For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వేగంగా బరువు తగ్గించుకోవడానికి దాల్చిన చెక్కను ఉపయోగించే సింపుల్ మార్గాలు..!

బరువు తగ్గించుకోవడానికి దాల్చిన చెక్కను మీరెప్పుడైనా ప్రయత్నించారా? బరువు తగ్గించడంలో దాల్చిన చెక్క ఒక సూపర్ డూపర్ స్పైస్(మసాలా దినుసు).

|

బరువు తగ్గించుకోవడానికి దాల్చిన చెక్కను మీరెప్పుడైనా ప్రయత్నించారా? బరువు తగ్గించడంలో దాల్చిన చెక్క ఒక సూపర్ డూపర్ స్పైస్(మసాలా దినుసు). ఈ మ్యాజికల్ స్పైస్ ను డైలీ డైట్ లో చేర్చుకుంటే తప్పకుండా కొన్ని కిలలో బరువును తగ్గించుకోవచ్చు.

మీరు డైలీ తిసుకోనే ఆహారంలో దాల్చిన చెక్కను చేర్చుకోవడం చాలా అవసరం మరియు ముఖ్యం కూడా. బరువు తగ్గాలనుకొన్నప్పుడు, ఇటువంటి ఆహారాలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల వేగంగా బరువు తగ్గడాన్ని బాగా సహాయపడుతాయి. బరువు తగ్గాలనుకొనే వారికి దాల్చిన చెక్క ఫర్ఫెక్ట్ పదార్థం.

Different Ways To Use Cinnamon For Weight Loss

బరువు తగ్గించుకోవడంలో అతి తక్కువ క్యాలరీలు కలిగిన తేనెను కొన్ని సంవత్సరాలను ఉపయోగిస్తున్నారు. ఉదయం తేనె మరియు నిమ్మరసం రెండింటి మిశ్రంతో గోరువెచ్చని నీరు త్రాగేవారు, అలాగే కొద్దిగా తేనె కూడా వారి బ్రేక్ ఫాస్ట్ లో చేర్చుకుంటే బరువు తగ్గడానికి అద్భతంగా పనిచేస్తాయి. అలాగే దాల్చిన చెక్క కూడా బరువు తగ్గించడంలో చాలా అద్భుతంగా సహాయపడుతాయి. అందుకే దాల్చిన చెక్క మరియు తేనెను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం చాలా అవసరం.

దాల్చిన చెక్క శరీరంలో కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తుంది. ఆకలి తగ్గిస్తుంది. బ్లడ్ షుగర్ లెవల్స్ ను క్రమబద్దం చేస్తుంది. మెటబాలిజం రేటును పెంచుతుంది. ఎక్స్ ట్రా ఫ్యాట్ తగ్గిస్తుంది. కాబట్టి, కొన్ని సింపుల్ చిట్కాలతో బరువును తగ్గించుకోవడానికి దాల్చిన చెక్కను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం..

దాల్చిన చెక్క పౌడర్ మిక్స్ చేసిన నీటిని తాగాలి:

దాల్చిన చెక్క పౌడర్ మిక్స్ చేసిన నీటిని తాగాలి:

రోజులో ఈ నీటిని ఎప్పుడైనా తాగొచ్చి. బరువు తగ్గించుకోవాలని కోరుకునే వారు దాల్చిన చెక్క లేదా పౌడర్ ను నీటిలో వేసి బాయిల్ చేయాలి. ఈ వాటర్ ను రోజులో ఎప్పుడైనా తాగొచ్చు. అయితే ఉదయం తాగితే ఫలితం ఎఫెక్టివ్ గా ఉంటుంది. బరువు తగ్గుతారు.

కాఫీలో దాల్చిన చెక్క పౌడర్ :

కాఫీలో దాల్చిన చెక్క పౌడర్ :

బరువు తగ్గించడంలో ఎఫెక్టివ్ హోం రెమెడీ. కాఫీలో కూడా దాల్చిన చెక్క పౌడర్ మిక్స్ చేసి తాగడం వల్ల ఓవర్ వెయిట్ ను తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. .పంచదారకు బదులుగా దాల్చిన చెక్క పౌడర్ ను జోడించాలి. అలాగే తేనె కూడా మిక్స్ చేసుకోవచ్చు.

 లెమన్, హనీ, దాల్చిన చెక్క కాంబినేషన్ :

లెమన్, హనీ, దాల్చిన చెక్క కాంబినేషన్ :

దినచర్యను లెమన్ , హానీ, దాల్చిన చెక్క కాంబినేషన్ వాటర్ తో ప్రారంభిస్తే వేగంగా బరువును తగ్గించుకోవచ్చు. హనీ, లెమన్ పవర్ ఫుల్ కాంబినేషన్ . బరువు తగ్గించడంలో ఈ కాంబినేషన్ గ్రేట్ గా సహాయపడుతుంది. అంతే కాదు, అదనపు ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. అవసరమైతే పుదీనా ఆకులను చేర్చి మంచి రిఫ్రెషింగ్ ఫ్లేవర్ తో తాగొచ్చు.

స్మూతీస్ లో కూడా దాల్చిన చెక్క పౌడర్ ను మిక్స్ చేసుకోవచ్చు.

స్మూతీస్ లో కూడా దాల్చిన చెక్క పౌడర్ ను మిక్స్ చేసుకోవచ్చు.

దాల్చిన చెక్క పౌడర్ ను స్మూతీస్ లో చేర్చుకుని తాగొచ్చు. స్మూతీస్ కోసం మీకు నచ్చిన ఫ్రూట్స్ ను ఎంపిక చేసుకోవాలి. వర్కౌట్స్ చేసిన తర్వాత ఈ స్మూతీస్ తాగడం వల్ల మీరు అనుకున్న ఫలితాలను పొందుతారు.

ఓట్స్ తో కలిపి తినవచ్చు:

ఓట్స్ తో కలిపి తినవచ్చు:

దినచర్య ప్రారంభానికి బ్రేక్ ఫాస్ట్ కూడా చాలా ముఖ్యం. ఓట్స్ అదనపు బరువును తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఫ్యాట్ కరిగించడంలో గొప్పగా సహాయపడుతుంది.జ. ఓట్స్ తో డబుల్ బెనిఫిట్స్ ఉంటాయి. ఓట్స్ పౌడర్ లో దాల్చిన చెక్క పౌడర్ కలిపి తినడం వల్ల జీర్ణక్రియను వేగవంతం చేసపి, ఎక్సట్రా ఫ్యాట్ ను కరిగిస్తుంది.

వంటల్లో చేర్చాలి:

వంటల్లో చేర్చాలి:

మరో సింపుల్ మార్గం. దాల్చిన చెక్కను రెగ్యులర్ డైట్ లో చేర్చడం మంచిది. రెగ్యులర్ గా వండే వంటల్లో దాల్చిన చెక్కను కానీ, పౌడర్ ను కానీ చేర్చడం వల్ల వంటలకు మంచి ఫ్లేవర్, టేస్ట్ తో పాటు, ప్రయోజనాలను కూడా అందిస్తుంది. దాల్చిన చెక్కలో ఉండే స్వీట్నెస్ వల్ల వంటలకు మంచి రుచి కూడా అందుతుంది.

ప్రోటీన్ షేక్స్ లో జోడించుకోవాలి:

ప్రోటీన్ షేక్స్ లో జోడించుకోవాలి:

ప్రోటీన్ షేక్స్ ను ఇష్టపడే వారైతే వెంటనే ఈ ప్రోటీన్ షేక్స్ కు 2, 3 టీస్పూన్ల దాల్చిన చెక్క పౌడర్ ను మిక్స్ చేసి, షేక్ చేసి తాగాలి. ఇలా రెగ్యులర్ గా దాల్చిన చెక్కను మీకు నచ్చిన రూపంలో ఉపయోగిస్తుంటే శరీరంలో ఫ్యాట్ కరిగి అదనపు క్యాలరీలను తగ్గించుకోవడం ఖాయం.

English summary

Different Ways To Use Cinnamon For Weight Loss

If you want to know the differnt ways to consume cinnamon for weight loss then you need to read this article.
Story first published: Monday, January 30, 2017, 17:17 [IST]
Desktop Bottom Promotion