For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శరీరంలో అదనపు కొవ్వు పనిపట్టండిలా...

|

నలభై ఏళ్లు దాటాక చాలా మంది మహిళలు, పరుషులు లావెక్కుతూ ఉంటారు. కొందరికి పొట్ట వస్తుంది. కారణం వారి శరీరంలో అదనంగా కొవ్వు వచ్చి చేరడమే. ఇలా చేరిన కొవ్వును కరిగించాలంటే వ్యాయామం చేయక తప్పదు. అయితే వ్యాయామాల వల్లే కొవ్వు మొత్తం కరిగిపోదు. కాబట్టి మనం తీసుకొనే ఆహారంలో కొన్ని పదార్థాుల ఈ అదనపు కొవ్వును కరిగించేందుకు తోడ్పడుతాయి.

చాల మంది లావెక్కడం గమనించగానే వెంటనే డైటింగ్ మొదలుపెడుతుంటారు. ఎడాపెడా కడుపును మాడ్చేస్తారు. మరికొందరు ఉదయం బ్రేఫాస్ట్ కొద్దిగా తీసుకొని అంచ్ ను దాటవేస్తుంటారు. అయితే శరీరానికి ఇది ఏమాత్రం అలవాటు లేనిది కావడం వల్ల నీరసం ముంచుకొస్తుంది. దాంతో లాభం లేదనుకుని మధ్యమధ్యలో జ్యూసో, మరేదైనా పానీయమో తాగేస్తారు.

READ MORE: వేగంగా బరువు తగ్గించే టాప్ 25 ఫ్యాట్ బర్నింగ్ ఫుడ్స్

అలాకాకుండు చాలా ఎఫెక్టివ్ గా కొవ్వు పనిపట్టే కొన్ని ఆహారాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి...

నిమ్మరసం :

నిమ్మరసం :

స్వీట్ మిక్స్ చేసి డ్రింక్స్ కంటే మంచినీళ్లు త్రాగడమే ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు. ఈ విషయమై కాలిఫోర్నియాలో 240 మంది మహిళలపై అధ్యయనం జరిపిన న్యూట్రీషనిస్ట్ లు ఇతర తీపి పానీయాలకంటే మంచినీళ్లు మంచివని తేల్చారు . తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకుంటూనే రోజూ మొత్తంలో వీలైనప్పుడు మంచినీళ్లు త్రాగడం వల్ల ఏడాదికి అదనంగా ఒక కిలో వరకూ బరువు తగ్గే అవకాశం ఉంటుంది. ఈ నీళ్లలో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి త్రాగితే మరి మంచిదని మరో కిలో కొవ్వు కరిగిపోతుందని కూడా నిపుణులు సూచిస్తున్నారు.

గ్రనోలా బార్స్:

గ్రనోలా బార్స్:

ఉదయం సమయంలో బ్రేక్ ఫాస్ట్ కింద అధిక పీచు పదార్ధం కలిగిన ఆహారాన్ని తీసుకుంటే రెండింతల కొవ్వు కరిగిపోతుందని మియామి విశ్వవిద్యాలయానికి చెందిని ప్రొఫసర్ లిసా డోఫ్ మాన్ పేర్కొన్నారు. రిఫైన్డ్ ఫుడ్ (పీచు పదార్థం తక్కువగా ఉన్న ఆహారం) రక్తంలోని చక్కెర నిల్వలను మరింత పెంచుతాయని, దీనికన్నా ప్రతి రోజూ కనీసం 4గ్రాముల గ్రనోలా బార్ తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెబుతున్నారు.

వాల్ నట్:

వాల్ నట్:

ఇంట్లో కూర్చిని టీవీ చూస్తున్నప్పుడో, సినిమా హాల్లో వెంగితెర వీక్షిస్తున్నప్పుడో చిప్స్ తినడం చాలామందికి అలవాటు...ఇలా చిప్స్ తినే బదులు నట్స్ తినడం మంచిదని అందులోనూ వాల్ నట్స్ తినడం ఆరోగ్యానికి ఇంకా మంచిదని నిపుణులు సెలవిస్తున్నారు . వాల్ నట్స్ లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ శరీరంలో కొవ్వును కరిగించడంలో తోడ్పడతాయి. రోజూ వాల్ నట్స్ తినడం వల్ల 8 నుండి 10 వాల్ నట్స్ తినడం వల్ల రక్తంలో చక్కర శాతం కూడా తగ్గిపోతుందని వారు పేర్కొంటున్నారు.

దాల్చిన చెక్కతో:

దాల్చిన చెక్కతో:

కాఫీ లేదా టీలో పంచదార బదులు కాసింత దాల్చిన చెక్క పొడి వేసుకోవడం వల్ల తీపికి తీపి....ఆరోగ్యానికి ఆరోగ్యం . ఎందుకంటే మీరు వేసుకునే ఒక టీస్పూన్ చక్కెరలో కనీసం 16 క్యాలరీలు ఉంటాయని న్యూట్రీషియనిస్ట్ లు చెబుతున్నారు. మరి రోజుకు కనీసం నాలుగైదుసార్లు టీ, కాఫీలు సేవించే వారు ఎందరో ! ఈ లెక్నన వారి శరీరంలోకి ఒక్కటి, కాఫీల ద్వారానే రోజూ 80 క్యాలరీల వరకూ చేరిపోతున్నాయి. పంచదారకు బదులు దాల్చిన చెక్క పొడి వేసుకోవడం ద్వారా ఈ కేలరీలు శరీరంలోకి చేరకుండా అడ్డుకట్ట వేయడమేకాకుండా గుండెను కూడా పదిలంగా కాపాడుకోవచ్చు. నిత్యం. అరటీస్పూన్ దాల్చిన చెక్క పొడి తినడం వల్ల కొలెస్ట్రాల్ ద్వారా గుండెకు కలిగే చేటును 18 శాతం వరకూ ట్రై గ్లిజరైట్స్ ద్వారా గుండెకు కలిగే చేటును 30 శాతం వరకూ తగ్గించవచ్చని పాకిస్తాన్ కు చెందిన పరిశోధకలు కనుగొన్నారు.

హాట్ సాస్:

హాట్ సాస్:

కారం కారంగా ఉండే సాస్ ఆహారపదార్థాలపై చల్లుకుని తినడం ద్వారా శరీరంలో పేరుకుపోయిన కొవ్వు నిల్వలు పెద్ద మొత్తంలో కరిగిపోతాయట. ఆస్ట్రేలియాకు చెందిన పరిశోధకలుు కొందరు దాదాపు36 మంది స్త్రీ, పురుషుల మీద పరిశోధన జరిపి ఈ విషయాన్ని నిర్ధారించారు. ఘాటు పదార్థాలు భుించడం వల్ల రక్తంలోని చెక్కర శాతం కూడా తగ్గిపోతుందని. 32శాతం వరకూ కొవ్వు నిల్వలు కరిగిపోతాయిని వీరు తేల్చారు. ఉదాహరణకు మిరపలో ఉండే ఉండే ఘాటు, మంట క్ాయష్పైకిన్ అనే కొవ్వుకు సరైన విరుగుడని అంటారు.

సాల్మన్ ఫిష్:

సాల్మన్ ఫిష్:

కేవలం 90గ్రాముల కేన్డ్ సాల్మన్ ఫిష్ తినడం ద్వారా మీ శరీరానికి రోజంతా అవసరమయ్యే దానికంటే ఎక్కువగా విటమిన్ డి 181 మిల్లీగ్రాముల కాల్షియం లభిస్తాయట. శరీరానికి సరిపడా విటమిన్ డి గనకు లభించకుంటే ఆకలిని కలిగించే ‘లెప్టిన్' హార్మోన్ తన విధులు సరిగా నిర్వర్తించదు.

English summary

Eat This and Burn More Fat: Health Tips in Telugu

Eat This and Burn More Fat: Health Tips in Telugu, "If you exercise and eat for health and fitness you will end up looking and feeling great for the rest of your life. If you exercise and diet to look good you will eventually gain more weight and you will never be fit.
Story first published: Monday, July 27, 2015, 13:43 [IST]
Desktop Bottom Promotion