For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్రేక్ ఫాస్ట్ తింటే ఏమవుతుంది? తినకపోతే ఏం జరుగుతుంది?

|

రోజూ మనం తీసుకునే ఆహారంలో అత్యంత కీలక పాత్ర పోషించేది రోజూ ఉదయం మనం తీసుకునే 'బ్రేక్ ఫాస్టే'! రోజుని ఉల్లాసంగా, ఉత్సాహంగా ప్రారంభించాలంటే మంచి పోషకవిలువలున్న అల్ఫాహారం తీసుకోవడమూ ముఖ్యమే. కానీ ఈ ఉరుకుల పరుగుల జీవితంలో కొంత మందికి బ్రేక్ ఫాస్ట్ చేయడానికే టైముండదు.

మరికొందరైతే ఏదో ఒకటి తినేద్దాంలే అని సరిపెట్టుకుంటుంటారు. ఇలా చేయడం వల్ల ఆరోగ్యం దెబ్బతిని రకరకాల సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం లేకపోలేదు. అలాగే మనం చేసే పనిపై సరిగ్గా శ్రద్ద పెట్టలేకపోవచ్చు! ఇంతకీ బ్రేక్ పాస్ట్ తీసుకోకపోవడం వల్ల కలిగే లాభాలేంటి ? చేయకపోతే వచ్చే నష్టాలేంటో? తెలుసుకుందాం...

The Reasons Why Breakfast is Very Very Important
బ్రేక్ ఫాస్ట్ కంపల్సరీగా ఎందుకు తినాలి?
మనం రెగ్యులర్ గా రోజూ తీసుకొనే బ్రేక్ ఫాస్ట్ లో పీచు పదార్థాలు ఎక్కువగా, కొవ్వు తక్కువగా ఉండే పోసకవిలువలున్న ఆహారాలను తీసుకోవడం వల్ల గుండె సురక్షితంగా ఉంచుకోవచ్చు. అలాగే ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ లో బ్యాలెన్స్డ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఆకలి అదుపులో ఉంటుంది.
The Reasons Why Breakfast is Very Very Important

బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటే శరీరానికి కావల్సిన శక్తి అందుతుంది. కాబట్టి మనం ఏ పని మీదైనా పూర్తిగా శ్రద్ద పెట్టొచ్చు . అదే బ్రేక్ ఫాస్ట్ చేయకపోవడం వల్ల ఆకలితో చేసే పని మీద ఏకాగ్రత పెట్టలేకపోతారు. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకుంటూ బరువును అదుపులో పెట్టుకోవాలంటే బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడం చాలా అవసరం.

బ్రేక్ ఫాస్ట్ తినడం వల్ల శరీరానికి అవసరమయ్యే పోషకాలు పుష్కలంగా అందుతాయి .

The Reasons Why Breakfast is Very Very Important

శరీర బరువును అదుపులో ఉంచుకోవడానికి ఉదయం తీసుకొనే బ్రేక్ ఫాస్ట్ ఎంతో అవసరం. ఎందుకంటే ఉదయం తీసుకొనే బ్రేక్ ఫాస్ట్ వల్ల మధ్యహ్నానం భోజం తక్కువగా తీసుకుంటాం. దాంతో శరీర బరువు కంట్రోల్లో ఉంటుంది. బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోతే,మధ్యహ్నాన భోజనంలో ఎక్కువ క్యాలరీలు తీసుకోవడం వల్ల అధిక బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

ఉదయం బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడం వల్ల శరీరం ఫిట్ గా ఉంటుంది. బ్రెయిన్ షార్ప్ గా పనిచేస్తుంది. జ్ఝాపకశక్తి పెరుగుతుంది. చేసే పనిమీద కాన్సంట్రేట్ చేయొచ్చు.

The Reasons Why Breakfast is Very Very Important

నిద్రించే సమయంలో మన శరీరంలో జీవక్రియల ప్రక్రియ క్రమంగా తగ్గిపోతుంది. కాబట్టి, ఉదయాన్నే అల్పాహారం తీసుకోవడం వల్ల జీవక్రియలు ఉత్తేజితమవుతాయి. తిరిగి వేగవంతంగా పుంజుకుంటాయి. ఈ ప్రక్రియల వల్ల శరీరంలో క్యాలరీలు కరుగుతాయి. బరువు అదుపులో ఉంటుంది.

బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోతే ఏం జరగుతుంది.?

The Reasons Why Breakfast is Very Very Important

బ్రేక్ ఫాస్ట్ తినడకపోవడం వల్ల మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోయి ఎక్కువ బరువు పెరిగే అవకాశం ఉంటుంది.

మెదడు చురుగ్గా పనిచేయాలంటే..మెదడుకు మనం తీసుకునే ఆహారం నుంచి గ్లూకోజ్ అందాలి. అలాకాకుండా అల్పాహారం మానేస్తే మెదడు చురుగ్గా పనిచేయదు . ఫలితంగా చేపే పనిపట్ల ఆసక్తి తగ్గుతుంది.

The Reasons Why Breakfast is Very Very Important

క్రమం తప్పకుండా అల్పాహారం తీసుకోకపోతే డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువ. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ పెరగడంలాంటి పలు ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఇవన్నీ హార్ట్ అటాక్ కు కారణమవుతాయి. ఆహారం తీసుకొనే మహిళల్లో నెలసరి సరిగ్గా రాకపోవడం లాంటి సమస్యలు కూడా ఎదురవుతాయని ఓ సర్వేలో వెల్లడైంది.

English summary

The Reasons Why Breakfast is Very Very Important

People have some wrong notions about dieting. Young people, specifically feel that dieting means you have to avoid food. And breakfast is that part of your life, which you skip intentionally to avoid that extra calorie intake. You remain busiest in the morning, and get excuses to avoid breakfast by saying you don’t have time.
Story first published: Monday, May 30, 2016, 17:05 [IST]
Desktop Bottom Promotion