగా వాడడం

మీ ఆకలిని తగ్గించుకునేందుకు మీరు ఎక్కువగా మంచినీళ్ళను తాగాలి. వాటర్ ను ఎక్కువగా తాగడం వల్ల శరీరంలోని అదనపు కొవ్వు కరుగుతుంది. మీ అధిక బరువు కూడా త్వరగా తగ్గుతుంది.

తినడానికి ముందు గ్రీన్ టీ

తినడానికి ముందు గ్రీన్ టీ

తక్కువ సమయంలోనే కొవ్వును కరిగించడానికి గ్రీన్ టీ ఉపయోగపడుతుంది. విపరీతమైన ఆకలిని తగ్గించడానికి కూడా గ్రీన్ ఉపయోగపడుతుంది.

హెల్తీ ఫుడ్స్

హెల్తీ ఫుడ్స్

మీ పొట్టను నింపే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం ఎంతో ముఖ్యం. దీనివల్ల ఆకలి ఎక్కువగా వేయదు. శరీరానికి అవసరమైన శక్తి కూడా లభిస్తుంది.

లో కేలరీ ఫుడ్స్

లో కేలరీ ఫుడ్స్

లో కేలరీ ఫుడ్స్ ను తీసుకోవడం కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. బరువు తగ్గేందుకు లో కేలరీ ఫుడ్స్ కు ప్రెఫరెన్స్ ఇవ్వాలి.

తగినంత నిద్ర

తగినంత నిద్ర

ప్రతి రొజూ ఎనిమిది గంటలు సరైన నిద్ర అవసరం. తగినంత నిద్ర ఉన్నప్పుడు ఎక్కువగా ఆహారాన్ని తీసుకోవడం తగ్గిపోతుంది. మీ జీవనశైలి క్రమబద్ధంగా మార్చుకోవడంతో పాటు మీరు సరైన సమయంలో ఆహారం తీసుకోవడానికి ప్రయత్నించాలి.

ఆహారం నుంచి దృష్టిని మరల్చాలి

ఆహారం నుంచి దృష్టిని మరల్చాలి

మీ మనస్సుపై మీకు బలమైన కంట్రోల్ ఉన్నప్పుడు ఈ పద్దతిని పాటించండి. ఆహారంపై నుంచి మీ దృష్టిని మరల్చడానికి ప్రయత్నించండి. వేరేవాటిపై దృష్టిపెట్టండి. విపరీతమైన ఆకలి కలిగినవారికి ఈ చిట్కా ఎంతో ఉపయోగపడుతుంది.

ప్రోటీన్స్ ను తగ్గించండి

ప్రోటీన్స్ ను తగ్గించండి

బీన్స్, ఆకు కూరలు, బఠానీల వంటి వివిధ రకాల పదార్థాలలో హై ప్రోటీన్స్ ఉంటాయి. వీటిని ఎక్కువగా తీసుకోవాలి. బరువు సులభంగా తగ్గుతారు.

లో జీఐ ఫుడ్స్

లో జీఐ ఫుడ్స్

లో గ్లైకెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాన్నే తీసుకోండి. అరటి పళ్ళు, బీన్స్, ఆకు కూరలలో లో గ్లైకెమిక్ ఇండెక్స్ గల కూరలు. ఇవి ఆకలిని తగ్గిస్తాయి.

రెండవ సారి తినడాన్ని తగ్గించుకోవాలి

రెండవ సారి తినడాన్ని తగ్గించుకోవాలి

టేబుల్ పై ఆహారం సిద్ధంగా ఉన్నపుడు ప్లేట్ లోనున్న దాన్ని తినాలి. రెండవ సారి తినాలన్న కోరికను తగ్గించుకోవాలి. అవసరమైతే మంచినీళ్ళు తాగి ఆకలికి సర్దిచెప్పుకోవాలి.

వృధా అవుతాయని తినకండి

వృధా అవుతాయని తినకండి

మితంగా తినడం నేర్చుకోండి. ఆహారంపై కంట్రోల్ తెచ్చుకోండి. మిగిలిపోయిన ఆహార పదార్థాలు వృధా అవుతాయేమోనని మీ పొట్టలో వేసుకోకండి. ఆరోగ్యాన్ని పాడుచేసుకోకండి.

చిన్న ప్లేట్ ట్రిక్

చిన్న ప్లేట్ ట్రిక్

భోజనం చేసేటప్పుడు చిన్న ప్లేట్ ను ఎంచుకోండి. మీ ఆకలి దానంతట అదే తగ్గిపోతుంది.

వర్క్ అవుట్ తరువాత తినండి

వర్క్ అవుట్ తరువాత తినండి

ఆరోగ్యంగా ఉండేందుకు వర్కవుట్ తరువాత తినడం అలవాటు చేసుకోవాలి. ఆరోగ్యకరమైన ఫుడ్ ను తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చు. నాజుగ్గా ఉండొచ్చు.

ఫైబర్ కలిగిన ఫుడ్ నే తీసుకోండి

ఫైబర్ కలిగిన ఫుడ్ నే తీసుకోండి

ఫైబర్ రిచ్ ఫుడ్స్ కే ప్రాధాన్యతనివ్వండి. కడుపు నిండిన భావన కలిగించడంలో ఫైబర్ రిచ్ ఫుడ్స్ ప్రధాన పాత్ర పోషిస్తాయి.

కొద్ది మోతాదులో తినండి

కొద్ది మోతాదులో తినండి

మీల్స్ ను కొద్ది మోతాదుకే పరిమితం చేయండి. బరువు తగ్గడానికి ఈ చిట్కా ఉపయోగపడుతుంది.

రుచిని మార్చండి

రుచిని మార్చండి

రుచికరమైన ఆహారాన్ని చేదుగానున్న ఆహారంతో భర్తీ చేయండి. కాకరకాయ, బ్రోకోలీ వంటి వాటికి ప్రెఫరెన్స్ ఇవ్వండి.

English summary

15 Ways To Lose Weight When You Have A Big Appetite

After the winter holidays, people are keen on losing those extra pounds. If you have a big appetite, it is going to take a long time to lose weight. But that does not mean it is not possible!
Story first published: Monday, January 19, 2015, 8:50 [IST]
Desktop Bottom Promotion