సైడ్ ఫ్యాట్...బ్యాక్ ఫ్యాట్ ను కరిగించడానికి ఎఫెక్టివ్ టిప్స్ ..!!

శరీరంలో ఒక సారి కొత్తగా ఫ్యాట్ కణాలు చేరితే , వాటిని కరిగించడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. అందువల్ల శరీరంలో ఫ్యాట్ చేరకుండా అధిక బరువు పెరగడకుండా కొన్ని సింపుల్ హోం రెమెడీస్ ఉన్నాయి. ఇవి బ్యాక్ అండ

Posted By:
Subscribe to Boldsky

సాధారణంగా ఒక వయస్సు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ బెల్లీ ఫ్యాట్ బ్యాక్ ఫ్యాట్ తో బాధపడుతుంటారు. ఇది వ్యక్తిగత ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది. ముఖ్యంగా ఆత్మగౌరవాన్ని దెబ్బతియ్యడం కంటే కాస్త నిర్లక్ష్యం చేస్తే చాలు ఆరోగ్య సమస్యలు ఎక్కువగా చుట్టు ముడుతాయి.

శరీరంలో ఎక్కడైనా ఫ్యాట్ చేరిందంటే ఖచ్చితంగా ఫ్యాట్ ను కంట్రోల్ చేయాలి. శరీరంలో ఫ్యాట్ చేరకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ముందు ముందు శరీరంలో చేరిన ఫ్యాట్ ను కరిగించుకోవడానికి కష్టపడాల్సి వస్తుంది.

బొజ్జతో అనర్థాలు: బొజ్జ తగ్గించే చిట్కాలు

శరీరంలో ఒక సారి కొత్తగా ఫ్యాట్ కణాలు చేరితే , వాటిని కరిగించడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. అందువల్ల శరీరంలో ఫ్యాట్ చేరకుండా అధిక బరువు పెరగడకుండా కొన్ని సింపుల్ హోం రెమెడీస్ ఉన్నాయి. ఇవి బ్యాక్ అండ్ బెల్లీ ఫ్యాట్ రెండింటిని చాలా ఎఫెక్టివ్ గా కరిగిస్తాయి. అవేంటంటే..

కుకుంబర్ జ్యూజ్ :

కీరదోసకాయ, పుదీనా , నిమ్మసం మిక్సీలో వేసి గ్రైండ్ చేసి, గ్లాస్ లోకి తీసుకుని తాగాలి. రోజూ ఉదయం పరగడుపున తాగితే మంచి ఫలితం ఉంటుంది.

ఆపిల్ సైడర్ వెనిగర్ :

ఆపిల్ సైడర్ వెనిగర్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే, పొట్ట నిండుగా ఉన్న అనుభూతి కలుగుతుంది. షుగర్ లెవల్స్ తగ్గిస్తుంది. బెల్లీ ఫ్యాట్ తగ్గించడంలో సహాయపడుతుంది.

కొత్తిమీర:

వాటర్ వెయిట్ తగ్గించుకోవడానికి కొత్తి మీరను రెగ్యులర్ వంటకాల్లో చేర్చుకోవాలి. ఇది జీర్ణశక్తిని పెంచుతుంది. కడుపుబ్బరాన్ని తగ్గిస్తుంది.

దాల్చిన చెక్క:

దాల్చిన చెక్కను ఉదయం తాగిగే టీలో మిక్స్ చేసి తాగడం వల్ల బెల్లీ ఫ్యాట్ ను బర్న్ చేస్తుంది.

వెల్లుల్లి పేస్ట్ :

ఒక గ్లాస్ లెమన్ వాటర్ లో ఒక టీస్పూన్ వెల్లుల్లి పేస్ట్, మిక్స్ చేసి తాగడంవల్ల శరీరంలో కొలెస్ట్రాల్ మరియు ఫ్యాట్ కరుగుతుంది.

క్యాబేజ్ జ్యూస్ :

క్యాబేజ్ జ్యూస్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చి తాగడం వల్ల శరీరంలో టాక్సిన్స్ ను తగ్గిస్తుంది బెల్లీ ఫ్యాట్ ను కరిగిస్తుంది. శరీరంలో ఫ్యాట్ చేరడానికి కారణమయ్యే అన్ని రకాల టాక్సిన్స్ ను ఫ్లష్ అవుట్ చేస్తుంది.

నిమ్మరసం:

నిమ్మరసంను వేడినీటిలో మిక్స్ చేసి ఉదయం పరగడపున తాగడం వల్ల ఇది బౌల్ మూమెంట్ మెరుగుపరుస్తుంది. జీర్ణశక్తిని పెంచుతుంది. మెటబాలిజంను వేగవంతం చేస్తుంది.

" కంపేర్ & బై " బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్

English summary

Ways To Reduce Side And Back Fat

Fat accumulation anywhere in the body must be controlled. The problem with weight gain is that, it tends to get stubborn when you want to get rid of it.
Please Wait while comments are loading...
Subscribe Newsletter