For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరు రెగ్యులర్ గా చేసే వ్యాయామాన్ని తప్పని సరిగా మార్చుకోవాలని తెలిపే 6 సంకేతాలు !!

By Super
|

వ్యాయామ నియమావళి మిమ్మల్ని చురుగ్గా, క్రమశిక్షణతో, మంచి ఆకారంలో ఉంచుతుంది. కానీ కొన్నిసార్లు అదే వ్యాయామం పడే పడే చేయాల్సి రావడం మీ ఆరోగ్య లక్ష్యాల మీద అననుకూల ప్రభావం చూపవచ్చు.

READ MORE: వ్యాయామం తర్వాత ఖచ్చితంగా తీనాల్సిన బెస్ట్ ఫుడ్స్

వీటిలో ఏదైనా పరిస్థితి మీకు పరిచయం అయినట్టు అనిపిస్తే, మీరు మీ వ్యాయామ నియమావళి మార్చుకోవాలన్నమాట.

వ్యాయామాన్ని తప్పని సరిగా మార్చుకోవాలనే 6 సంకేతాలు !!

వ్యాయామాన్ని తప్పని సరిగా మార్చుకోవాలనే 6 సంకేతాలు !!

మీరు మీ వ్యాయామ నియమావళి మొదలు పెట్టినప్పుడు, మొదటి కొద్ది రోజుల్లో వేగంగా ఫలితాలు కనపడతాయి. కొన్ని నెలల తరువాత పెద్దగా పురోగతి లేదనిపిస్తుంది. ఫలితాలు చూడాలంటే, మీ వ్యాయామాలు, ఆవృతాలు మార్చి, మరింత పరిశ్రమ చేయండి.

వ్యాయామాన్ని తప్పని సరిగా మార్చుకోవాలనే 6 సంకేతాలు !!

వ్యాయామాన్ని తప్పని సరిగా మార్చుకోవాలనే 6 సంకేతాలు !!

అదే వ్యాయామం అదే వరుసలో చేస్తుంటే మీ ఉత్సాహం తగ్గవచ్చు. మీ నిత్య వ్యాయామంలో మిమ్మల్ని ఉత్తేజ పరచేలా కొన్ని వైవిధ్యాలు ఉండేలా చూసుకోండి.

వ్యాయామాన్ని తప్పని సరిగా మార్చుకోవాలనే 6 సంకేతాలు !!

వ్యాయామాన్ని తప్పని సరిగా మార్చుకోవాలనే 6 సంకేతాలు !!

జిమ్ వదలి వెళ్ళాక మీ మోకాళ్ళు నెప్పులు పుడుతుంటే, మీరు బహుశా సరైన పద్ధతిలో వ్యాయామం చేయడం లేదు లేద౦టే వ్యాయామానికి పూర్వం గానీ తరువాత గానీ మీరు కొన్ని కార్యక్రమాలు చేయడం లేదన్నమాట. తేలిగ్గా గుండెకి సంబంధించిన వ్యాయామం చేసి తరువాత బలవర్ధకమైనవి, ఆ తరువాత మరింత క్లిష్టమైనవి చేయండి.

వ్యాయామాన్ని తప్పని సరిగా మార్చుకోవాలనే 6 సంకేతాలు !!

వ్యాయామాన్ని తప్పని సరిగా మార్చుకోవాలనే 6 సంకేతాలు !!

అదే వ్యాయామం పదే పదే చేస్తే మీ శరీర భాగాలకు శిక్షణ ఎక్కువై మీరు బలహీన పడతారు. అందువల్ల మీ వ్యాయామాన్ని ప్లాన్ చేసుకుని వ్యాయామాల మధ్య కండరాలు సేద తీరేలా విరామం ఉండేటట్లు చూసుకోండి.

వ్యాయామాన్ని తప్పని సరిగా మార్చుకోవాలనే 6 సంకేతాలు !!

వ్యాయామాన్ని తప్పని సరిగా మార్చుకోవాలనే 6 సంకేతాలు !!

మీ హద్దులను మీరు సవాలు చేయకపోతే మీ చురుకుదనం స్థాయి కొనసాగుతుంది, కానీ అది మరికొంచెం పెరగదు. క్రాస్ ఫిట్, హెచ్ ఐ ఐ టి లాంటి క్లిష్టమైన వ్యాయామాలు చేసి మీ స్థాయి పెంచుకోండి.

వ్యాయామాన్ని తప్పని సరిగా మార్చుకోవాలనే 6 సంకేతాలు !!

వ్యాయామాన్ని తప్పని సరిగా మార్చుకోవాలనే 6 సంకేతాలు !!

మీ వ్యాయామం మిమ్మల్ని అలిసి పోయేటట్లు చేయవచ్చు, కానీ మీ శక్తిని హరి౦చకూడదు. వ్యాయామం తరువాత మరీ నీరసిస్తే మీకు మరింత సరళమైన వ్యాయామం కావాలని దాని అర్ధం. కొంచెం విశ్రమించండి, చక్కగా తినండి.

English summary

6 sure signs you need to change your workout : Health Tips in Telugu

6 sure signs you need to change your workout : Health Tips in Telugu, Workout routines keep you fit, in shape, disciplined and happy. But sometimes, doing the same exercise over and over again may negate your fitness goals. If any of these situations sound familiar, it's time you change your fitness routine.
Desktop Bottom Promotion