For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జీడిపప్పులోని పవర్ ఫుల్ హెల్త్ బెనిఫిట్స్

By Super
|

చూడటానికి కిడ్నీ షేప్ లో ఉండే జీడిపప్పు చాలా టేస్టీగా ఉంటుంది. జీడిపప్పును కంప్లీట్ ఫుడ్ ప్యాక్‌గా చెప్పుకోవచ్చు. జీడిపప్పును కాజు అని కూడా పిలుస్తారు. రుచికరమైన వంటకాలు తినడానికి ఎవరైనా ఇష్టపడతారు. అలా వండుకునేందుకు ఉపయోగపడే కొన్ని ప్రత్యేక పదార్థాలు కూడా వుంటాయి. వాటిలో జీడిపప్పు కూడా ఒకటి. దీనిని ఏమీ చేయకుండా ఊరికే నోట్లో వేసుకున్నా తినాలనిపించే విధంగా వుంటుంది. దీన్ని డ్రైఫ్రూట్‌గా చెప్పుకుంటారు. ఇక జీడిపప్పులను వంటల్లో అటు స్వీట్లలోనూ ఇటు హాట్‌లలోనూ వాడుతారు. పాయసం, ఖీర్, రకరకాల స్వీట్లు వంటి వాటిపైన కనపడుతూ నోరూరిస్తూ వుంటాయి. ఫ్రైడ్ రైస్, బిర్యాని వంటి మరెన్నింటిలోనూ కలుపుకున్నా వాటి రుచిని మరింత పెంచుతాయి. నేతిలో వేయించి కారం, ఉప్పు చల్లుకుంటే ఈవెనింగ్ స్నాక్‌లా తినవచ్చు. పిల్లలకు, పెద్దలకు అందరికీ బలమైన ఆహారం అని చెప్పవచ్చు. వీటిని ముద్దచేసి కూరలకు, కూర్మాలలో వాడితే చిక్కదనాన్ని, కమ్మదనాన్ని అందించగలవు. అయితే వీటి ధర కాస్త ఎక్కువే.

జీడిపప్పు గురించి ఎంత మందికి తెలుసు? భారతదేశంలో వీటిని 'కాజు' అని పిలుస్తుంటారు. సాధారణంగా వీటిని స్వీట్'ల తయారీలో వాడుతుటాము అంతేకాకుండా చిన్న పిల్లలు ఎక్కువ ఇష్టంగా తింటుంటారు. శరీర విధులు సరిగా నిర్వహించటానికి కావలసిన అన్ని రకాల పోషకాలు అనగా, విటమిన్'లు, మినరల్'లు అన్ని జీడిపప్పులో ఉంటాయి. ఇవి మొదటగా బ్రెజిల్'కి చెందినా విత్తనాలు, కానీ 16 వ శతాబ్దంలో వీటిని భారతదేశంలోకి తీసుకువచ్చారు. వీటి వలన పోషకాలు అందించబడటమే కాకుండా వివిధ రకాల వ్యాధులను కలుగచేసే కారకాలకు వ్యతిరేఖంగా పని చేస్తుంది. వాటి గురించి ఈ కింద స్లైడ్ ద్వారా తెలుపబడింది.

గుండె ఆరోగ్యం

గుండె ఆరోగ్యం

ఇతర విత్తనాలతో పోలిస్తే జీడిపప్పులో తక్కువ శాతం కొవ్వు ఉంటుంది. అంతేకాకుండా, గుండె ఆరోగ్యాన్ని పెంపొందించే 'ఒలిక్ ఆసిడ్' కూడా ఇందులో ఉంటుంది. కొవ్వు పదార్థాలను తక్కువగా మరియు యాంటీ-ఆక్సిడెంట్'లను కలిగి ఉండి గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉంచుతుంది. ముఖ్యంగా ట్రై గ్లిజరైడ్ అనే కంటెంట్ గుండె ఆరోగ్యానికి గ్రేట్ గా సహాయపడుతుంది.

శరీరంను బలంగా ఉంచుతుంది:

శరీరంను బలంగా ఉంచుతుంది:

జీడిపప్పులో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది ఇది ఎముకలు, కండరాలు మరియు నరాలను బలోపేతం చేయడానికి గ్రేట్ గా సహాయపడుతుంది. కాబట్టి, మనకు రోజుకు 300-750మిల్లీగ్రాముల మెగ్నీషియం అందుతుంది.ఎముకల ఉపరితలంపై మెగ్నీషియం ఒక పూతల ఉండి, కండర కణాలలోకి కాల్షియం ప్రవేశాన్ని నిలిపి, రక్తనాళాలను మరియు కండరాలను విశ్రాంతికి చేసూరుస్తుంది. కానీ శరీరంలో మెగ్నీషియం లోపం ఏర్పడినట్లయితే, కాల్షియం రక్తనాళాలలోకి చేరుతుంది. ఫలితంగా అధిక రక్త పీడనం, మైగ్రిన్ మరియు తలనొప్పి కలిగే అవకాశం ఉంది. జీడిపప్పులో మెగ్నీషియం మూలకం అధిక మొత్తంలో ఉండి ఈ చర్యను నివారించి, ఈ రకమైన వ్యాధులను, సమస్యలను కలుగకుండా కాపాడుతుంది.

అధిక రక్తపోటును తగ్గిస్తుంది:

అధిక రక్తపోటును తగ్గిస్తుంది:

జీడిపప్పులో ఉన్న పుష్కలమైనటువంటి మెగ్నీషియం వల్ల మీ బ్లడ్ ప్రెజర్ ను తగ్గిస్తుంది. ఇక రక్తపోటు(బీపి) ఉన్నవారు కూడా జీడిపప్పును తినేందుకు భయపడాల్సిన పనిలేదు. ఇందులో సోడియం శాతం తక్కువగానూ పొటాషియం నిల్వలు ఎక్కువగా ఉంటాయి

క్యాన్సర్ ను ప్రమాధాన్ని తగ్గిస్తుంది:

క్యాన్సర్ ను ప్రమాధాన్ని తగ్గిస్తుంది:

జీడిపప్పులో యాంటీఆక్సిడెంట్స్ అంటే సెలీనియం మరియు విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి, ఇవి ఫ్రీరాడికల్స్ ఆక్సిడేషన్ ను నివారిస్తాయి, దాంతో క్యాన్సర్ రిస్క్ ను అరికడుతాయి మరియు వ్యాధి నిరోధకతను పెంచుతాయి. ఇందులో జింక్ అధికంగా ఉండటం వల్ల ఇన్ఫెక్షన్స్ తో పోరాడుతుంది.

బాడీ ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది:

బాడీ ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది:

జీడిపప్పులో ఉండే అధిక కాపర్ కంటెంట్ చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది, ముఖ్యంగా ఎంజైమ్ యాక్టివిటి, హార్మోన్ ప్రొడక్షన్, బ్రెయిన్ ఫంక్షన్, మొదలగు వాటి క్రియలకోసం ముఖ్య పాత్రను పోషిస్తుంది. ఇంకా అనీమియాను ఎదుర్కోవడానికి అవసరం అయ్యే రెడ్ బ్లడ్ సెల్స్ ను ఉత్పత్తి చేయడానికి జీడిపప్పులో ఉండే కాపర్ గ్రేట్ గా సహాయపడుతుంది.

 జుట్టు ఆరోగ్యానికి:

జుట్టు ఆరోగ్యానికి:

జీడిపప్పులు కాపర్ అనేటటువంటి మినిరల్, ఇది మీ జుట్టుకు నేచురల్ కలర్ ను అంధించడంలో అద్భుతంగా సహాయపడుతుంది. మరి కాపర్ కంటెంట్ పుష్కలంగా ఉన్నా ఈ జీడిపప్పును మీరు తీసుకోవడం వల్ల మీకు నచ్చే బ్లాక్ హెయిర్ ను మీరు సొంతం చేసుకోవచ్చు.

 కిడ్నీ స్టోన్:

కిడ్నీ స్టోన్:

జీడిపప్పు పలుకులను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల కిడ్నిలో రాళ్ళు ఏర్పడటాన్ని 25% తగ్గిస్తుంది.

బరువు తగ్గడానికి:

బరువు తగ్గడానికి:

ప్రొటీన్లు 21 శాతం, తేమ 6 శాతం, కార్బోహైడ్రేట్ 2 శాతం, పీచు 3 శాతం, కాల్షియం 0.5 శాతం, ప్రతీ వంద గ్రాములకు ఐదు గ్రాముల ఐరన్ వుంటుంది. వీటితోపాటు శరీర బరువును పెంచకుండా శక్తినిచ్చే ప్యాట్ 41 శాతం ఉంటుంది. ఈ ఫ్యాట్‌వలన ఆరోగ్య రీత్యా ఎటువంటి హాని చేకూరదు.

జీర్ణక్రియ మెరుగుపరచడానికి:

జీర్ణక్రియ మెరుగుపరచడానికి:

జీడిపప్పులు రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఇందులో ఉండే న్యూక్లియిక్ యాసిడ్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

ఓరల్ హెల్త్ :

ఓరల్ హెల్త్ :

ముందుగా చెప్పినట్లు, ఇందులో ఉండే మెగ్నీషియం కంటెంట్ ఎముకలకు చాలా మంచిది. అది దంతా ఆరోగ్యానికి చాలా బాగా సహాయపడుతుంది. చిగుళ్ళను ఆరోగ్యంగా ఉంచుతుంది.

 నిద్ర:

నిద్ర:

మోనోపాజ్ తర్వాత, తగినంత నిద్రను పొందడానికి ఈ జీడిపప్పులు అద్భుతంగా సహాయపడుతాయి.

English summary

Surprising health benefits of cashew nuts

Kidney-shaped cashew nuts often make their way to desserts such as the yummy kaju katlis, kheer and brownies. Also, when it comes to the healthy snacks, cashews are both nutritious and convenient. They are packed with many nutrients that boost your metabolism and help lower the risk of heart diseases.
Desktop Bottom Promotion