For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్యాలరీలు, ఫ్యాట్ ను కరిగించి..బరువును తగ్గించే 10పుల్లని ఆహారాలు

|

మనం రెగ్యులర్ గా తీసుకొనే ఆహారాల్లో చేదు, తీపి, పులుపు, వగరు...ఇలా వివిధ రకాలు ఫుడ్స్ ఉంటాయి. వాటిలో ముఖ్యంగా పులుపు ఉన్న పదార్థాలు మనం మన రెగ్యులర్ డైట్ తప్పనిసరిగా చేర్చుకోవాలి. ముఖ్యంగా బరువు తగ్గాలనుకొనే వారు ఈ సోర్ ఫుడ్స్ ను రెగ్యులర్ డైట్ లో తప్పనిసరిగా చేర్చుకోవాలి.

ఎందుకంటే ఈ పుల్లని ఆహారాల్లో విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల ఇది ఆరోగ్యానికి చాల మేలు చేస్తుంది. అంతే కాదు ఇవి కొన్ని టన్స్ లో క్యాలరీలను కరింగి బరువు తగ్గడానికి గొప్పగా సహాయపడుతాయి. అంతే కాదు ఇవి శరీరంలో చేరగానికి ఆరోగ్యకరమైన ఆమ్లాలను ఉత్పత్తి చేసి మన తిన్న ఆహారంను త్వరగా జీర్ణం అవ్వడానికి సహాయపడుతాయి.

ఈ పుల్లని ఆహారాలను తీసుకొనేప్పుడు తగినంత మోతాదులో, సాధ్యమైనంత ఎక్కువ నీరు త్రాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ బయటకు నెట్టివేయడం వల్ల బరువు కోల్పోవడానికి ఇది ఒక చక్కటి మార్గం..

ఈ సోర్ పుడ్స్(పుల్లని ఆహారాలు)మార్కెట్లో మనకు చాలా సులభంగా అందుబాటులో ఉన్నాయి. ఇవి అంత కరీదైనవి కూడా కాదు కాబట్టి, బరువు తగ్గించుకోవడానికి ఇంతకంటే మంచి అవకాశం మరొకటి ఉండదు.

కాబట్టి, బరువు తగ్గించుకోవాలనుకొనే వారు, ఈ పుల్లని ఆహారాలను తీసుకోవడం ఒక అలవాటుగా మార్చుకుంటే బరువు తగ్గవచ్చు...మరి ఆ ఆహారాలేంటో ఒకసారి చూద్దాం...

1. నిమ్మరసం:

1. నిమ్మరసం:

మనం రెగ్యులర్ గా వినియోగించే కూరగాయల్లో నిమ్మకాయ ఒకటి, ముఖ్యంగా ఈ వేసవి సీజన్ లో దీని వాడకం ఎక్కువ. ఈ ఫ్రూట్ బరువు తగ్గించడంలో చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. ప్రతి రోజూ ఉదయం నిద్రలేవగానే పరకడుపున లెమన్ జ్యూస్ త్రాగడం వల్ల జీర్ణక్రియకు చాల సహాయపడుతుంది. మరింత ఉత్తమ ఫలితాలను పొందాలంటే, ఇందులో కొద్దిగా తేనె మిక్స్ చేయాలి.

2. ఆరెంజ్:

2. ఆరెంజ్:

ఆరెంజ్ అంటే చాలా వరకూ పుల్లగానే ఉంటాయి. స్వీట్ గా ఉన్నవి కనుక్కోవడం కొద్దిగా కష్టం. ఇది ఫ్యాట్ కరిగించడంలో సహాయపడుతుంది. వీటిలో విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది.

3. చింతకాయ:

3. చింతకాయ:

విటమిన్ సి అధికంగా ఉండే ఈ పుల్లని ఆహారపదార్థం, వారానికి ఒకసారి తీసుకొన్నా బరువును తగ్గిస్తుంది. మరియు చింతకాయను రెగ్యులర్ డైట్ లో చేర్చడం వల్ల డైలీ చేరే ఫ్యాట్ ను కరిగిస్తుంది.

4. వెనిగర్:

4. వెనిగర్:

వెనిగర్ ను ఆహారాల్లో మిక్స్ చేస్తే ఇది ఫ్యాట్ కరిగించడానికి సహాయపడుతుంది. త్వరగా బరువు తగ్గిస్తుంది.

5.పెరుగు :

5.పెరుగు :

పెరుగు పుల్లగా ఉన్నప్పుడు చాల మంది తినడానికి ఇష్టపడరు. కానీ, పుల్లని పెరుగులో మంచి బ్యాక్టీరియా అధికంగా ఉండటం వల్ల క్యాలరీలను తగ్గించడానికి గ్రేట్ గా సహాయపడుతుంది మరియు ఇతర ఆరోగ్య సమస్యలను నివారిస్తుంది.

6.టమోటోలు:

6.టమోటోలు:

టమోటోలు పుల్లగా ఉండటం వల్ల వ్యాధినిరోధకతను పెంచుతాయి. అంతే కాదు బరువు తగ్గించడంలో కూడా సహాయపడుతాయి. మరియు క్యాన్సర్ ను ఎదుర్కొంటాయి.

7. పచ్చని మామిడిపండ్లు:

7. పచ్చని మామిడిపండ్లు:

పండ్లలో రారాజుగా పిలిచుకొనే మామిడిపండ్లను వేసవికాలం స్వాగతం పలుకుతుంది !మీరు నేచురల్ గా బరువు తగ్గించుకోవాలనుకుంటే మామిడిపండ్లను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి . బరువు తగ్గించడంలో ఇది ఒక బెస్ట్ ఫుడ్.

8. కొన్ని మసాలాల్లో వేసి ఊరబెట్టిన వెజ్జీస్:

8. కొన్ని మసాలాల్లో వేసి ఊరబెట్టిన వెజ్జీస్:

ఇలా పులుపు, ఉప్పు, మసాలాల్లో వెజిటేబుల్స్ ముక్కలు క్యాబేజ్, క్యారెట్ వంటివి ఊరబెట్టి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఈ సోర్ ఫుడ్స్ త్వరగా ఆమ్లాలను ఉత్పత్తి చేసి జీర్ణక్రియకు సహాయపడుతాయి.

9. పైనాపిల్:

9. పైనాపిల్:

పైనాపిల్లో ఎక్కువ శాతంలో బ్రొమిలిన్ యాసిడ్ కలిగి ఉండటం వల్ల ఇది ఫ్యాట్ ను కరిగిస్తుంది . జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

10. ఆమ్ల:

10. ఆమ్ల:

ఉసిరికాయ పుల్లగా మరియు వగరుగా ఉండట వల్ల, వెనిగర్ లో నానబెట్టి తీసుకుంటే త్వరగా బరువు తగ్గించుకోవచ్చు.

English summary

10 Sour Foods For Weight Loss

These sour foods for weight loss should be added to your daily diet, if you really have plans of losing weight. Lemon is one of the many fruits on the list which is sour in nature to help you lose tons of calories. Eating sour foods cuts the calories instantly and replaces it with healthy acids during the process of digestion.
Story first published: Friday, April 17, 2015, 12:49 [IST]
Desktop Bottom Promotion