బరువు తగ్గడంతో పాటు, అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించే రాగులు..!!

రాగులలో క్యాల్షియం, ఐరన్, ప్రోటీన్, ఫైబర్ మరియు మినిరల్స్ , అయోడిన్ పుష్కలంగా లభిస్తుంది. ఈ ధాన్యంలో లోఫ్యాట్ శాతాన్ని కలిగి ఉంటుంది మరియు ముఖ్యంగా అసంతృప్త కొవ్వు కలిగి ఉంటుంది . ఇది చాలా సులభంగా జీర

Posted By:
Subscribe to Boldsky

ప్రస్తుత రోజుల్లో చాల మందిలో హెల్త్ కాన్షియస్ నెస్ పెరిగింది. ప్రతి ఒక్కరూ ఫిట్ గా స్మార్ట్ గా ఉండాలని కోరుకుంటున్నారు. అందుకు హెల్తీ లైఫ్ స్టైల్ ను మెయింటైన్ చేయడం అలవాటు చేసుకుంటున్నారు. ఆరోగ్యం కోసం ఇలాంటి మంచి లక్షణాలు అలవాటు చేసుకోవడం మంచిది, అవసరం కూడా. అలాగే ఫిట్ గా ఉంటూనే బరువు తగ్గించే పద్దతులు కూడా తెలుసుకోవాలి.

బరువు తగ్గించడంలో రాగులు సహాయపడుతాయంటే ఆశ్చర్యం కలగక తప్పదు...! రాగులు మంచి పోషకాహారం అని తెలిసిందే.. ఇతర తృణధాన్యాలతో పోలిస్తే వీటి వాడకం నిన్న మొన్నటి వరకూ తక్కువనే చెప్పాలి. కానీ ఆరోగ్య రిత్యా ఐరన్, కాల్షియం నిల్వలు అధికంగా ఉన్న రాగుల్ని ఏదో ఒక రూపంలో ఆహారంగా తీసుకోవడం ఇటీవలి కాలంలో ఎక్కువయింది. మిల్లెట్ లేదా రాగులు అని సాధారణంగా రెగ్యులర్ గా పిలుస్తుంటారు. వీటిని దక్షిణ భారతదేశంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. రాగులు దక్షిణ భారతదేశం అంతటా అనేక గ్రామాలలో ఒక ప్రధానమైన ఆహారం. రాగులు ఇతర ధాన్యాల కంటే బలవర్ధకమైనవి. శారీరక కష్టం అధికంగా చేసేవారు రాగుల పిండితో తయారు చేసిన పదార్ధాలను తరచుగా తిన్నట్లైతే వారికి నూతన శక్తి లభిస్తుంది.

రాగులలో క్యాల్షియం, ఐరన్, ప్రోటీన్, ఫైబర్ మరియు మినిరల్స్ , అయోడిన్ పుష్కలంగా లభిస్తుంది. ఈ ధాన్యంలో లోఫ్యాట్ శాతాన్ని కలిగి ఉంటుంది మరియు ముఖ్యంగా అసంతృప్త కొవ్వు కలిగి ఉంటుంది . ఇది చాలా సులభంగా జీర్ణమైవుతుంది మరియు బంక అనిపించదు. ఎవరైతే గ్లూటెన్ లోపంతో బాధపడుతున్నారో వారు ఈ ధాన్యాహారాన్ని తీసుకోవచ్చు.

రాగుల్లోని కాల్షియం, ఎముకలు, దంతాలు ఆరోగ్యంగా ఉంచడానికి ఎక్కువగా సహాయపడుతుంది. ఈ ఆహారం సమ్మర్ లో కొంచెం పాపులర్. ఎందుకంటే హాట్ సమ్మర్ లో మీ శరీరాన్ని కూల్ గా ఉంచుతుంది. అంతే కాదు, ఎవరైతే బరువు కంట్రోల్ చేయాలనుకుంటున్నారో అటువంటి వారికోసం కూడా రాగులతో తయారుచేసే ఆహారాలు అద్భుతంగా సహాయపడుతాయి. ఇది ఎలాంటి రిమార్క్ లేని ఫర్ ఫెక్ట్ వెజిటేరియన్ ఫుడ్... అది నిరూపంచుకోవాలంటే ఈక్రింది ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకోవాల్సిందే...

డయాబెటిస్ కంట్రోల్ చేస్తుంది:

రాగుల్లో ఉండే ఫైబర్ కంటెంట్, ఫాలీఫినాల్స్ డయాబెటిస్ ను కంట్రోల్ చేస్తుంది. డైజెషన్ సమస్యను ఆలస్యం చేస్తుంది. దాంతో బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గుతాయి. దాంతో డయాబెటిస్ రిస్క్ తగ్గించుకోవచ్చు.

యాక్సైటి, డిప్రెషన్ తగ్గిస్తుంది:

రాగులు ప్రోటీన్స్ మరియు అమినో యాసిడ్స్ కు మంచి మూలం. ఇది శరీరంలో కండారాలు పనిచేయడానికి, మెటబాలిజం మెయింటైన్ చేయడానికి , డిప్రెషన్, ఆందోళనతో పోరాడటానికి అమినో యాసిడ్స్, ప్రోటీన్స్ చాలా అవసరం అవుతాయి. ఇది హార్మోన్స్ పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.

జీర్ణశక్తిని పెంచుతాయి:

రాగిపిండితో తయారుచేసిన ఆహారాలు తినడం వల్ల ప్రేగుల్లో అడ్డుపడిన ఆహార స్పటికలు, వ్యర్థాలను ముందుకు నెట్టడానికి సహాయపడుతుంది. అందుకు రాగిపిండిలో ఉండే ఫైబర్ గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది డైజెస్టివ్ సిస్టమ్ ను రక్షిస్తుంది. జీర్ణ సమస్యలను నివారిస్తుంది.

అనీమియా:

రాగులను మెలక కట్టి తినడం వల్ల అనీమియా తగ్గిస్తుంది. అనీమియాతో బాధపడే వారిలో హీమోగ్లోబిన్ లెవల్స్ పెంచుతుంది.

రిలాక్సేషన్ :

రాగిలో ఉండే ట్రైప్టోఫోన్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీడాకల్స్ తో పోరాడుతుంది. అమినో యాసిడ్స్, యాంటీఆక్సిడెంట్స్ ఒక్కటిగా పనిచేస్తాయి. ఇవి రిలాక్సేషన్, మైగ్రేన్ , ఇతర సమస్యలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి.

బోన్ స్ట్రెంగ్త్ పెంచుతుంది:

రాగుల్లో క్యాల్షియం, విటమిన్ డి అధికంగా ఉంది. బోన్ స్ట్రెంగ్త్ పెంచడంలో ఇది ఉత్తమ పదార్థంగా సూచిస్తారు.

కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది:

రెగ్యులర్ డైట్ లో రాగులను ఏదోఒక రూపంలో చేర్చుకోవడం వల్ల బ్లడ్ వెజల్స్ బ్లాకేజ్ ను నివారిస్తుంది. ఇది హార్ట్ , స్ట్రోక్ రిస్క్ తగ్గిస్తుంది..

ఏజింగ్ ప్రొసెస్ కు రక్షణగా నిలుస్తుంది:

రాగుల్లో అనేక హెల్త్ బెనిఫిట్స్ దాగున్నాయి. రెగ్యులర్ డైట్ లో రాగి వంటలు చేర్చుకోవడం వల్ల స్కిన్ సపెల్ గా , యూత్ ఫుల్ గా ఉంటుంది. రాగుల్లో అమినో యాసిడ్స్ అధికంగా ఉంటాయి. మెథనైనిస్ లిసైన్ అధికంగా ఉంటాయి. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది.

పాల ఉత్పత్తిని పెంచుతుంది:

రాగుల్లో ఉండే న్యూట్రీషియన్స్, పాలిచ్చే తల్లుల్లో పాల ఉత్పత్తిని పెంచుతుంది. పాల్లో అత్యధిక న్యూట్రీషిన్స్ కూడా పెంచుతుంది.

బ్యాక్టీరియాకు వ్యతిరేఖంగా పోరాడుతుంది:

ఫుడ్ పాయిజన్ కు కారణమయ్యే బ్యాక్టీరియా వ్యతిరేఖంగా రాగులు పోరాడుతాయి. జ్వరం, మరియు ఇతర చర్మ సంబంధి ఇన్ఫెక్షన్స్ కు వ్యతిరేఖంగా పోరాడుతాయి.

బరువు తగ్గించడానికి రాగులు:

రాగుల్లో అమినోయాసిడ్స్ వీటిన ట్రిప్టోఫాన్ అనే అమినోఆమ్లం కలిగి ఉండటం వల్ల రాగులు ఆకలి తగ్గిస్తుంది. మరియు బరువును నియంత్రణలో ఉంచుతుంది. రాగిపిండితో తాయారు చేసే ఆహారాలు తీసుకోవడం వల్ జీర్ణక్రియను నిదానం చేస్తుంది . అందుకే అదనపు క్యాలరీలను గ్రహించకుండా దూరంగా ఉంచుతుంది. మరియు రాగుల్లో ఉన్న ఫైబర్ వల్ల కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. దాంతో అధికంగా ఆహారం తీసుకోవడాన్ని నియంత్రిస్తుంది.

బ్లడ్ ప్రెజర్ తగ్గిస్తుంది:

హై బ్లడ్ ప్రెజర్ తో బాధపడుతున్నట్లైతే మరియు ఇతర కరోనరీ వ్యాధులతో బాధపడుతున్నట్లైతే ఫైబర్ ఫుష్కలంగా ఉన్నటువంటి రాగులు బాగా సహాయపడుతాయి. అధిక రక్తపోటు నివారిణిగా: రోస్ట్ చేసిన రాగులను తీసుకోవడం,అధిక రక్తపోటుతో బాధపడేవారికి ఇది ఒక టానిక్ వంటిది

" కంపేర్ & బై " బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్

English summary

10 Health Benefits Of Ragi & How It Helps In Being The Best Weight Loss Mantra

Ragi is a nutritious cereal that is enriched with protein, calcium and iron. It also contains less saturated fats and is already your best pal for weight loss. Ragi does not undergo several rounds of processing and polishing and can be consumed it its original form. So, let us take a look at the 10 health benefits of ragi:
Please Wait while comments are loading...
Subscribe Newsletter