ఒక గ్లాసు కొబ్బరినీళ్లు, దోసకాయ కలిపి తీసుకుంటే.. బెల్లీ ఫ్యాట్ దూరం..!

రాత్రి పడుకోవడానికి ముందు కేవలం ఒక గ్లాసు ఇది తాగితే చాలు.. శరీరంలో ఫ్యాట్.. ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్ తగ్గిపోతుంది. ఈ డ్రింక్ ని ప్రిపేర్ చేయడం కూడా చాలా తేలిక.

Posted By:
Subscribe to Boldsky

ఇది చాలా పవర్ ఫుల్ ఫ్యాట్ కరిగించే టానిక్. టానిక్ అంటే.. ఎలా ఉంటుందో అనుకోకండి. చాలా సింపుల్ గా, టేస్టీగా మీరే చేసుకునే అద్భుతమైన డ్రింక్ ఇది. దీన్ని తాగారంటే.. బెల్లీ ఫ్యాట్ కరగడమే కాదు.. డయాబెటిస్, హార్ట్ డిసీజ్ లను దూరంగా ఉంచుతుంది.

belly fat

రాత్రి పడుకోవడానికి ముందు కేవలం ఒక గ్లాసు ఇది తాగితే చాలు.. శరీరంలో ఫ్యాట్.. ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్ తగ్గిపోతుంది. ఈ డ్రింక్ ని ప్రిపేర్ చేయడం కూడా చాలా తేలిక. చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ ఫలితాలను అందిస్తుంది.

మరి ఈ డ్రింక్ లో ముఖ్యమైన పదార్థం ఏంటో తెలుసా ? దోసకాయ. ఇది చాలా సింపుల్ అండ్ చీప్ పదార్థమే అయినా.. ఫలితాలు మాత్రం చాలా ఎఫెక్టివ్ గా ఉంటాయి. అయితే కొబ్బరినీళ్లలో దోసకాయ కలిపి తీసుకుంటే మెరుగైన ఫలితాలు పొందవచ్చు. ఒకవేళ అది కుదరిని వాళ్లు.. మంచినీళ్లతో కలిపి తీసుకోవచ్చు.

గుండె వ్యాధులు

కుకుంబర్ వాటర్ ని తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రెజర్ ని కంట్రోల్ చేస్తుంది. దీనివల్ల హార్ట్ డిసీజ్ రిస్క్ లకు దూరంగా ఉండవచ్చు.

కండరాలు

ఈ డ్రింక్ కండరాలకు అవసరమైన చాలా ముఖ్యమైన పోషకాలను అందిస్తుంది. కాబట్టి కండరాలను సౌష్టవంగా చేయాలనుకుంటే.. రోజుకి కనీసం రెండు గ్లాసులు తీసుకోవాలి.

బ్రెయిన్ ఫంక్షన్

కుకుంబర్ వాటర్ లో బలమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి బ్రెయిన్ ఫంక్షన్ ని మెరుగుపరుస్తాయి. కాబట్టి ఒత్తిడి, అల్జీమర్స్ వంటి వ్యాధుల ముప్పు నుంచి బయటపడవచ్చు.

డయాబెటిస్

అలాగే డయాబెటిస్, కంటి సమస్యలను నివారించడంలో కూడా ఈ డ్రింక్ ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

కీళ్ల నొప్పులు

ఈ రోజుల్లో కామన్ అయిపోయిన డేంజరస్ వ్యాధి.. కీళ్ల నొప్పులు. వయసుతో సంబంధం లేకుండా.. ఈ సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీన్ని కూడా అదుపుచేయడంలో ఈ డ్రింక్ సహాయపడుతుంది. కుకుంబర్ డ్రింక్ ఎముకలను బలంగా మార్చడం వల్ల.. కీళ్లనొప్పులను అడ్డుకుంటుంది.

చర్మానికి

ఈ డ్రింక్ చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. స్కిన్ టోన్ ని మెరుగుపరుస్తుంది. చర్మాన్ని స్మూత్ గా మారుస్తుంది. దీనికి దోసకాయలో ఉండే సిలికేట్ సహాయపడుతుంది.

డెటాక్స్

శరీరంలో పేరుకున్న టాక్సిన్స్ ని బయటకు పంపడంలో.. కుకుంబర్ వాటర్ చాలా పవర్ ఫుల్ గా పనిచేస్తుంది. ఎఫెక్టివ్ గా శరీరాన్ని డెటాక్స్ చేస్తుంది.

డ్రింక్ తయారీ విధానం

ముందుగా దోసకాయను శుభ్రం చేసి, తొక్క తీసి ముక్కలు కట్ చేసుకోవాలి. దీన్ని రెండు లీటర్ల నీళ్లు పట్టే ఒక గ్లాస్ కంటెయినర్ లో కలపాలి. ఈ కంటెయినర్ ని ఒకరోజంతా ఫ్రిడ్జ్ లో పెట్టాలి.

తీసుకునే విధానం

నీళ్లకు బదులు ఎలక్ట్రోలైట్స్ ఉండే కొబ్బరినీళ్లు ఉపయోగిస్తే.. చాలా ఎఫెక్టివ్ గా బెల్లీ ఫ్యాట్ ని కరిగించుకోవచ్చు. ప్రతిరోజూ రాత్రి పడుకోవడానికి ముందు ఒక గ్లాసు ఈ డ్రింక్ తీసుకుంటే.. బెల్లీ ఫ్యాట్ చాలా తేలికగా కరిగిపోతుంది.

" కంపేర్ & బై " బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్

English summary

Glass of This Water Burns Belly Fat Effectively

Glass of This Water Burns Belly Fat Effectively. Just Add It to a Glass of Water. It Burns Belly Fat, Protects the Heart, and Prevents Diabetes.
Please Wait while comments are loading...
Subscribe Newsletter