బరువు తగ్గడానికి అమేజింగ్ సొల్యూషన్..అలోవెరా..!

మీరు నేచురల్ బరువు తగ్గించుకోవాలని కోరుకుంటే, హెల్తీ లైఫ్ స్టైల్, లోఫ్యాట్ డైట్, రెగ్యులర్ గా వ్యాయామంతో పాటు, అలోవెర జ్యూస్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. అవెవర బరువు తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడ

Posted By:
Subscribe to Boldsky

మీరు నేచురల్ బరువు తగ్గించుకోవాలని కోరుకుంటే, హెల్తీ లైఫ్ స్టైల్, లోఫ్యాట్ డైట్, రెగ్యులర్ గా వ్యాయామంతో పాటు, అలోవెర జ్యూస్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. అవెవర బరువు తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. బరువు తగ్గించుకోవడానికి అలోవెరను ఏవిధంగా ఉపయోగించాలి, రెగ్యులర్ డైట్ లో దీన్ని ఒక భాగంగా ఎందుకు చేర్చుకోవాలో తెలుసుకుందాం..

aloevera

అలోవెరాలో అనేక ఆరోగ్యప్రయోజనాలు దాగున్నాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. ఇది అనేక వ్యాధులు నివారించడంలో ఎఫెక్టివ్ గా ఉపయోగపడుతుంది. ఇందులో ముఖ్యంగా బరువు తగ్గించే ఎఫెక్టివ్ బెన్ఫిట్ దాగుంది. చాలామంది బరువు తగ్గడానికి ఈ రెమిడీనే ఫాలో అవుతారు.

అయితే అలోవెరాను ఎలా ఉపయోగించే బరువు తగ్గడం తేలికవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

నిమ్మరసం, అలోవెరా

2 టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్, 3 టేబుల్ స్పూన్ల నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని నీటిలో కలపాలి. తర్వాత ఈ డ్రింక్ ని తాగితే.. అదనపు బరువుని తగ్గించుకోవచ్చు.

దోసకాయ, పైనాపిల్

పైనాపిల్, దోసకాయను రెండింటినీ బ్లెండర్ లో మిక్సీలో వేయాలి. తర్వాత 2టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్ మిక్స్ చేసి.. నీటిలో కలిపి తాగాలి. భోజనానికి గంట ముందు తాగడం వల్ల హెల్తీగా బరువు తగ్గవచ్చు.

అలోవెరా, తేనె

2టీస్పూన్ల తేనె, 2టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్ మిక్స్ చేయాలి. రెండింటినీ బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని రోజుకి రెండుసార్లు తాగితే.. బరువు తగ్గే ప్రాసెస్ చాలా వేగంగా జరుగుతుంది.

అలోవెరా, గ్రీన్ టీ

ఈ ఎఫెక్టివ్ డ్రింక్ బరువు తగ్గడానికి సహాయపడుతుంది. టీ స్పూన్ తాజా అలోవెరా జెల్ ని ఒక కప్పు గ్రీన్ టీలో మిక్స్ చేయాలి. బాగా కలుపుకుని తాగాలి. రోజులో రెండుసార్లు ఈ టీ తాగితే.. తేలికగా బరువు తగ్గవచ్చు.

అల్లం

అలోవెరా జెల్, అల్లంని రెండు రకాలుగా ఉపయోగించి బరువు తగ్గవచ్చు. ఒక టీస్పూన్ అలోవెరా జెల్ ని ఒక కప్పు అల్లం టీలో మిక్స్ చేసి రోజుకి ఒకసారి తాగవచ్చు. లేదా అల్లం, అలోవెరా జెల్ తో జ్యూస్ తయారు చేసుకుని రోజంతా తాగవచ్చు. ఈ రెండింటిలో ఎలా వీలైతే అలా డ్రింక్ తాగితే.. బరువు తేలికగా తగ్గవచ్చు.

" కంపేర్ & బై " బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్

English summary

Ways To Use Aloe Vera For Weight Loss

Ways To Use Aloe Vera For Weight Loss. Aloe vera is an effective plant that can definitely help aid weight loss goals as well. Read here to know more about the ways you can aloe vera for weight loss.
Please Wait while comments are loading...
Subscribe Newsletter