For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బరువు తగ్గించే ప్రోటీన్ రిచ్ వెజిటేరియన్ ఫుడ్స్

By Super
|

శరీర పెరుగుదలకు అభివృద్ధికి తోడ్పడే ఆహార పదార్థాలను ''ప్రోటీనులు అంటారు. ఇవి కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్ మూలకాలతో ఏర్పడతాయి. ఆహార నాళంలో ఎమైనో ఆమ్లాలుగా విడిపోయి తరవాత రక్తంలో కలుస్తాయి.

ప్రోటీనుల వల్ల ఏర్పడిన ఎమైనో ఆమ్లాలు వివిధ జీవక్రియల్లో ఉపయోగపడతాయి. శరీర నిర్మాణం, కణజాలాల పునరుద్ధరణ, ద్రవాభిసరణ క్రమతను కాపాడటం, రసాయనిక సమన్వయంలో ఉపయోగపడతాయి. అత్యవసర సమయాల్లో శరీరానికి అవసరమైన శక్తిని విడుదల చేస్తాయి.

Read more at: బెల్లీ ఫ్యాట్ ను కరిగించే 22 పవర్ ఫుల్ ఆహారాలు

ప్రోటీన్స్ ఎందులో ఎక్కువగా ఉంటాయనేగా మీ డౌట్? రెగ్యులర్ తీసుకొనే వెజిటేబుల్స్ డైట్ లో ఎక్కువ ప్రోటీనులు ఉంటాయి కాబట్టి, వీటిని మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చు. ప్రోటీనులు అత్యధికంగా ఉన్నఅలాంటీ గ్రీన్ వెజిటేబుల్స్ తీసుకోవడం వల్ల బరువు కూడా తగ్గించుకోవచ్చు, మీరు కనుక క్యాలరీలను త్వరగా తగ్గించుకోవాలని కోరుకుంటున్నట్లైతే, ఈ వెయిట్ లాస్ ఫుడ్స్ ఖచ్చితంగా సహాయపడుతాయి.

Read more at: ఎముకలు సాంద్రత పెంచే ఆరోగ్యకరమైన ఆహారలు

ఇంకా, ప్రోటీనులు అధికంగా ఉండే ఈ ఫుడ్స్ తీసుకొనేముందు ఖచ్చితంగా గుర్గించుకోవల్సినది, ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తీసుకొనే వారు లిక్విడ్స్ అధికంగా తీసుకోవాలి. ముఖ్యంగా మన ఇండియన్ వెజిటేరియన్ ఫుడ్స్ లో ప్రోటీనలు అధికంగా ఉండటాయి కాబట్టి, జీర్ణక్రియను మరింత సులభతరం చేస్తాయి. అదే సమయంలో ఈ ద్రవాలు కూడా సహాయపడుతాయి.

మరి బరు తగ్గించే ఆ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ఏంటో ఒకసారి చూద్దాం...

దాల్ (పప్పు):

దాల్ (పప్పు):

పప్పు ధాన్యాలలో వివిధ రకాలున్నాయి. అయితే ప్రతి ఒక్కపప్పు దాన్యం బరువు తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది . సర్వ్ చేసే ఒక కప్పు దాల్లో 4-9గ్రాలముల ప్రోటీనులు ఉంటాయి. కాబట్టి, వీటిని తీసుకోవడం వల్ల బరువు తగ్గించుకోవచ్చు.

పెరుగు

పెరుగు

ఒక సర్వింగ్ పెరుగులో 11గ్రాములు ప్రోటీనులు ఉంటాయి . ఈ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ బరువు తగ్గించడానికి గ్రేట్ గా సహాయపడుతుంది. కాబట్టి, వేసవిలో పెరుగు అన్నం లేదా మజ్జిగా రూపంలో తీసుకోవడం ఉత్తమం.

పెసళ్ళు(గ్రీన్ మూంగ్ దాల్):

పెసళ్ళు(గ్రీన్ మూంగ్ దాల్):

ముడి పెసళ్ళు శరీరానికి చలువ చేస్తుంది. ఇది ఒక గ్రేట్ ఇండియన్ వెజిటేరియన్ ప్రోటీన్ రిచ్ ఫుడ్. ముఖ్యంగా బరువు తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది . మూగ్ దాల్ ను నీటిలో నానబట్టి, ఈ నీటిని త్రాగడం వల్ల బరువు తగ్గించుకోవచ్చు.

చీజ్:

చీజ్:

బరువు తగ్గించే ఆహారల్లో చీజ్ కూడా ఒకటి. ఒక సర్వింగ్ లో 18grm ప్రోటీన్స్ ఉంటాయి . కాబట్టి, మీకు నచ్చిన సాడ్విచ్ లో తప్పనిసరిగా జోడించుకోవాలి.

ఆకుకూరలు:

ఆకుకూరలు:

ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలందిస్తాయి . ఇందులో ప్రోటీనులు అదికంగా ఉంటాయి. ఒక కప్పు ఆకుకూరల్లో 2.9గ్రాము ప్రోటీనులుంటాయి. ఇవి బరువు తగ్గడానికి గొప్పగా సహాయపడుతాయి

పనీర్

పనీర్

పనీర్ కాటేజ్ చీజ్ తో తయారుచేస్తారు . ఇండియాలో దీని వాడకం ఎక్కువ. మరియు పనీర్ కూడా ప్రోటీనులు అధికంగా ఉండే ఒక హెల్తీ ఫుడ్. అంతే కాదు బరువు తగ్గించడానికి కూడా సహాయపడుతుంది . ఈ యమ్మీ చీజ్ ను ఆకుకూరలతో కలిపి తీసుకుంటే వండర్ ఫుల్ హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చు

బాదం

బాదం

నట్స్ క్యాటగిరీలో, బాదంలో విటమిన్స్, మినిరల్స్ మరియు ప్రోటీనులు అధికంగా ఉంటాయి . బాదంలో 21grm ప్రోటీనులు అధికంగా ఉంటాయి. ఒక సర్వింగ్ లో మన శరీరానికి అవసరం అయ్యేన్ని ప్రోటీనలు అందుతాయి . ఇవి బరువు తగ్గించడానికి గ్రేట్ గా సహాయపడుతాయి.

కిడ్నీ బీన్స్

కిడ్నీ బీన్స్

బీన్స్ లో అన్ని రకాల ప్రోటీలు మరియు ఇతర మినిరల్స్ అధికంగా ఉంటాయి. అత్యధిక ప్రోటీనులు కలిగిన వీటిని భోజనంతో పాటు లేదా భోజనానికి భోజనానికి మధ్య సమయంలో కూడా తీసుకోవచ్చు. మంగ్ బీన్స్, కిడ్నీ బీన్స్, వైట్ బీన్స్, లేదా బ్లాక్ బీన్స్ అన్నింటిలోనూ ప్రోటీనులు అధికంగా ఉంటాయి. వీటిలో ఏవైనా సరే ఒక కప్పు సర్వ్ చేయడం వల్ల 20నుండి25గ్రాముల వరకూ ప్రోటీనులు మన శరీరానికి అందుతాయి. అయితే వీటిని ఎక్కువగా వాడిని అజీర్తికి దారి తీస్తుంది కాబట్టి, సాధ్యమైనంత ఎక్కువ నీరు త్రాగాలి.

మొలకలు

మొలకలు

మొలకలను ఏదోఒకవిధంగా తీసుకోవాలి . ఒక సర్వింగ్ మొలకల్లో 4గ్రాముల ప్రోటీలను మన శరీరానికి అందుతాయి. ఇది క్యాలరీలను కరిగించడానికి సహాయపడుతుంది..

సాంబార్:

సాంబార్:

మరో ఫ్రోటీన్ ఫుడ్, సాంబార్ , బరువు తగ్గించే ప్రోటీన్ ఫుడ్స్ లో మరొక ఇండియన్ ఫుడ్ ఇది. కాబట్టి, సాంబర్ విత్ బ్రౌన్ రైస్ తో తీసుకొంటే, క్యాలరీలను కరిగించుకోవచ్చు.

English summary

10 Protein Rich Vegetarian Food For Weight Loss

Proteins is one of the many things that is necessary for you to have in abundance in order to lose weight quickly. Boldsky shares with you a handful of protein-rich foods for weight loss to add to your daily diet.
Desktop Bottom Promotion