అధిక బరువు తగ్గించడానికి సహాయపడే సింపుల్ స్నాక్స్ ..!!

Subscribe to Boldsky

మనకు తెలిసో , తెలియకుండానో మన వంట గదిలో ఉండే చాలా పదార్థాలను నిర్లక్ష్యం చేస్తుంటాము. అయితే వాటిలో అనేక ఔషధ గుణాలు ఉంటాయన్న విషయం కూడా తెలుసుకోరు. అదే విధంగా బరువు తగ్గించుకోవాలనుకునే వారు, అధిక బరువును కంట్రోల్ చేసుకోవాలని కోరుకునే వారికి వంటగదిలోని పదార్థాల కంటే మరే వి ఎఫెక్టివ్ గా పనిచేయవు .

నిజంగా బరువు తగ్గించుకోవాలని కోరుకునే వారికి కొన్ని ప్రత్యేమైన ఆహార పదార్థాలు వంటగదిలో ఉన్నాయి. వీటిని స్నాక్స్ గా తీసుకోవచ్చు. బరువు తగ్గించడంలో ఇవి గ్రేట్ గా సహాయపడుతాయి. వీటిని ఉదయం లేదా సాయంత్రం సమయంలో తీసుకోవచ్చు.

ఈ పదార్థాలు బరువు తగ్గించడానికి మాత్రమే కాదు, అనేక వ్యాధులను నివారించడంలో కూడా గొప్పగా సహాయపడుతాయి .

బరువు తగ్గించుకోవడానికి డైట్, వ్యాయామం, జిమ్, మెడికేషన్స్, ట్రీట్మెంట్స్ ల రూపంలో వివిధ రకాలుగా ప్రయత్నించి ఉంటారు . వీటి వల్ల ఎంతో కొంత మాత్రమే పనిచేసి , కొద్దిగా మార్పు తీసుకొచ్చినా, పూర్తిగా ఆశించిన ఫలితాలను అందివ్వవు.

కాబట్టి, వీటన్నింటితో పక్కన పెట్టి లేదా వీటన్నింటితో పాటు కొన్ని నేచురల్ ట్రీట్మెంట్ ను అనుసరిస్తే తప్పనిసరిగి మంచి ఫలితం కనబడుతుంది. మన వంటగదిలో ఉండే ఈ నేచురల్ ట్రీట్మెంట్స్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. బరువు తగ్గించడానికి ఇవి చాలా గ్రేట్ గా సహాయపడుతాయి. అవేంటో ఒకసారి తెలుసుకుందాం..

1.పెసరపప్పు:

పెసరపప్పులో విటమిన్ ఎ, బి, సి మరియు క్యాల్షియం, ఐరన్ మరియు పొటాషియంలు అధికంగా ఉంటాయి. పెసరపప్పును డైలీ స్నాక్స్ గా తీసుకోవచ్చు. వీటిలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల బరువు తగ్గించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.

2. వాల్ నట్స్ :

డ్రై ఫ్రూట్స్ అన్నింటిలోకంటే వాల్ నట్ ఉత్తమమైనది. ఎందుకంటే వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇవి బరువుతగ్గించడానికి గ్రేట్ గా సహాయపడతాయి.

3. ఆకుకూరలు:

ఆకుకూరల్లో ఫైబర్, విటిమన్ కె, పొటాషియం, మెగ్నీషియం, మరియు ఐరన్ లు అధికంగా ఉన్నాయి. ఆకుకూరలను సాలాడ్స్, స్మూతీస్ లో చేర్చుకోవడం గ్రేట్ స్నాక్ ఐటమ్ గా , బరువు తగ్గించడంలో సహాయపడుతుంది.

4.యాపిల్స్ :

రెగ్యులర్ డైట్ లో యాపిల్స్ చేర్చుకోవడం వల్ల బరువు తగ్గించుకోవచ్చు. యాపిల్స్ ను స్నాక్స్ రూపంలో తీసుకోవడం వల్ల అధిక బరువును కంట్రోల్ చేసుకోవచ్చు. వీటిని తినడం వల్ల ఇతర ఆహారాలను ఎక్కువగా తినకుండా నివారించుకోవచ్చు. దాంతో క్రమంగా బరవు తగ్గుతారు.

5. అరటి పండ్లు:

అరటి పండ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఉదయం లేదా సాయంత్రంలో ఒక అరటి పండును పూర్తిగా తినడం ల్ల బరువు తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

6. ఆలివ్ ఆయిల్ :

వంటలకు , సలాడ్స్ కు ఆలివ్ ఆయిల్ ను ఉపయోగించడం వల్ల అధిక బరువు పెరగకుండా నివారిస్తుంది.

7. గుడ్లు:

గుడ్లు మరో ముఖ్యమైన స్నాక్ రిసిపి, వీటిని రోజూ తినవచ్చు. వీటిలో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి, ఇవి తినడం వల్ల పొట్ట ఫుల్ గా ఉన్న అనుభూతి కలుగుతుంది. దీన్ని తినడం వల్ల ఇతర జంక్ ఫుడ్స్ తినాలన్నా ఆలోచన కలగదు.

" కంపేర్ & బై " బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్

English summary

These Easy Snacks Help Lose Weight, Check It!

Knowingly or unknowingly we tend to ignore the common things that are available in our kitchen that have a lot of medicinal properties. Likewise, if you are on the lookout for losing weight or putting a control on gaining weight further, then there is nothing better than kitchen ingredients that are commonly available.
Please Wait while comments are loading...
Subscribe Newsletter