For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎఫెక్టివ్ గా బరువు తగ్గించడానికి అద్భుత హోం రెమెడీ : కొబ్బరి నూనె

అధిక బరువు, స్థూలకాయం సమస్య నేడు అనేక మందిని వేధిస్తోంది. మనం బరువు పెరగటం మొదలైందంటే దానితో పాటుగా అనేక రకాలైన అనారోగ్య సమస్యలు మనల్ని వెంటాడతాయి. అందుకనే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు తమ శరీర బరువును తగ్గ

|

అధిక బరువు, స్థూలకాయం సమస్య నేడు అనేక మందిని వేధిస్తోంది. మనం బరువు పెరగటం మొదలైందంటే దానితో పాటుగా అనేక రకాలైన అనారోగ్య సమస్యలు మనల్ని వెంటాడతాయి. అందుకనే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు తమ శరీర బరువును తగ్గించుకోవటానికి అనేక రకాలైన ప్రయత్నాలు చేస్తుంటారు. ఐతే నేటి ఉరుకుల పరుగల జీవన శైలి లో ఎన్నో మార్పులు రావటం దానితో పాటుగా వాతావరణం లో మార్పులు మరియు అనేక రకాలైన ఆహారపదార్ధాలు, తక్కువ శారీరకశ్రమ వీటన్నిటి కారణం గా మనకి తెలియ కుండానే మన శరీరం లో అదనపు కొవ్వులు చేరడం తద్వారా అదనపు బరువు పెరగటం జరుగుతుంది.

మనలో చాలా మంది మాటల మధ్య ఎక్కువగా బరువు తగ్గించే చిట్కాల గురించి మాట్లాడుకుంటూ ఉంటాము, కానీ, ఎవరు బరువు తగ్గించుటలో నూనెల గురించి మరియు వాటి ప్రాముఖ్యతల గురించి చర్చించరు. కానీ, శరీర బరువు తగ్గించుటలో కొబ్బరి నూనె సహాయపడుతుందని మరియు ఇదే నిజం అని నిపుణులు నమ్ముతున్నారు. కొబ్బరి నూనె అన్ని దేశాల వారు, ముఖ్యంగా శరీర బరువు తగ్గించుటలో వాడుతున్నారు. ఆహార పదార్ధాలలో కొబ్బరినునె ని ఉపయోగించడం అనేది పూర్వం నుండి వస్తున్న అలవాటే.

10 Reasons You Should Eat Coconut Oil For Weight Loss

కొబ్బరినూనె ని ఉపయోగించటం వలన అనేక రకాలైన ఉపయోగాలను పొందడమే కాకుండా బరువు తగ్గటం లో ఇది ఎంతగానో సహాయపడుతుంది అని నిర్దారించపడింది. మనం వాడే అన్ని రకాల వంట నూనెల్లో మన జీవక్రియకు సహాయపడే ఫ్యాటి ఆసిడ్స్ కలిగి ఉంటాయి. కాగా కొబ్బరి నూనె మినహా మిగతా వంట నునెల్లో "లాంగ్ చైన్ ఫ్యాటి ఆసిడ్స్" కలిగి ఉండగా కొబ్బరి నూనె లో మాత్రం "మీడియం చైన్ ఫ్యాటి ఆసిడ్స్" కలిగి ఉంటుంది. కొబ్బరి నూనె బరువు ఎలా తగ్గిస్తుందో తెలుసుకుందాం..

జీర్ణవ్యవస్థ మీద ఎఫెక్టివ్ గా ప్రభావం చూపుతుంది:

జీర్ణవ్యవస్థ మీద ఎఫెక్టివ్ గా ప్రభావం చూపుతుంది:

అనేక మంది పై జరుపబడిన పరిశోధనల ప్రకారం మీ ఆహారం లో కొబ్బరి నూనె చేర్చడం ద్వారా మీ పొట్ట మరియు ఇతర శరీర భాగాలల్లో పోగుబడే ప్రమాదకరమైన కొవ్వును నివారించడం లో సహాయపడతాయని నిరుపించబడింది. దీనికి కారణం లాంగ్ చైన్ ఫ్యాటి ఆసిడ్స్, మీడియం చైన్ ఫ్యాటి ఆసిడ్స్ మధ్య జీర్ణక్రియ బిన్నంగా జరగటం. జీర్ణక్రియ లో ఈ మీడియం చైన్ ఫ్యాటి ఆసిడ్స్ నేరుగా కాలేయానికి పంపబడి, శక్తిగా కాని లేదా జీవక్రియకు సహకరించే కీటోన్స్ గా మారటం జరుగుతుంది. తద్వారా కొవ్వు పదార్ధాలు మన గుండె కు గాని మన శరీరానికి కాని పట్టకుండా శరీరం లోని అధిక కొలెస్త్రోల్ ను కరిగించి బరువు తగ్గే విధంగా చేస్తుంది.

కొబ్బరి నూనె శక్తిని పెంచుతుంది

కొబ్బరి నూనె శక్తిని పెంచుతుంది

కొబ్బరి నూనె మాధ్యమిక ట్రైగ్లిసరైడ్ ల్యూరిక్ ఆసిడ్ చైన్ లతో నిర్మించబడింది, ఇతర సాచురేటేడ్ ఫాటీ ఆసిడ్ లతో పోలిస్తే ఈ రకమైన ఫాటీ ఆసిడ్ లు విభిన్న మార్గాల (మాంసం మరియు పాల ఉత్పత్తులలో ఉన్న ఫాటీ ఆసిడ్ ల వలే) ద్వారా జీవక్రియను ప్రేరేపిస్తాయి. ఫలితంగా, శరీరంలో కొవ్వు పదార్థాలగా నిల్వ ఉంచబడవు కానీ, ఇవి కాలేయానికి పంపబడి, శక్తిగా మార్చబడి, వ్యాయామాలు, పనులు నిర్వహించటానికి ఉపయోగపడి, శరీర బరువును తగ్గిస్తాయి. కావున, ఆహార పదార్థాలలో రోజు 2 నుండి 3 చెంచాల పాటు వాడటం మంచిది.

కొబ్బరి నూనె ఆకలిని నియంత్రిస్తుంది

కొబ్బరి నూనె ఆకలిని నియంత్రిస్తుంది

కొవ్వు పదార్థాలు కాలేయానికి చేర్చబడి, శక్తి రూపంలోకి మార్చబడుందని పైన పేర్కొనబడింది, కొవ్వు పదార్థాలు ఈ విధంగా మారే పూర్తి ప్రక్రియలో "కీటోన్ బాడీ"లు ఉత్పత్తి అవుతాయి. ఇవి ఆకలిని మరియు ఆహార కోరికలను అణచి వేస్తాయి. రెండు లేదా మూడు చెంచాల కొబ్బరి నూనెను ఆహారంలో ఉపయోగించటం వలన వారం రోజులలో స్నాక్స్ తినటానికి దూరంగా ఉంటారు.

కొబ్బరి నూనె వేగంగా కొవ్వును తగ్గిస్తుంది

కొబ్బరి నూనె వేగంగా కొవ్వును తగ్గిస్తుంది

రోజు తీసుకునే క్యాలోరీల సంఖ్యను తగ్గించటం వలన శరీర బరువు తగ్గుతారు, దీని కోసం కొబ్బరి నూనె తీసుకోవటం క్షేమం అని చెప్పవచ్చు. రోజు పాటించే ఆహార ప్రణాళికలలో కొబ్బరి నూనెను వాడటం వలన ఆరోగ్యానికి ఎలాంటి నష్టం కలగకుండా, తీసుకునే క్యాలోరీలు తగ్గించబడటమేకాకుండా, క్యాలోరీల వినియోగాన్ని పెంచిన వారవుతారు. ఈ పద్దతుల వలన శరీరం ఆహారాన్ని జీర్ణం చెందించటమేకాకుండా, పోషకాలను గ్రహించి, ఆకలిని నియంత్రించి మరియు జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తాయి.

కొబ్బరి నూనె హార్మోన్ల స్థాయిలను సమతుల్య పరుస్తుంది

కొబ్బరి నూనె హార్మోన్ల స్థాయిలను సమతుల్య పరుస్తుంది

శరీర హార్మోన్ల స్థాయిల అసమతుల్యత వలన చాలా మందిలో శరీర బరువు పెరగటం మనం గమనిస్తుంటాము. హార్మోన్ల అసమతుల్యతల వలన థైరాయిడ్ గ్రంధి యొక్క విధిలో లోపాలు ఏర్పడి, మానసిక కల్లోలాలు, జీర్ణాశయం ముఖ్యంగా జీవక్రియలో అవాంతరాలు ఏర్పడతాయి. కొబ్బరి నూనెలో ఉండే కొవ్వు పదార్థాలు హార్మోన్ల స్థాయిలను స్థిమితంగా ఉంచి, మానసిక కల్లోలాలను కలగకుండా చేసి, అన్ని విధాల ఆరోగ్యాన్ని పెంచుతుంది. కొబ్బరి నూనె, శరీర హార్మోన్లలో కలిగే అసమతుల్యతలను నియంత్రించి, శరీర బరువు తగ్గుటను ప్రోత్సహించి, లక్ష్య చేదనకు సహాయపడుతుంది.

టైప్‌ 2 మధుమేహం అదుపు చేయొచ్చు

టైప్‌ 2 మధుమేహం అదుపు చేయొచ్చు

శరీరాన్ని ఇన్సులిన్‌ ప్రభావం నుంచి రక్షించి టైప్‌ 2 డయాబెటిస్‌కు గురికాకుండా నియంత్రిస్తుందని పరిశోధనల్లో తేలింది. కొబ్బరి నూనెలోని మీడియం చైన్‌ శ్యాచురేటెడ్‌ ఫ్యాటీ యాసిడ్లు కణాల్లోకి తేలికగా ఇంకిపోయి అతి తక్కువ సమయంలో శక్తిగా మారతాయి. ఈ తత్వం కారణంగా కొబ్బరి నూనెలోని కొవ్వు శరీరంలో పేరుకోకపోగా ఇన్సులిన్‌ ప్రభావానికి గురికాకుండా శరీరానికి రక్షణగా నిలుస్తుంది.

రోగ నిరోధకశక్తి పెంచుతుంది

రోగ నిరోధకశక్తి పెంచుతుంది

కొబ్బరినూనెలో లారిక్‌, కాప్రిలిక్‌, కాప్రిక్‌ యాసిడ్లు ఉంటాయి. ఇవి శరీర రోగనిరోధక శక్తిని పెంచి బ్యాక్టీరియా, ఫంగల్‌, వైరల్‌ ఇన్‌ఫెక్షన్లకు గురికాకుండా రక్షణ కల్పిస్తాయి. ఒకవేళ అలాంటి ఇన్‌ఫెక్షన్లకు గురైతే కొబ్బరి నూనెను ఆహారంలో చేర్చుకుని వాటి నుంచి త్వరగా కోలుకోవచ్చు. కొబ్బరినూనెలోని లారిక్‌ యాసిడ్‌లో 75 ు మీడియం చైన్‌ శ్యాచురేటెడ్‌ ఫ్యాట్స్‌ ఉంటాయి. ఈ కొవ్వు శరీరంలోకి చేరుకోగానే మోనోలారిన్‌గా మారి హెర్పిస్‌, ఇన్‌ఫ్లూయెంజా, సైటోమెగాలోవైరస్‌, హెలికోబాక్టర్‌పైలోరీ, క్యాండిడా మొదలైన వైరల్‌ వ్యాధుల నుంచి త్వరగా కోలుకోవటానికి సహాయపడుతుంది.

మెటబాలిజం పెరుగుతుంది

మెటబాలిజం పెరుగుతుంది

రోజుకి రెండు టేబుల్‌స్పూన్ల కొబ్బరినూనె తీసుకునేవాళ్లలో అంతకంటే తక్కువ నూనె తీసుకునేవాళ్లకంటే ఎక్కువ క్యాలరీలు ఖర్చవుతున్నట్టు పరిశోధనల్లో తేలింది. శక్తి ఖర్చయ్యే వేగమైన మెటబాలిజం పెరిగి తద్వారా శరీర బరువు అదుపులో ఉండాలంటే ప్రతిరోజూ కొబ్బరి నూనె ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.

స్వీట్ల మీదకు మనసు మళ్లకుండా

స్వీట్ల మీదకు మనసు మళ్లకుండా

తరచుగా ఆకలి వేస్తుందంటే మనం సరైన ఆహారాన్ని తినట్లేదని అర్థం. తగిన పరిమాణాల్లోని కొవ్వు, పిండి పదార్థాలు తీసుకుని శక్తి నిల్వలను పెంచుకోగలిగితే ఈ సమస్య ఉండదు. కానీ ఈ పోషకాల పరిమాణాల మీద దృష్టి పెట్టకపోవటం మూలంగా మనకు తరచుగా తీపి పదార్థాలు తినాలనే కోరిక కలుగుతూ ఉంటుంది. అలా అనిపించినప్పుడు స్వీట్లకు బదులుగా ఒక టీస్పూను స్వచ్ఛమైన కొబ్బరి నూనె తాగి చూడండి. తీపి తిన్న సంతృప్తి కలగటంతోపాటు ఆకలి అదుపులోకొస్తుంది. దాంతో అధిక బరువు సమస్య ఉండదు.

వేపుళ్లకు కొబ్బరి నూనె మేలు

వేపుళ్లకు కొబ్బరి నూనె మేలు

నూనెలను ఎక్కువగా వేడి చేసినప్పుడు అవి గాలిలోని ఆక్సిజన్‌తో కలిసి ఆక్సిడైజ్‌ అవుతాయి. దాంతో ఆ నూనెల్లో ఫ్రీ ర్యాడికల్స్‌ ఉత్పత్తవుతాయి. ఆరోగ్యానికి హాని కలిగించే ఇలాంటి ఫ్రీ ర్యాడికల్స్‌కు దూరంగా ఉండాలంటే ఎక్కువ ఉష్ణోగ్రతకు గురైనా చెక్కుచెదరకుండా ఉండే కొబ్బరినూనెనే వాడాలి. కాబట్టి ఇకముందు వేపుడు వంటకాలకు కొబ్బరి నూనెను వాడండి.

English summary

10 Reasons You Should Eat Coconut Oil For Weight Loss

Sticking to natural remedies is the best way to lose weight in a healthy way. Certain ingredients have great qualities of reducing the body's weight when consumed. Coconut oil is one of the best remedies that can be used to shed body weight. Coconut oil is not only good for the skin and hair, but also works wonders for health.
Desktop Bottom Promotion