ఊహించనిరీతిలో బరువు పెరగడానికి కారణాలేంటో తెలుసా ?

ఎంత డైట్ ఫాలో అయినా, వ్యాయామం చేసినా.. బరువు పెరుగుతున్నారని.. బాధపడుతున్నారా ? ఎందుకు బరువు పెరుగుతున్నారో అర్థంకాక తికమకపడుతున్నారా ? అయితే కారణాలు ఏమై ఉంటాయో తెలుసుకోండి.

Posted By:
Subscribe to Boldsky

ఎంత డైట్ ఫాలో అయినా, వ్యాయామం చేసినా.. బరువు పెరుగుతున్నారని.. బాధపడుతున్నారా ? ఎందుకు బరువు పెరుగుతున్నారో అర్థంకాక తికమకపడుతున్నారా ? అయితే.. మీ మెటబాలిజం నెమ్మదిగా సాగుతోంది, అలాగే కొన్ని మెడికల్ రీజన్స్ వల్ల.. మెటబాలిజం నెమ్మదిగా మారి ఉంటుంది. దీనివల్లే.. మీరు బరువు పెరుగుతూ ఉండవచ్చు.

7 Medical Reasons For Slow Metabolism & Weight Gain!

ఖచ్చితమైన డైట్ ఫాలో అవుతూ.. ప్రతిరోజూ కాస్త వ్యాయామం చేస్తున్నా.. బరువు పెరుగుతున్నారంటే.. కారణాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి. సాధారణంగా.. హెల్తీగా బరువు తగ్గితే.. మెటబాలిజం మెరుగుపడుతుంది. మెటబాలిక్ రేట్ వేగంగా ఉంటే.. త్వరగా క్యాలరీలు కరిగించవచ్చు.

మెటబాలిజం అంటే.. క్యాలరీలను ఆహారంగా మార్చడం. ఒకవేళ మీ మెటబాలిక్ రేట్ నెమ్మదిగా ఉంటే.. మీ శరీరం క్యాలరీలను ఎనర్జీగా మార్చడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. కాబట్టి మెటబాలిజం మీరు బరువు పెరగడానికే కాదు, ఎనర్జీ లెవెల్స్ తగ్గించడానికి కారణమవుతుంది. మరి మెటబాలిజం తగ్గడానికి, బరువు పెరగడానికి కారణాలేంటో తెలుసుకుందాం..

అదనపు కార్టిసాల్

శరీరంలో అదనంగా స్ట్రెస్ హార్మోన్స్ ఉత్పత్తి అవడాన్ని కార్టిసోల్ అంటారు. మెటబాలిజం నెమ్మదిగా జరగడానికి ఇది కూడా ఒక కారణం. దీనివల్ల బరువు పెరుగుతారు, దానికి సంబంధించిన అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి.

హై ఇన్సులిన్ లెవెల్స్

శరీరంలో హై ఇన్సులిన్ లెవెల్స్ ఉండే.. బ్లడ్ కావాల్సినంత గ్లూకోజ్ ని గ్రహించలేదు. దీనివల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువైనప్పుడు.. మీ మెటబాలిక్ రేట్ కూడా.. నెమ్మదిగా సాగుతుంది. దీనివల్ల బరువు పెరిగిపోతారు.

థైరాయిడ్ డిజార్డర్

ఒకవేళ మీ థైరాయిడ్ హార్మోన్స్.. ఎక్కువ మోతాదులో ఉత్పత్తి అయ్యాయంటే.. మెటబాలిజం స్లోగా మారి.. బరువు పెరగడానికి కారణమవుతుంది.

ఈస్ట్రోజెన్ లెవెల్స్ తక్కువగా ఉంటే

మహిళల్లో రీప్రొడక్టివ్ హార్మోన్, ఈస్ట్రోజెన్ లెవెల్స్ తక్కువగా ఉంటే.. మెటబాలిజం నెమ్మదిగా మారుతుంది. దీనివల్ల మెనోపాజ్ తర్వాత అనేక సమస్యలు, బరువు పెరగడం, అలసట వంటి సమస్యలను మహిళలు ఎదుర్కొంటారు.

లో టెస్టోస్టెరాన్ లెవెల్స్

తక్కువ టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఉంటే.. మెటబాలిజం నెమ్మదిగా మారుతుంది. అలాగే కండరాలలో మార్పు వస్తుంది. ఫ్యాట్ ఎక్కువగా పెరుగుతుంది.

కండరాల టిష్యూస్

ఏ వ్యక్తికైతే.. ఎక్కువ ఫ్యాట్ టిష్యూస్ శరీరంలో ఉంటాయో.. వాళ్ల శరీరంలో.. మెటబాలిజం నెమ్మదిగా మారుతుంది. ఈ కారణంగా.. అనుకోకుండానే బరువు పెరిగిపోతారు.

మెడిసిన్స్

స్టెరాయిడ్స్, యాంటీ ఇన్ల్ఫమేటరీ డ్రగ్స్, యాంటీ డిప్రెజంట్స్ వంటి మెడిసిన్స్ ని.. ఎక్కువగా ఉపయోగించేవాళ్లలో.. మెటబాలిక్ రేట్ తక్కువగా, నెమ్మదిగా ఉంటుంది. ఇది.. బరువు పెరగడానికి కారణమవుతాయి.

" కంపేర్ & బై " బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్

English summary

7 Medical Reasons For Slow Metabolism & Weight Gain!

7 Medical Reasons For Slow Metabolism & Weight Gain! Worried that you are gaining weight because of slow metabolism? Here is a list of medical reasons for slow metabolism, read along and talk to you doctor, today!
Please Wait while comments are loading...
Subscribe Newsletter