For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆయుర్వేదం ప్రకారం ఈ ఆహారాలు బ్యాక్ పెయిన్ వేగంగా తగ్గిస్తాయి..

|

ఆయుర్ అంటే జీవం లేదా జీవితం. వేద అంటే జ్ఝానం. ఆయుర్వేదం అంటే సైన్స్ లేదా జీవితం గురించి తెలిసి ఉండటం. ఈ ఆయుర్వేదం ఇప్పటిది కాదు కొన్ని వేల సంవత్సరాల నాటిది. మన ఇండియాలో 2000వేలపైన సంవత్సరాల నుండి ప్రాక్టీస్ చేస్తున్నారు.

వాత, పిత్త, మరియు కఫ ఈ మూడింటిని శరీరంలో దోషాలు అంటారు. మానవుని ఆరోగ్యం వీటి మూడింటి మీదే ఆధారపడి ఉంటుంది. శరీరంలో జరిగే మార్పులు, వ్యాధులు ఈ మూడు దోషాల మీదే ఆధారపడి ఉంటుంది.

అదే విధంగా బ్యాక్ పెయిన్ కూడా. వెన్ను నొప్పి అనేది ఈ మద్య కాలంలో సహజం. ఆయుర్వేదం ప్రకారం వెన్నునొప్పిని వాతం అని అంటారు. వెన్ను నొప్పికి వివిధ కారణాలున్నాయి. ఓవర్ వెయింట్ ఉండటం, ఆర్థ్రైటిస్, ఫిజికల్ యాక్టివిటీస్, వైరల్ ఇన్ఫెక్షన్స్, ట్యూమర్స్ కారణం అవుతాయి.

బ్యాక్ పెయిన్ ను నివారించుకోవాలంటే కొన్ని ఆహారాలను రెగ్యులర్ గా తింటే మంచి ఫలితం ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం,మంచి ఆహారం, రెగ్యులర్ వ్యాయామంతోనే బ్యాక్ పెయిన్ తగ్గించుకోవచ్చు. మరి అటువంటి హెల్తీ ఫుడ్స్ గురించి మనం తప్పనిసరిగా తెలుసుకోవడం మంచిది...

పసుపు:

పసుపు:

పసుపులో యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు, కుర్కుమిన్ ఉంటుంది. ఇది టిష్యులన్ డిష్ట్రక్ చేస్తుంది. ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. ఇది నాడీవ్యవస్థ ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. కాబట్టి పసుపురెగ్యులర్ వంటల్లో తప్పనిసరిగా ఉపయోగించాలి.

ఫైబర్ రిచ్ ఫుడ్స్:

ఫైబర్ రిచ్ ఫుడ్స్:

ఫైబర్ అధికంగా ఉన్న లైట్ ఫుడ్స్ తినడం వల్ల గ్యాస్ట్ర్రిక్ , మలబద్దకం, బ్యాక్ పెయిన్ వంటి సమస్యలన్నీ నివారించబడుతాయి. అలాగే మలబద్దకానికి కారణమయ్యే ఆహారాలను తీసుకోవాలి. అలాగే నీళ్ళలో త్రిఫల పౌైడర్ మిక్స్ చేసి తీసుకోవాలి.

మసాలా టీ:

మసాలా టీ:

ఆయుర్వేదం ప్రకారం బిషాప్స్ వీడ్ సీడ్స్ తో తయారుచేసిన టీ తాగితే ఆరోగ్యానికి ఎక్కువ ప్రయోజనం. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు నొప్పిని తగ్గించడంలోగొప్పగా సహాయపడుతాయి. అలాగే చమోమెలీ టీ , జాస్మిన్ టీ కూడా గ్రేట్ గా సహాయపడుతుంది.

వెల్లుల్లి:

వెల్లుల్లి:

వెల్లుల్లి పెయిన్ రిలీఫ్ గా పనిచేస్తుంది. కొబ్బరి నూనెలో రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు వేసి ఫ్రై చేసి, నొప్పి ఉన్న ప్రదేశంలో అప్లై చేసి మసాజ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపడుతుంది. కండరాలు వదులౌవుతాయి. నొప్పి తగ్గుతుంది.

డైరీ ప్రొడక్ట్స్ :

డైరీ ప్రొడక్ట్స్ :

వెన్నెముక స్ట్రాంగ్ గా, హెల్తీగా ఉండాలంటే క్యాల్షియం, విటమిన్ డి ఎక్కువగా ఉన్న ఆహారాలను తీసుకోవాలి. డైరీ ప్రొడక్ట్స్ లో క్యాల్షియం అధికంగా ఉంటుంది. క్యాల్షియం, విటమిన్ డి కాంబినేషన్ ఎముకలను స్ట్రాంగ్ గా ఉంచుతుంది. బ్యాక్ పెయిన్ తగ్గిస్తుంది.

అల్లం:

అల్లం:

అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉన్నాయి. నయం చేసే గుణాలను కూడా అధికంగా ఉండటం వల్ల దీన్ని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల వెన్ను నొప్పి నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. అల్లం టీ, వెజిటేబుల్ జ్యూస్ ను తీసుకోవడం మంచిది.

కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి..

ఆయుర్వేదం ప్రకారం పైన సూచించిన ఆహారాలు బ్యాక్ పెయిన్ తగ్గించడంలో గొప్పగా సహాయపడుతాయి. అదే విధంగా కొన్ని ఆహారాలకు దూరంగా ఉండటం వల్ల బ్యాక్ పెయిన్ తగ్గుతుంది. కొన్ని రకాల త్రుణధాన్యాలు, షుగర్ ఫుడ్ కు దూరంగా ఉండాలి.

వీటి వల్ల శరీరంలో లెఫ్టిల్ , ఇన్సులిన్ లెవల్స్ ను పెరగడం వల్ల ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది. రాజ్మా, ఉద్దిపప్పు, లేడీస్ ఫింగర్, కఢి ఫుడ్స్ కు దూరంగా ఉండాలి.

English summary

Diet To Prevent Back Pain According To Ayurveda

Back pain can be troublesome. Learn how to prevent back pain with ayurveda here.
Desktop Bottom Promotion