For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కేవలం రెండు వారాల్లో మీ శరీరాన్ని నాజూగ్గా మార్చే పర్ఫెక్ట్ డైట్..!!

By Swathi
|

దసరా వచ్చిందంటే.. ప్రతి మహిళా.. చాలా వైబ్రంట్ కలర్స్ లో మెరిసిపోవాలని భావిస్తుంది. అది కూడా చీరకట్టులో ట్రెడిషనల్ లుక్ కోసం ఎదురుచూస్తుంది. గార్జియస్ చీరల్లో మెరిసిపోవాలంటే.. మహిళలు.. పర్ఫెక్ట్ బాడీ షేప్ కలిగి ఉండాలి. అప్పుడే.. చీరల్లో కావాల్సిన లుక్ సొంతం చేసుకోగలుగుతారు.

దసరా చాలా దగ్గరలోనే ఉంది. కాబట్టి మహిళలంతా.. చాలా పర్ఫెక్ట్ గా కనిపించాలని ప్లాన్ చేస్తుంటారు. ముఖ్యంగా హిప్స్, నడుము భాగాలను నాజూగ్గా మార్చుకునే ప్రయత్నంలో ఉంటారు. అందరికీ అందుబాటులో ఉండే కొన్ని ఆహారాలను డైట్ లో చేర్చుకోవడం వల్ల.. రెండువారాల్లోనే నాజూగ్గా, అందంగా మారిపోవచ్చు.

పొట్ట మాత్రమే కాదు, టోటల్ బాడీ ఫ్యాట్ కరిగించే టాప్ ఫుడ్స్ అండ్ డ్రింక్స్ పొట్ట మాత్రమే కాదు, టోటల్ బాడీ ఫ్యాట్ కరిగించే టాప్ ఫుడ్స్ అండ్ డ్రింక్స్

అలాగే ఈ డైట్ టిప్స్ ని మగవాళ్లు కూడా పాలో అవవచ్చు. అదనపు ఫ్యాట్, కార్బొహైడ్రేట్స్ అదనంగా ఉండే ఆహారాలను తీసుకోకుండా కంట్రోల్ చేసుకోవడం వల్ల.. ఫ్యాట్ కరిగించుకోవడం తేలికవుతుంది. ఆహారం విషయంలోనే కాకుండా.. వ్యాయామం కూడా ప్రతిరోజూ చేయాలి.

కొవ్వు కరిగించుకోవడం గురించి.. రకరకాల సలహాలు, ఆర్టికల్స్ చదివే ఉంటారు. అన్నింటినీ బర్రకు ఎక్కించుకునేసరికి.. చాలా అయోమయానికి గురై ఉంటారు. కాబట్టి మిమ్మల్ని మీరు కన్య్పూజ్ చేసుకోకుండా.. కొన్ని డైట్ ఫుడ్స్ ని చేర్చుకోవడం వల్ల మీకు చాలా సహాయపడుతుంది. మరి పర్ఫెక్ట్ బాడీ షేప్ పొందడానికి డైట్ ఫుడ్స్ ఏంటో చూద్దామా..

అవకాడో

అవకాడో

ఫైబర్ ఎక్కువగా, తక్కువ కార్బొహైడ్రేట్స్ కలిగిన అవకాడోను.. ఫ్యాట్ తగ్గాలి అనుకునేవాళ్లు.. చేర్చుకోవడం చాలా అవసరం. ఇది.. త్వరగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

క్యారట్

క్యారట్

తక్కువ క్యాలరీలు, ఎక్కువ పోషకాలు ఉండే క్యారట్స్.. ఫ్యాట్ తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే.. కావాల్సిన ఎనర్జీని అందిస్తుంది. సరైన విధంగా క్యారట్స్ తీసుకుంటే.. మెరుగైన ఫలితాలు పొందవచ్చు.

పెరుగు

పెరుగు

హిప్స్ చుట్టూ, నడుము చూట్టూ ఉండే ఫ్యాట్ ని కరిగించుకోవాలని భావిస్తున్నారా ? అయితే.. మీ శరీరానికి కావాల్సిన ప్రొటీన్ ని పెరుగు ద్వారా పొందడం వచ్చు. అయితే తక్కువ ఫ్యాట్ ఉన్న పెరుగునే తీసుకోవాలి.

బీన్స్

బీన్స్

ఫైబర్ ఎక్కువగా, క్యాలరీలు తక్కువగా ఉండే.. బీన్స్ ని ఖచ్చితంగా డైట్ లో చేర్చుకోవాలి. అది కూడా బరువు తగ్గే ప్రాసెస్ లో ఉన్నప్పుడు వీటిని ఖచ్చితంగా తినాలి. ఇవి శరీరంలో వాటర్ లెవెల్స్ ఉండటానికి, ఎనర్జిటిక్ గా ఉండటానికి ఉపయోగపడుతుంది.

ఓట్ మీల్

ఓట్ మీల్

ఫైబర్ ఎక్కువగా ఉండే ఓట్ మీల్..బరువు తగ్గే ప్రాసెస్ లో ఖచ్చితంగా చేర్చుకోవాల్సిన ఆహారం. ఇందులో విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. శరీరానికి కావాల్సిన పోషకాలు అందిస్తుంది.

అల్లం

అల్లం

అల్లంలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. మెటబాలిజంను పెంచుతుంది. ఫ్యాట్, కొలెస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గించడంలో సహాయపడుతుంది. దీన్ని ఆహారంలో చేర్చుకోవచ్చు లేదా టీ రూపంలో తీసుకోవచ్చు.

గ్రెయిన్స్

గ్రెయిన్స్

తృణధాన్యాలలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇవి శరీరంలో క్యాలరీలను చాలా వేగంగా కరిగిస్తాయి.

నీళ్లు

నీళ్లు

ఫ్యాట్, క్యాలరీలు కరిగించి.. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి నీళ్లు సహాయపడతాయి. ఈ కారణం వల్లే.. ఎక్కువ నీళ్లు తాగాలని.. ప్రతి ఒక్కరూ సూచిస్తుంటారు.

యాపిల్స్

యాపిల్స్

యాపిల్స్ లో ఫైబర్, మినరల్స్, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. యాపిల్ ని డైలీ డైట్ లో చేర్చుకోవడం వల్ల.. వేగంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

నట్స్

నట్స్

అదనపు ఫ్యాట్ ని కరిగించడానికి నట్స్ సహాయపడతాయి. నట్స్ లో క్యాల్షియం, మినరల్స్, ఫైబర్, హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. ఎక్స్ ట్రా ఫ్యాట్ తగ్గించుకోవాలి అనుకునేవాళ్లు.. ఖచ్చితంగా నట్స్ తినాలి.

ఆలివ్ ఆయిల్

ఆలివ్ ఆయిల్

ఆయిల్ లేకుండా ఉండటం చాలా కష్టం. బరువు తగ్గాలని మీరు భావిస్తే.. డైట్ లో ఆలివ్ ఆయిల్ చేర్చుకోండి. ఇందులో ప్యాటీ యాసిడ్స్, ఓలిక్ యాసిడ్ ఉంటుంది. అవి.. ఫ్యాట్ ని బర్న్ చేయడానికి సహాయపడుతుంది.

పంచదార తగ్గించాలి

పంచదార తగ్గించాలి

పంచదారలో ఫ్రక్టోజ్ ఉంటుంది. ఇది శరీరంలో ఫ్యాట్ పేరుకోవడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా నడుము, పొట్ట చుట్టూ ఫ్యాట్ కి పంచదారే కారణం. కాబట్టి.. పంచదార తీసుకోవడానికి తగ్గించాలి.

బ్రొకోలి

బ్రొకోలి

పుష్కలంగా ఫైబర్ ఉండే ఆహారాలు ఎక్కువ ఫ్యాట్ ని కరిగిస్తాయి. బ్రొకోలి కూడా.. ఫైబర్ ఎక్కువగా కలిగి ఉంటుంది. అలాగే విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి.ఇది.. క్యాలరీలు కరిగించడానికి, ఫ్యాట్ తగ్గించడానికి సహాయపడుతుంది.

లీన్ మీట్

లీన్ మీట్

నాన్ వెజ్ తినేవాళ్లు.. లీన్ మీట్ తీసుకుంటే.. ఫ్యాట్ తగ్గించుకోవడానికి సహాయపడుతుంది. లీన్ మీట్ లో తక్కువ ఫ్యాట్, ఎక్కువ ప్రొటీన్స్ ఉంటాయి.

ధాన్యాలు

ధాన్యాలు

ఫైబర్స్ ఎక్కువగా ఉండే ధాన్యాలు.. ఎక్స్ ట్రా ఫ్యాట్ ని కరిగిస్తాయి. అది కూడా హిప్స్, నడుము చుట్టూ పేరుకున్న ఫ్యాట్ ని టార్గెట్ చేస్తాయి.

English summary

15 Diet Foods To Get Those Perfectly Curved Hips & Waist By Dussehra (Dasara)

15 Diet Foods To Get Those Perfectly Curved Hips & Waist By Dussehra (Dasara). The moment you think of Dusshera, the first thing that comes to the mind of every woman is the lovely sarees in all vibrant colours.
Story first published: Thursday, September 22, 2016, 13:49 [IST]
Desktop Bottom Promotion