For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెళ్లి తర్వాత బరువు తగ్గించి..బొజ్జ కరిగించే సూపర్ ఫుడ్స్

|

సాధారణంగా మహిళలు పెళ్ళికి ముందు సన్నగా నాజూగ్గా ఉన్నా.. పెళ్ళి తర్వాత..పిల్లలు పుట్టిన తర్వాత బరువు పెరగడం లేదా లావుగా పొట్ట ఇలాంటి సమస్యలు ఏదుర్కోవల్సి వస్తుంది. అటువంటి వారు వారి పొట్ట చూసుకొని, లేదా తరచూ బరువు పెరుగుతున్నామన్న ఆలోచనతో బాధపడుతుంటారు.

పెళ్ళి అయిన తర్వాత బరువు పెరిగే మహిళలు సన్నగా మారడానికి చాలా మంది ప్రయత్నించరు. ఇక ఎక్కడ సన్నబడుతారు? ప్రయత్నం ఉంటేనేగా ఫలితం ఉంటుంది.

Top 30 Foods That Burn Post-Wedding Weight Gain: Health Tips in Telugu

అయితే శరీరం అధిక బరువుతో బాధ పడే వారు, వారి ఎత్తుకు తగ్గ బరువును మెయింటైన్ చేయడం చాలా అవసరం. మహిళలు తమ సౌందర్యం మాత్రమే చూసుకోకుండా.. ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవల్సిన బాధ్యత ఎంతో ఉంది. అధిక బరువు పెరిగే కొద్ది అనారోగ్యసమస్యలు అధికమౌతాయి.

కాబట్టి మహిళల సౌందర్యంతో పాటు ఆరోగ్యాన్ని కూడా కాపాడి, బరువును తగ్గించే కొన్ని పండ్లు, ఆహారాల గురించి తెలుసుకొని వాటిని తరచూ తినడం వల్ల ఎప్పుడూ ఎకే బరువును కలిగి ఉండేలా చేసుకోవచ్చు. మరి ఆ పండ్లు, ఆహారాలేంటో తెలుసుకుందాం...

MOST READ: ఈ రాశి వారికి నాయకత్వ లక్షణాలు ఎక్కువMOST READ: ఈ రాశి వారికి నాయకత్వ లక్షణాలు ఎక్కువ

ఓట్ మీల్:

ఓట్ మీల్:

ఉదయం వ్యాయామం చేసిన తర్వాత ఓట్‌మీల్‌ తినటం అలవాటు చేసుకోవాలి. ఓట్‌మీల్‌ నెమ్మదిగా అరుగుతూ రక్తంలో షుగర్‌, ఇన్సులిన్‌ల విడుదలను క్రమబద్ధీకరిస్తుంది. ఫలితంగా శరీరంలో కొవ్వు కరిగే వేగం పెరుగుతుంది. నెమ్మదిగా అరిగే పిండి పదార్థం కాబట్టి బరువు తగ్గాలనుకునే ప్రతి ఒక్కరూ ఓట్‌మీల్‌ను బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకోవాలి.

గ్రీన్ టీ:

గ్రీన్ టీ:

గ్రీన్‌ టీలోని యాంటీ ఆక్సిడెంట్స్‌ మెటబాలిజమ్‌కు అనువైన పరిస్థితిని శరీరంలో కల్పిస్తాయి. అలాగే క్యాన్సర్‌ నిరోధక కారకాలు, కొవ్వు అదుపులో ఉంచే అంశాలు గ్రీన్‌ టీలో పుష్కలం.

లెమన్:

లెమన్:

నిమ్మ మరియు తేనె మిశ్రమం మహిళల బరువు తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తాయి. నిమ్మరసంలో కొవ్వు కణాలతో పోరాడగలిగే శక్తిని కలిగి ఉన్నాయి. ఆకలిని తగ్గించి జీర్ణశక్తిని పెంచుతుంది.

తేనె:

తేనె:

పంచదారతో పోలిస్తే తేనెలో కెలొరీలు అధికంగా ఉన్నా..వేడినీటితో కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకొన్న కొవ్వు కరుగుతుంది. క్రమంగా బరువూ తగ్గుతాం. అలాగే తేనె, నిమ్మరసం, దాల్చిన చెక్క...కలిపి తీసుకోవడం వల్ల శరీర బరువులో ఎంతో తేడా ఉంటుంది. ఊబకాయం ఉన్నవారు వంటకాల్లో బెల్లం, పంచదారకు బదులు తేనెను వాడితే మంచిది. అందుకు గ్లాసు గోరువెచ్చటి నీటిలో చెంచా తేనె, కలిపి పరకడుపున తీసుకుంటే ఎంతో మార్పు ఉంటుంది.

నీళ్ళు:

నీళ్ళు:

శరీర జీవక్రియలకు నీరు అత్యవసరం. నీరు తాగకపోతే నిమిషాల వ్యవధిలోనే డీహైడ్రేట్‌ అయిపోతాం. దాంతో దాహం వేస్తుంది. ఆ లక్షణాన్ని ఆకలిగా పొరబడి ఆహారం తినేస్తూ ఉంటాం. కాబట్టి తరచుగా నీళ్లు తాగుతూ ఉంటే ఈ సమస్య తలెత్తకుండా ఉంటుంది. అలాగే ఎక్కువగా నీళ్లు తాగటం వల్ల శరీరంలోని కొవ్వు కరుగుతుంది.

MOST READ:వాళ్లు చంపి పొట్ట చీల్చేవారు..అందుకే ఆ కులాలపై ఇప్పటికీ ఆ మచ్చ ఉందిMOST READ:వాళ్లు చంపి పొట్ట చీల్చేవారు..అందుకే ఆ కులాలపై ఇప్పటికీ ఆ మచ్చ ఉంది

మొలకెత్తిన విత్తనాలు -

మొలకెత్తిన విత్తనాలు -

మొలకెత్తిన విత్తనాలు - పెసలు, శనగలు, వేరు శనగ పప్పులు, అలచందలవంటివి నానపోసి మొలకలు వచ్చిన తర్వాత తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీటిని శక్తి గుళికలు అంటారు. కడుపు నింపుతాయి. శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు, విటమిన్లు సమకూరుతాయి.

నట్స్:

నట్స్:

స్నాక్స్ తినే సమయంలో లేదా ఎక్కువగా ఆకలిగా ఉన్న సమయంలో బేకరీ ఫుడ్స్ కు, స్నాక్స్ ను తినడం కంటే నట్స్(డ్రై ఫ్రూట్స్)ను తినడం వల్ల నోటికి రుచి మాత్రమే కాదు, శరీరానికి కావల్సిన శక్తిని అందిస్తుంది. బరువు పెరగకుండా కాపాడుతుంది.

ఆపిల్ :

ఆపిల్ :

ప్రతిరోజూ యాపిల్‌ పళ్లు తింటే శరీరంలో పేరుకున్న కొవ్వు కణాలు తగ్గుముఖం పడతాయి. యాపిల్‌ తోలులో ఉండే పెక్టిన్‌ శరీర కణాలు కొవ్వును పీల్చుకోకుండా నియంత్రిస్తాయి.

అరటి పండ్లు

అరటి పండ్లు

నీటి శాతం అధికం. పీచు ఉంటుంది. కడుపు నింపుతాయి. మలబద్ధకాన్ని నివారిస్తాయి. మూడ్ మంచిగా ఉండేలా చేస్తాయి.

సిట్రస్ పండ్లు:

సిట్రస్ పండ్లు:

సిట్రస్ పండ్లు అంటే ద్రాక్ష, ఆరెంజ్, బత్తాయి వంటివి వీటిలో ఎక్కుగా విటమిన్ సి. శరీరంలోని జీర్ణక్రియ బాగా పనిచేయాలంటే సిట్రస్ పండ్లు తీసుకోవడం తప్పనిసరి. సి విటమిన్ కొవ్వును కరిగించడమే కాకుండా, బాడ్ కొలెస్ట్రాల్ లెవల్ ను తగ్గిస్తుంది. మరో అద్భుతమైన ఉపయోగం క్యాన్సర్ కు దారితీసే లిమినాయిడ్స్ మరియు లైకోపినె పై దాడి చేస్తాయి.

ఆరెంజ్:

ఆరెంజ్:

ఇది అద్భుతమైన ఫ్యాట్ బర్నింగ్ ఫుడ్. ఈ సీజన్ లో ఎక్కువగా దొరికే ఈ పండ్లతో మీ బరువును సాద్యమైనంత వరకూ తగ్గించుకోవండి. వీటిలో లోక్యాలరీస్ తో పాటు సిట్రస్ యాసిడ్స్ కొవ్వును కరిగించడానికి బాగా సహాపడుతాయి.

కీరదోసకాయ

కీరదోసకాయ

కీరదోసకాయలో సిలికాన్ మరియు సల్ఫర్ అధికంగా ఉండటం వల్ల శరీరంలో ఫ్యాట్స్ భయటకు నెట్టివేస్తుంది. అంతే కాదు, కీరదోసకాయలో శరీరలో యూరిక్ యాసిడ్ లెవల్స్ ను శరీరంలో తగ్గిస్తుంది.

MOST READ:ఈ హీరోయిన్లు చూపించకూడనివి అన్నీ చూపించారు MOST READ:ఈ హీరోయిన్లు చూపించకూడనివి అన్నీ చూపించారు

డైరీ ప్రొడక్ట్స్:

డైరీ ప్రొడక్ట్స్:

లోఫ్యాట్ డైరీ ప్రొడక్ట్స్ మజిల్ ప్రోటీన్స్ ను మరియు ఎక్సెస్ ఫ్యాట్ ను క్రమబద్దం చేస్తుంది. వీటిలో క్యాల్షియం మరియు విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. ఇవి ఎముకల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.

 తృణధాన్యాలు:

తృణధాన్యాలు:

తృణధాన్యాలు ఓట్స్, బ్రెడ్, బ్రౌన్ రైస్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల వరీరంలో ఎక్స్ ట్రా క్యాలరీలను తగ్గించుకోవడానికి సహాయపడుతుంది . అలాగే మన శరీరం కొవ్వును కరిగించడంలో ఎక్కువ ఎనర్జీ వీటి ద్వారా పొందవచ్చు.

కరివేపాకు:

కరివేపాకు:

కొవ్వు శాతాన్ని తగ్గించడమే కాదు..అదనంగా పేరుకోకుండా చేసే శక్తి కరివేపాకు రెమ్మల సొంతం. శరీరంలోని వ్యర్థాలనూ బయటకు పంపివేస్తుంది. చెడు కొలెస్ట్రాల్ నూ కరిగిస్తుంది. అందుకే ఊబకాయంతో బాధపడేవారు రోజు కరివేపాకును ఏదో ఒక రూపంలో తప్పనిసరిగా తీసుకోవాలి.

వెల్లుల్లి:

వెల్లుల్లి:

వెల్లుల్లిలో అల్లిసిన్(allicin)అనే అంశం కలిగి ఉండి యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉండి శరీరంలోని కొవ్వును తగ్గిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ ను నివారిస్తుంది.

మస్టర్డ్(ఆవాలు) :

మస్టర్డ్(ఆవాలు) :

బరువు తగ్గడానికి మీరు తీసుకొనే ఆహారంలో ఆవాలను లేదా ఆవనూనెను చేర్చుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఆవాల్లో ఫ్యాటీ యాసిడ్స్ (ఒలియిక్, యురిసిక్ మరియు లినోలెనిక్ ఆమ్లం)లో సాచ్యురేటెడ్ ఫ్యాట్ మరియు యాంటీఆక్సిడెంట్స్ ఉండి క్యాలొరీస్ ను బర్న్ చేస్తాయి. మరియు బరువు తగ్గిస్తాయి.

మిరియాలు:

మిరియాలు:

మెటబాలిజం రేటును అమాంతంగా పెంచుతుంది. శరీరంలో కొవ్వు త్వరగా కరిగేందుకు సహాయపడుతాయి. ఆకలి కోరికలను కంట్రోల్ చేస్తాయి . యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వల్ల వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.

పెరుగు:

పెరుగు:

లోఫ్యాట్ పెరుగులో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఆకలిని కంట్రోల్ చేస్తుంది మరియు ఎముకలు మరియు దంతాలను బలోపేతం చేస్తుంది. మరియు పెరుగులో అధిక శాతంలో ప్రోటీనులు మరియు విటమిన్ డి పుష్కలంగా ఉంది.ఇది మీశరీరానికి నిరంతరం ప్రసరిస్తుంటుంది. కాబట్టి లోఫ్యాట్ పెరుగుతో పాటు, లోఫ్యాట్ మిల్క్, చీజ్ వంటి వాటిని మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవచ్చు.

చికెన్:

చికెన్:

మాంసాహారంలో లీట్ మీట్ ను తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది, అదనపు కొలెస్ట్రాల్ చేరదు . లీన్ మీట్ ప్రోటీనులను అందిస్తుంది. లీన్ మీట్ తినడం వల్ల పొట్ట ఫుల్ గా ఉన్నఅనుభూతిని కలిగిస్తుంది. ఎక్కువ సమయం ఆకలి కానివ్వదు.

గుడ్లు:

గుడ్లు:

శరీరానికి అవసరైన పోషకాలే కాదు..ఇందులోని విటమిన్ బి12' కొవ్వు కారకాలతో పోరాడుతుంది. ఫలితంగా కొవ్వు కరిగిస్తుంది.

కేరట్లు

కేరట్లు

కార్బో హైడ్రేట్లు అధికంగా ఉండి త్వరగా ఆకలినిస్తాయి. పీచు, విటమిన్ ఎ మరియు బి కాంప్లెక్స్ అధికం. ఇవి సాఫీగా విరోచనం చేస్తాయి.

బీట్ రూట్

బీట్ రూట్

ప్రపంచంలో మనం తీసుకొనే ఆహారాల్లో బీట్ రూట్ ఒక హెల్తీ వెజిటేబుల్ . ఎందుకంటే, ఇందులో వివిధ రకాల డైటరీ నైట్రేట్ కలిగి ఉంటుంది.

ఇది బ్లడ్ ఫ్లోను రెగ్యులేట్ చేస్తుంది. మరియు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అంతే కాదు, మెటబాలిజం రేటును పెంచుతుంది. ఇంకా శరీరంలో నిల్వ ఉన్న కొవ్వుకణాలను నివారిస్తుంది.

MOST READ:లైంగికపటుత్వం పెరగాలంటే ప్రతి మగాడు ఇలానే చేయాలి

 స్వీట్ పొటాటో:

స్వీట్ పొటాటో:

స్వీట్ పొటాటో తినడానికి రుచికరంగా మాత్రమే కాదు, ఇందులో పొటాషియం మరియు డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్, ఫ్యాట్ బర్న్ చేయడానికి అద్భుతంగా సహాయపడుతుంది.

హాట్ పెప్పర్:

హాట్ పెప్పర్:

హాట్ పెప్పర్ లో క్యాప్ససిన్ అనే పోషకాంశం ఉండటం వల్ల హాట్ ఫ్లేవర్ ను అందిస్తుంది. క్యాప్ససిన్ లో ఉండే థర్మోజెనిక్ ఎఫెక్ట్ మీ శరీరంను వేడి చేస్తుంది. మరియు ఫ్యాట్ ను కరిగిస్తుంది.

టమోటో:

టమోటో:

కొవ్వు త్వరగా తగ్గాలంటే పచ్చి టమాటాలు తినండి. టమాట సలాడ్ కేన్సర్ కూడా నివారిస్తుంది. కనుక కొద్ది ఆకలి వేస్తే టమాటాలు తినండి.

పసుపు:

పసుపు:

వంటకాల్లో ప్రతి నిత్యం వేసే చిటికెడు పసుపుతో కలిగే మేలు అంతా ఇంతా కాదు. యాంటీబ్యాక్టీరియల్ సుగుణాలున్న పసుపుతో శరీరంలో నిల్వ ఉన్న వ్యర్థ కొవ్వు కరుగుతుంది. అదనంగా కొన్ని రకాల క్యాన్సర్ల తీవ్రతను తగ్గించే గుణం పసుపుకే సొంతం. కాలేయంలో చేరిన వ్యర్దపదార్థాలను వెలుపలికి పంపించివేస్తుంది. రక్తనాళాల్లో రక్తప్రసరణ వేగవంతం అయ్యేందుకు తోడ్పడుతుంది. దాంతో గుండె ఆరోగ్యానికీ మేలు జరుగుతుంది.

బట్టర్ మిల్క్:

బట్టర్ మిల్క్:

మజ్జిగ వంటి ప్రోబయోటిక్ ఫుడ్స్ లో 2.2గ్రాములు ఫ్యాట్ మరియు 99క్యాలరీలను కలిగి ఉంటుంది. బటర్ మిల్క్ ను రెగ్యులర్ గా త్రాగడం వల్ల రోజంతా పొట్ట నిండుగా ఉండే అనుభూతిని కలిగిస్తుంది. బరువు తగ్గించడంలో మరో క్యాలరీ రిచ్ ఫుడ్ ఇది.

ఫిష్:

ఫిష్:

చేపల్లో చాలా తక్కువ శాతంలో ఫ్యాట్ కలిగి ఉంటుంది. మరియు ఇందులో ఉండే ప్రోటీనులు శరీరానికి చాలా మేలు చేస్తాయి.

 ఆకుకూరలు:

ఆకుకూరలు:

గ్రీన్ లీఫీ వెజిటేబుల్ ను వైయిట్ లాస్ డైట్ లో ఖచ్చితంగా చేర్చుకోవాల్సినటువంటి ఒక సూపర్ ఫుడ్. ఆకుకూరలతో వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి . ఇవి చాలా తక్కువ క్యాలరీలను కలిగి ఉంటాయి. ఇందులో జింక్, ఐరన్ మరియు క్యాల్షియం అధికంగా ఉంటుంది. అంతే కాదు విటమిన్ ఎ మరియు కె కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తప్రసరణను రెగ్యులేట్ చేస్తుంది. మెటబాలిజం రేట్ కు బూస్ట్ వంటిది. కాబట్టి, బరువు తగ్గడానికి ఇది ఫర్ ఫెక్ట్ వెజిటేబుల్.

English summary

Top 30 Foods That Burn Post-Wedding Weight Gain: Health Tips in Telugu

Women tend to gain weight during their marriage. Here's what to do to have a fit and healthy marriage and lose the post-wedding weight. There is a list of fat burning foods especially for women.
Desktop Bottom Promotion