For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అలర్ట్: ఎఫెక్టివ్ గా బరువు తగ్గించే సీక్రెట్ టీ : దాల్చిన చెక్క టీ

బరువు తగ్గించుకోవడానికి దాల్చిన చెక్కను మీరెప్పుడైనా ప్రయత్నించారా? బరువు తగ్గించడంలో దాల్చిన చెక్క ఒక సూపర్ డూపర్ స్పైస్(మసాలా దినుసు).

|

దాల్చిన చెక్కను అద్భుతమైన స్పైస్ గా పరిగణిస్తారు. ఎందుకంటే.. ఇందులో అనేక హెల్త్, బ్యూటీ బెన్ఫిట్స్ ఉన్నాయి. పాక శాస్త్రంలో చాలా పవర్ ఫుల్ అండ్ ఫేమస్ దినుసు ఇది. స్వీట్స్, ఇతర రకాల ఆహారాల్లో దీన్ని ఉపయోగిస్తారు. ఆహారాల్లో అద్భుతమైన రుచిని అందించే దీనిలో దాగున్న ఆరోగ్య రహస్యాలు అన్నీ ఇన్నీ కావు.

వంటకాల్లో సువాసన కోసం వాడే దాల్చిన చెక్క మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కొంచెం వ‌గ‌రుగా, ఘాటుగా, కొంచెం తియ్య‌గా ఉండే దాల్చిన చెక్క‌లో ఎన్నో రోగాల‌ను న‌యం చేసే ఎన్నో సుగుణాలున్నాయి. జ‌లుబు, ద‌గ్గు నుంచి గుండె స‌మ‌స్య‌ల‌కు వ‌ర‌కు అన్నిటికీ చెక్ పెట్టే స‌త్తా చెక్క‌లో ఉంది. దాల్చిన చెక్కతో తయారుచేసిన టీ తాగడం వల్ల బరువు కూడా తగ్గించుకోవచ్చంటే ఆశ్చర్యం కలగక మానదు?

The Correct Way To Prepare Cinnamon Tea To Lose Weight

దాల్చిన చెక్కలో కరిగిపోయే పీచుతో పాటు ఇనుము, క్యాల్షియం, మాంగనీస్‌, సి,కె, విటమిన్లు లభి స్తాయి. ఇందులో ఉండే యాంటీమై క్రోబయల్‌ సుగుణాలు ఆహారాన్ని ఎక్కువసేపు తాజాగా ఉంచుతాయి. దాల్చిన చెక్క పాల ఆరోగ్య ప్రయోజనాలను కొన్ని ఏళ్లుగా నిపుణులు స్టడీ చేస్తున్నారు. బరువు తగ్గించుకునే క్రమంలో దాల్చిన చెక్కను వివిధ రకాలుగా ఉపయోగిస్తుంటారు. అయితే సరైన పద్ధతిలో దీన్ని ఉపయోగించడం వల్ల తప్పకుండా బరువు తగ్గించుకోగలుగుతారు. ఇది బాడీ మెటబాలిక్ రేటు పెంచి బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

బరువు తగ్గించుకునే క్రమంలో గ్లిజమిక్ ఇండెక్స్ రేటు పట్ల జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ఇది సెడెన్ గా ఇన్సులిన్ తగ్గిపోవడానికి కారణమవుతుంది. ఈ సినామిన్ టీలో క్యాలరీలుండవు, లోక్యాలరీల వల్ల రోజుకు ఒక కప్పు దాల్చిన చెక్క టీ తాగడం వల్ల కేవలం 2 క్యాలరీలు మాత్రమే శరీరానికి అందుతాయి. కాబట్టి బరువు తగ్గడానికి ఇది ఒక బెస్ట్ డ్రింక్ . మరి బరువు తగ్గించుకోవడానికి ఎలా తయారుచేయాలి, ఏవిధంగా ఉపయోగించాలో తెలుసుకుందాం..

కావల్సినవి:

కావల్సినవి:

వాటర్ : 1 లీటర్ దాల్చిన చెక్క పౌడర్ 5 టీస్పూన్స్ ఒక టీస్పూన్ తేనె

తయారుచేయు విధానం:

తయారుచేయు విధానం:

ఒక గిన్నెలో నీళ్ళు పోసి బాగా మరిగించాలి. తర్వాత అందులో దాల్చిన చెక్క పౌడర్ వేసి మరికొద్దిసేపు మరిగించాలి. తర్వాత క్రిందికి దింపుకుని, గోరువెచ్చగా చల్లారిన తర్వాత అందులో ఒక టీస్పూన్ తేనె మిక్స్ చేయాలి. ఈ కాంబినేషన్ డ్రింక్ బరువు తగ్గడానికి గ్రేట్ గా సహాయపడుతుంది.

ఎంత తీసుకోవాలి:

ఎంత తీసుకోవాలి:

రోజుకు 3 కప్పుల టీని ఉదయం, మద్యహ్నానం , రాత్రి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. వేడిగా లేదా చల్లగా కూడా తీసుకోవచ్చు.

దాల్చిన చెక్క టీతో ఇతర ప్రయోజనాలు:

దాల్చిన చెక్క టీతో ఇతర ప్రయోజనాలు:

దాల్చిన చెక్క టీ తాగడం వల్ల బరువు తగ్గడం మాత్రమే కాదు, ప్రేగులను శుభ్రం చేస్తుంది. కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది, బ్లడ్ లో గ్లూకోజ్ లెవల్స్ ను తగ్గిస్తుంది. మొత్తం ప్రొసెస్ లో బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

తేనెతో ప్రయోజనాలు:

తేనెతో ప్రయోజనాలు:

తేనెలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇది బాడీ మెటబలైజ్ చేస్తుంది. శరీరానికి కావల్సిన ఎనర్జీని అందిస్తుంది. ఫ్యాట్ కరిగిస్తుంది ,

సూచన:

సూచన:

అల్సర్ పేషంట్స్ ఈ టీ తాగకూడదు. అలాగే గర్భిణీలు, పాలిచ్చే తల్లులు కూడా ఈ సినామిన్ టీ తాగకూడదు.

English summary

The Correct Way To Prepare Cinnamon Tea To Lose Weight

Did you know that cinnamon tea helps with weight loss? Read this article to know how to make cinnamon tea.
Story first published: Monday, February 6, 2017, 18:35 [IST]
Desktop Bottom Promotion