For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వేగంగా.. క్యాలరీలను కరిగించి బరువు తగ్గించి, బాడీని స్లిమ్ గా మర్చే సూపర్ ఫుడ్స్ ..!!

అందంగా స్లిమ్ గా కనిపించాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది. అలాంటి కోరికను నెరవేర్చుకోవడానికి , వేగంగా బరువు తగ్గించుకోవడానికి ఆ ఆర్టికల్ మీకు సహాయపడుతుంది. కొన్ని ఆహారాలు రెగ్యులర్ గా తినడం వల్ల శరీరంను

|

అందంగా స్లిమ్ గా కనిపించాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది. అలాంటి కోరికను నెరవేర్చుకోవడానికి , వేగంగా బరువు తగ్గించుకోవడానికి ఆ ఆర్టికల్ మీకు సహాయపడుతుంది. కొన్ని ఆహారాలు రెగ్యులర్ గా తినడం వల్ల శరీరంను ఆరోగ్యంగా ఉంచడం మాత్రమే కాదు, ఇవి బరువు తగ్గించడంలో కూడా గొప్పగా సహాయపడుతాయి.

అందుకు చేయాల్సిందల్లా, అదనపు పౌండ్ల బరువును తగ్గించడంతో పాటు అనేక పౌండ్ల బరువును కరిగించడంలో సహాయపడే అటువంటి సూపర్ ఫుడ్స్ ను ఎంపికచేసుకోవాలి. అలాగే ఇవి శరీరానికి కావల్సిన పోషణను కూడా అందిస్తాయి .

అలాకాకుండా రెగ్యులర్ డైట్ లో ఎక్కువ క్యాలరీలను తీసుకోవడం వల్ల అదనపు క్యాలరీలు ఎలా బర్న్ చేస్తారు. శరీరంలో అల్రెడీ ఉన్న క్యాలరీలకు అదనపు క్యాలరీలు చేకరడంతో బరువు పెరుగుతారు . కాబట్టి, లోక్యాలరీ ఫుడ్స్ ను ఎంపిక చేసుకోవడం వల్ల ఇవి బరువు తగ్గించడంతో పాటు, క్యాలరీలను కరిగించి తిరిగి ఆహారాల మీద కోరికలు కలగకుండా చేస్తాయి. రోజంతా ఆకలి కాకుండా పొట్ట నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది.

లోక్యాలరీ ఫుడ్స్ ను ఎంపిక చేసుకునే క్రమంలో ఫైబర్ ఎక్కువగా ఉన్న వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. అలాగే హెల్తీ ఫ్యాట్స్, ప్రోటీన్స్ అధికంగా ఉన్న ఆహారాలను ఎంపిక చేసుకోవాలి. అలాగే వాటర్ కంటెంట్ అధికంగా ఉండే ఆహారాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి.

బాడీ స్లిమ్ గా కనబడాలంటే ఎలాంటి స్లిమ్ ఫుడ్స్ ను ఎంపిక చేసుకోవాలో ఈ క్రింది లిస్ట్ లో చూద్దాం...

 యాపిల్స్ :

యాపిల్స్ :

యాపిల్స్ లో విటమిన్స్, మినిరల్స్ తో పాటు, వాటర్ కంటెంట్ కూడా అధికంగా ఉంటుంది. అలాగే ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువ. అందువల్ల ఇది అటు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తూనే, బరువు కంట్రోల్ చేయడంలో గొప్పగా సహాయపడుతుంది. వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే త్వరగా బరువు తగ్గించుకోవచ్చు.

గుడ్లు :

గుడ్లు :

గుడ్లలో ప్రోటీన్ కంటెంట్ అధికంగా ఉంటుంది. వీటిని రెగ్యలర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తూనే పొట్ట నిండుగా ఉండే అనుభూతి కలిగిస్తుంది. ఎక్కువ సమయం ఆకలి కానివ్వకుండా కాపాడుతుంది.

కాలీఫ్లవర్

కాలీఫ్లవర్

కాలీఫ్లవర్ లో గంజి ఉండదు, క్యూసిఫెరస్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ లో ఫొల్లెట్ మరియు విటమిన్ సిలు అధికంగా ఉంటాయి. ఇవి బరువు తగ్గించడానికి గొప్పగా సహాయపడుతాయి .

పెరుగు :

పెరుగు :

పెరుగులో ప్రోబయోటిక్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో ఫ్యాట్ సెల్స్ నిల్వచేరకుండా అరికడుతుంది. దాంతో ఫ్యాట్ బర్నింగ్ కెపాజిటి పెరుగుతుంది.

ఓట్ మీల్ :

ఓట్ మీల్ :

ఓట్ మీల్ అల్పాహారాల్లో ఉత్తమైనది, వీటిలో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి, ఓట్ మీల్లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఓట్ మీల్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఎక్కువ సమయం ఆకలి అనిపించదు. క్రమంగా ఆహారాల మీద కోరికలను తగ్గిస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

 వేరుశెనగలు :

వేరుశెనగలు :

పీనట్స్ లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి ఫ్యాట్ బర్నింగ్ ప్రొసెస్ ను వేగవంతం చేస్తుంది. దాంతో బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

 చేపలు :

చేపలు :

చేపల్లో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. ఇది ఆహారాల పట్ల సంత్రుప్తి పరుస్తుంది. ఎక్కువ సమయం ఆకలి కానివ్వకుండా సహాయపడుతాయి. బరువు తగ్గించే బెస్ట్ ఫుడ్స్ లో చేపలు కూడా ఒకటి . చేపలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం ద్వారా వేగంగా త్వరగా బరువు తగ్గించుకోవడంతోపాటు స్లిమ్ గా తయారవ్వొచ్చు .

English summary

Top Foods That Will Help You Slim Down

Now slimming down is easy with the help of these foods that will help you lose weight quickly. Read this article to find out.
Story first published: Tuesday, January 17, 2017, 17:53 [IST]
Desktop Bottom Promotion