For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వేగంగా బరువు తగ్గించే టాప్ 25 ఫ్యాట్ బర్నింగ్ ఫుడ్స్

|

అధిక బరువు ఉన్నవారు బరువు తగ్గించుకోవడం చాలా కష్టం అని భావిస్తుంటారు. దానికి తోడు ఉన్న బరువును తగ్గించుకోవడానికి బదులుగా బద్దకిస్తుంటారు . బరువు తగ్గించుకోడానికి సరైన సమయంలో సరైన ఆహారం తీసుకోవడం వల్ల బరువు తగ్గించుకోవడం అంత కష్టమైనది కాదు. అవును అదనపు బరువుతో బాధపడే వారు, శరీరంలోని అదనపు కొవ్వును కరిగించుకోవడానికి కొన్ని ఫ్యాట్ బర్నింగ్ ఫుడ్స్ సహాయపడుతాయి. ఇవి క్యాలరీలను తగ్గించడం మాత్రమే కాదు, స్లిమ్ గా కూడా మార్చుతాయి. సరైన సమయంలో సరైన ఆహారంను తీసుకోవడం ద్వారా మీరు బరువు తగ్గాలనే లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. కొన్ని రోజుల పాటు ఈ ఆహారాలను తీసుకోవడంతో పాటు ఎఫెక్టివ్ వర్కౌట్స్ చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలను గమనించవచ్చు . మీ శరీరంలో చేరిన అదనపు కొవ్వును సులభంగా తగ్గించుకోవచ్చు.

ఈక్రింద ఉదహరించిన ఫ్యాట్ బర్నింగ్ ఫుడ్స్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. అయితే ఈ ఫ్యాట్ బర్నింగ్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోకూడదు. బరువు తగ్గించుకొనే క్రమంలో పరిమితంగా మాత్రమే వీటిని తీసుకోవాలి. లేదంటే మీరు పొట్ట సమస్యలకు గురి అవుతారు. మరి మీ శరీరం యొక్క బరువును తగ్గించుకోవడానికి ఫ్యాట్ బర్నింగ్ ఫుడ్ ను త్వరగా లిస్ట్ తయారుచేసేద్దాం రండి...

అల్లం:

అల్లం:

అల్లం శరీరంలోని జీవక్రియలను వేగవంతం చేస్తుందని ఆరోగ్యనిపుణులు నిర్ధారించారు . మరియు ఇది కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తుంది . ఇంకా విటమిన్స్, మినిరల్స్ మరియు యాంటీఆక్సిడెంట్స్ కలిగి ఉంటుంది.

వెల్లుల్లి:

వెల్లుల్లి:

వెల్లుల్లిలో అల్లిసిన్(allicin)అనే అంశం కలిగి ఉండి యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉండి శరీరంలోని కొవ్వును తగ్గిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ ను నివారిస్తుంది.

ఉల్లిపాయ:

ఉల్లిపాయ:

జీవక్రియలను చురుకుగా ఉంచడంలో ఉల్లిపాయలు ప్రధాణ పాత్రను పోషిస్తాయి. అంతే కాదు, మనం వండే ఆహారాలకు మంచి రుచిని అందిస్తాయి. అందుకే పచ్చిగా కూడా సలాడ్స్ లో జోడించాలి.

ఓట్స్:

ఓట్స్:

ఓట్స్ తినడానికి మాత్రమే రుచిగా మాత్రమే కాదు ఇవి తిన్న తర్వాత కడుపు నిండుగా అనిపిస్తుంది. దాంతో అధికంగా తినాలనే కోరికను ఓట్స్ తగ్గిస్తాయి. ఓట్స్ లో ఫైబర్ అధికంగా ఉండి కొలెస్ట్రాల్ లెవల్స్ ను మరియు కొవ్వులు సమతుల్యంగా ఉంచేందుకు సహాయపడుతుంది.

గ్రీన్ టీ:

గ్రీన్ టీ:

గ్రీన్‌ టీ గ్రీన్‌ టీలోని యాంటీ ఆక్సిడెంట్స్‌ మెటబాలిజమ్‌కు అనువైన పరిస్థితిని శరీరంలో కల్పిస్తాయి. అలాగే క్యాన్సర్‌ నిరోధక కారకాలు, కొవ్వు అదుపులో ఉంచే అంశాలు గ్రీన్‌ టీలో పుష్కలం.ఇది బరువు తగ్గించడంలో బాగా సహాయపడుతుంది మరియు శరీరంలో మెటబాలిజం రేటును పెంచుతుంది. అలాగే మరో ప్రయోజనం హార్ట్ రేటు పెంచుతుంది. మీ గుండె కొట్టుకోవడం పెంచుతుంది, దాంతో మరిన్ని క్యాలరీలను మీరు కరిగించుకోవచ్చు.

స్వీట్ పొటాటో:

స్వీట్ పొటాటో:

ఆరోగ్యదాయకం స్వీట్‌ పొటాటో.... శరీరానికి కావల్సిన పోషకపదార్థాలను అందించడంలోనే కాదు వివిధ రకాలుగా శరీరంలో చేరిన విషపదార్థాలను తొలగించడంలో చిలుగడ దుంపలకు ప్రత్యేక స్థానం ఉంది. అనేక ఖనిజ లవణాలతో పాటు దుంపలలో బరువు తగ్గించే లక్షణాలు కూడా తక్కువే.

దాల్చిన చెక్క:

దాల్చిన చెక్క:

మసాలాలో వాడే దాల్చిన చెక్క ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది తీయగా, ఘాటుగా ఉంటుంది. దాల్చిన చెక్క నుండి సేకరించే నూనెలో యాంటీ వైరల్‌, యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలున్నాయి. అందుకే, వాటి నుండి సోకే ఏ వ్యాధులైనా సరే ఇట్టే మాయం అవుతాయి.

సాల్మన్:

సాల్మన్:

చేపల్లో అన్ సాచురేటెడ్ (అసంతృప్త కొవ్వు )కలిగి ఉంటాయి. మరియు అత్యవసర ఖనిజలవణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని కొవ్వును కరిగించడానికి బాగా సహాయపడుతాయి. కాబట్టి మీ రెగ్యులర్ డైట్ లో సాల్మన్ మరియు మెకరేల్ వంటి ఆహారాలను మధ్యహ్నాభోజనంలో లేదా రాత్రి డిన్నర్ లో తీసుకోవడం వల్ల బరుబు తగ్గడానికి మరియు అధికంగా అధనంగా పేరుకొన్న కొవ్వును కరిగించుకోవచ్చు.

స్ట్రాబెర్రీస్:

స్ట్రాబెర్రీస్:

స్ట్రాబెర్రీస్ మరియు బ్లూ బెర్రీస్ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం చాలా అవసరం. ఎందుకంటే వీటిలో యాంటీఆక్సిడెంట్స్, ఫైబర్, మినిరల్స్ మరియు విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మీలో అధిక క్యాలరీలను చేర్చవు కాబట్టి, రెగ్యులర్ గా వీటిని తీసుకోవచ్చు. స్ట్రాబెర్రీ శరీర బరువును తగ్గిస్తుంది. శరీరానికి కావల్సిన శక్తిని ఇచ్చి, ఎక్కువ సేపు ఆకలికాకుండా సహాయపడుతుంది. కొవ్వును కరిస్తుంది.

బ్రౌన్ బ్రెడ్:

బ్రౌన్ బ్రెడ్:

త్రుణధాన్యాలతో తయారుచేసిన బ్రెడ్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం చాలా అవసరం. శరీరంలో ఎక్కువ క్యాలరీలను తగ్గిస్తుంది . జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది . ఇవి మన శరీరానికి అవసరం అయ్యే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, క్యాల్షియం, విటమిన్స్, మినిరల్స్ మరియు ఫైబర్ ను అందిస్తుంది.

నిమ్మరసం:

నిమ్మరసం:

భోజనం చేసిన తర్వాత నిమ్మరసం, నిమ్మజ్యూస్ తాగడం వల్ల శరీరానికి చాలా మంచిది. శరీరాన్ని చల్లబరుస్తుంది. ఇందులోని సిట్రస్ ఆమ్లం బరువు పెరగనీయకుండా అడ్డుకుంటుంది.

గుడ్డు:

గుడ్డు:

గ్రుడ్లు జింక్, విటమిన్ B, అయోడిన్, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, మరియు ప్రోటీన్ కలిగి ఉన్నాయి. గుడ్లలో అధిక ప్రోటీనులు మరియ ఇతర ముఖ్యమైన ఖనిజాలు ఉండి అతి తక్కువ కేలరీలను కలిగి ఉంటుంది. మీ శరీరాన్ని, కండర పుష్టిని పెంచుకోవడానికి ఇది చాలా సహాయపడుతుంది. అధిక కొవ్వును నియంత్రించడానికి..మంచి కొలెస్ట్రాల్ ను పెంచుకోవడానికి గుడ్లు బాగా సహాయపడుతాయి. గుడ్డు ఆరోగ్యం, పోషక విలువలు కల బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటే శరీర కొవ్వు కరిగి ఎనర్జీ వస్తుంది. గుడ్డు పొట్ట నింపుతుంది. కొవ్వును కరిగించి ఎనర్జీగా మార్చి శరీరానికిస్తుంది.

ఆపిల్స్:

ఆపిల్స్:

ప్రతిరోజూ యాపిల్‌ పళ్లు తింటే శరీరంలో పేరుకున్న కొవ్వు కణాలు తగ్గుముఖం పడతాయి. యాపిల్‌ తోలులో ఉండే పెక్టిన్‌ శరీర కణాలు కొవ్వును పీల్చుకోకుండా నియంత్రిస్తాయి.యాపిల్స్ లో ఉన్న పుష్కలమైన యాంటీ ఆక్సిడెంట్స్ మరియు పోషకాంశాలను అటుంచితే..యాపిల్స్ లో నీటితో కూడిన పెక్టిన్ అధికంగా ఉండటం వల్ల ఇవి ఫ్యాట్ సెల్స్ ను ఘననీయంగా తగ్గిస్తుంది.

మస్టర్డ్(ఆవాలు) :

మస్టర్డ్(ఆవాలు) :

బరువు తగ్గడానికి మీరు తీసుకొనే ఆహారంలో ఆవాలను లేదా ఆవనూనెను చేర్చుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఆవాల్లో ఫ్యాటీ యాసిడ్స్ (ఒలియిక్, యురిసిక్ మరియు లినోలెనిక్ ఆమ్లం)లో సాచ్యురేటెడ్ ఫ్యాట్ మరియు యాంటీఆక్సిడెంట్స్ ఉండి క్యాలొరీస్ ను బర్న్ చేస్తాయి. మరియు బరువు తగ్గిస్తాయి.

చికెన్:

చికెన్:

మాంసాహారంలో లీట్ మీట్ ను తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది, అదనపు కొలెస్ట్రాల్ చేరదు . లీన్ మీట్ ప్రోటీనులను అందిస్తుంది. లీన్ మీట్ తినడం వల్ల పొట్ట ఫుల్ గా ఉన్నఅనుభూతిని కలిగిస్తుంది. ఎక్కువ సమయం ఆకలి కానివ్వదు.

పాప్ కార్న్:

పాప్ కార్న్:

పాప్ కార్న్ ను మీరు బయట రెడీమేడ్ తెచ్చుకోవడం కంటే, కార్న్స్ ను తీసుకొచ్చి, ఇంట్లో తయారుచేసుకోవడం ఆరోగ్యకరం . అవుట్ సైడ్ తయారుచేసే వాటితో శరీరంలో అదనపు క్యాలరీలు చేరుతాయి.

టమోటోలు:

టమోటోలు:

కొవ్వు త్వరగా తగ్గాలంటే పచ్చి టమాటాలు తినండి. టమాట సలాడ్ కేన్సర్ కూడా నివారిస్తుంది. కనుక కొద్ది ఆకలి వేస్తే టమాటాలు తినండి.

మిరియాలు:

మిరియాలు:

మెటబాలిజం రేటును అమాంతంగా పెంచుతుంది. శరీరంలో కొవ్వు త్వరగా కరిగేందుకు సహాయపడుతాయి. ఆకలి కోరికలను కంట్రోల్ చేస్తాయి . యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వల్ల వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.

చీజ్:

చీజ్:

లో ఫ్యాట్ కాటేజ్ చీజ్ రెగ్యులర్ గా తీసుకోవాలి . ఈ ఆహారం వల్ల మన శరీరానికి క్యాల్షియం మరియు ప్రోటీనులను అధికంగా అందివ్వొచ్చు . అయితే దీన్ని పరిమితంగా తీసుకోవాలి.

పుచ్చకాయ:

పుచ్చకాయ:

వేసవివచ్చిందే పుచ్చకాయలు ఎక్కువగా మనకు అందుబాటులో ఉంటాయి. వీటిలో క్యాలరీలు తక్కువ మరియు యాంటీయాక్సిడెంట్స్ మరయిు విటమిన్స్ ఎక్కువ.

బ్రొకోలీ:

బ్రొకోలీ:

రీన్ వెజిటేబుల్స్ లో ఇది ఒక బెస్ట్ వెజిటేబుల్. ఉడికించిన బ్రొకోలీని ఒక కప్పు తీసుకోవడం వల్ల మంచిది. బరువు తగ్గాలనుకొనే వారు ఈ హెల్తీ గ్రీన్ వెజిటేబుల్ ను డైలీ డైట్ చేర్చుకోవాలి. 95కాలరీలున్న ఈ గ్రీన్ వెజిటేబుల్ రెగ్యులర్ గా తీసుకుంటే అతి త్వరగా బరువు తగ్గవచ్చు. అంతే కాదు ఇందులో సూపర్ క్యాన్సర్ ఫైటింగ్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. బ్రొకోలీని మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఆకలిని కూడా కంట్రోల్ చేస్తుంది. ఇంకా ఇందులో ఉండే అనేక రకాల విటమిన్స్ వల్ల ఇది ఒక నేచులర్ ఫ్యాట్ బర్నింగ్ ఫుడ్ లిస్ట్ లోకి చేరిపోయింది.

కిడ్నీ బీన్స్ :

కిడ్నీ బీన్స్ :

ప్రోటీనులు మరియు ఫైబర్ అధికంగా ఉండే కిడ్నీ బీన్స్ ను రెగ్యులర్ గా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది మరియు బరువును కూడా వేగంగా తగ్గిస్తుంది.

బ్రౌన్ రైస్ :

బ్రౌన్ రైస్ :

రెగ్యులర్ గా తీసుకొనే వైట్ రైస్ కు చెక్ పెట్టి, బ్రౌన్ రైస్ తీసుకోవడానికి అలవాటు పడితే , వెంటనే బరువు తగ్గడానికి సహాయపడుతుంది. బ్రౌన్ రైస్ ఒక హోల్ గ్రెయిన్ ఫుడ్: ఇందులో విటమిన్ బి, విటమిన్ ఇ, మెగ్నీషియం, ఐరన్ మరియు ఫైబర్లు ఫుష్కలంగా ఉన్నాయి. ఇది బౌల్ ను రెగ్యులేట్ చేస్తుంది తర్వాత, ఆకలిని నియంత్రిస్తుంది. జీవక్రియలను మెరుగుపరుస్తుంది.

పెరుగు:

పెరుగు:

లోఫ్యాట్ పెరుగులో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఆకలిని కంట్రోల్ చేస్తుంది మరియు ఎముకలు మరియు దంతాలను బలోపేతం చేస్తుంది. మరియు పెరుగులో అధిక శాతంలో ప్రోటీనులు మరియు విటమిన్ డి పుష్కలంగా ఉంది.ఇది మీశరీరానికి నిరంతరం ప్రసరిస్తుంటుంది. కాబట్టి లోఫ్యాట్ పెరుగుతో పాటు, లోఫ్యాట్ మిల్క్, చీజ్ వంటి వాటిని మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవచ్చు.

డ్రై నట్స్ :

డ్రై నట్స్ :

స్నాక్స్ తినే సమయంలో లేదా ఎక్కువగా ఆకలిగా ఉన్న సమయంలో బేకరీ ఫుడ్స్ కు, స్నాక్స్ ను తినడం కంటే నట్స్(డ్రై ఫ్రూట్స్)ను తినడం వల్ల నోటికి రుచి మాత్రమే కాదు, శరీరానికి కావల్సిన శక్తిని అందిస్తుంది. చాలా మందిలో నట్స్ తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారనో లేదా కొవ్వు అధికం అవుతుందనో చెడు అభిప్రాయం చాలా మందిలో ఉంది. అందువల్లే చాలా మంది వాల్ నట్స్ మరియు బాదాం వంటివి తినకుండా ఉంటారు. అయితే ఇది పూర్తి విరుద్దం. ఎందుకంటే నట్స్ లో డైటరీ ఫైబర్ తో పాటు కొవ్వును కరిగించే లక్షణాలు కూడా పుష్కలంగా ఉండంటం వల్ల వీటిని రెగ్యులర్ గా తినడం వల్ల చెడు కొవ్వును నియంత్రించవచ్చు.

English summary

25 Top Fat Burning Foods

Losing weight isn't tough when you eat what you are supposed to eat. Yes, there are some fat burning foods which do a good job in helping you burn the excess fat and stay slim. Eating right helps you a lot in reaching your goals.
Desktop Bottom Promotion