For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డైట్ ఫాలో అయినా బరువు తగ్గకపోవడానికి కారణాలు..!

దురదృష్టవశాత్తు చాలా మందికి వారి ఆహార ప్రణాళిక సరిగా పనిచేయటం లేదని అనిపించవచ్చు. దానికి కొన్ని సాధారణ కారణాలు ఉన్నాయి. కానీ వాటిని పట్టించుకోకుండా పూర్తిగా తిరస్కరిస్తారు. వారు దీర్ఘకాల ప్రాతిపదికన న

By Lekhaka
|

దురదృష్టవశాత్తు చాలా మందికి వారి ఆహార ప్రణాళిక సరిగా పనిచేయటం లేదని అనిపించవచ్చు. దానికి కొన్ని సాధారణ కారణాలు ఉన్నాయి. కానీ వాటిని పట్టించుకోకుండా పూర్తిగా తిరస్కరిస్తారు. వారు దీర్ఘకాల ప్రాతిపదికన నిలకడగా లేకపోవటం దీనికి కారణంగా చెప్పవచ్చు. మీ ఆహారం ప్రణాళికలో పోషకాహార వ్యూహాలు సరిగ్గా లేకపోతే, అది ఈటింగ్ డిజార్డర్స్ కి దారి తీస్తుంది.

దీర్ఘకాల ఆహార ప్రణాళిక అనేది జీవితం కోసం ఉండాలి. కానీ కేవలం కొన్ని వారాలు లేదా నెలల కోసం మాత్రం కాదు. లేకపోతే మీరు కోల్పోయిన బరువు మరల పెరుగుతారు. ఒక పరిశోధన ప్రకారం, 5 నుంచి 10 శాతం బరువు కోల్పోయిన వ్యక్తులు మరల బరువు పెరగటాన్ని గమనించారు. మీకు తినే అలవాటు సరిగా లేకపోతే ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవటం తప్పనిసరి. మీరు ఆహారంలో మార్పులు చేసే ముందు ఆహార ప్రణాళిక ఎందుకు పనిచేయటం లేదో కారణాలను అన్వేషించాలి. ఈ విధంగా పరిష్కారాన్ని కనుగొంటే బరువు కోల్పోవటానికి బాగా సహాయపడుతుంది. మీ డైట్ ప్లాన్ ఎందుకు పనిచేయటం లేదో తెలుసుకోవటానికి ఈ వ్యాసాన్ని చదవండి.

1. మీరు కావలసినంత కేలరీలను పొందటం లేదు

1. మీరు కావలసినంత కేలరీలను పొందటం లేదు

ప్రోటీన్ మరియు అసంతృప్త కొవ్వుల వంటి పోషకాల నుండి కేలరీలు పూర్తిగా అందుతాయి. సాధారణ చక్కెరల నుండి కేలరీలు వేగంగా జీర్ణం అవుతాయి. అయితే మీరు తినే ఆహార రకాన్ని బట్టి ఉంటుంది.

2. తరచుగా భోజనం మానేయటం

2. తరచుగా భోజనం మానేయటం

భోజనం మానేయటం అనేది బరువు కోల్పోవటానికి సరైన పద్దతి కాదు. చాలా ఆకలిగా ఉండుట వలన శరీరం బ్యాలన్స్ తప్పి బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

3. తినే ముందు బాగా తెలుసుకోవాలి

3. తినే ముందు బాగా తెలుసుకోవాలి

తినే ముందు ప్రతి దాని గురించి తెలుసుకొని ఉండాలి. నోటిలో చిన్న చిన్న ముక్కలు మరియు బాగా నిదానంగా నమలడం వలన వేగంగా బరువు కోల్పోవటానికి సహాయపడుతుంది.

4. ఆహారం మీద వ్యామోహం ఉండకూడదు

4. ఆహారం మీద వ్యామోహం ఉండకూడదు

అట్కిన్స్, ఆల్కలీన్ వంటి ఎక్కువ కేలరీలు ఉన్న ఆహారం మీద వ్యామోహం ఉంటే కనుక బరువు తగ్గటం చాలా కష్టం. అందువలన, ఇటువంటి ఆహార ప్రణాళికలు దీర్ఘకాలంలో పని చేయకపోవచ్చు.

5. ముందస్తు ప్రణాళిక ఉండదు

5. ముందస్తు ప్రణాళిక ఉండదు

మీ బిజీ షెడ్యూల్ లో, ఫాస్ట్ ఫుడ్స్ మరియు అల్పాహారం వంటి వాటిని ఎంచుకోవటం చాలా సులభంగా ఉంటుంది. కానీ ఇది అదనపు కేలరీలను జోడించడానికి మరియు బరువు పెరుగుటకు దారి తీస్తుంది. మొదట మీరు తినే ఆహారం మీద ప్రణాళిక ఉండటం అవసరం.

6. సరిపడ నీటిని త్రాగకుండా ఉండటం

6. సరిపడ నీటిని త్రాగకుండా ఉండటం

నీరు ఎక్కువగా త్రాగితే ఆహారం తక్కువగా తీసుకోవచ్చు. నీటిని ఎక్కువగా త్రాగితే జ్యూస్ లేదా సోడా వంటి ఇతర అనారోగ్యకరమైన ఎంపికలను వదిలించుకోవటం కొరకు సహాయపడుతుంది.

7. స్మార్ట్ షాపింగ్ చేయకపోవటం

7. స్మార్ట్ షాపింగ్ చేయకపోవటం

కిరాణా షాపింగ్ సమయంలో అనారోగ్య ఆహారాలను కొనుగోలు చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఒక జాబితాను తయారుచేసుకుంటే అనారోగ్య ఆహారాల కొనుగోలును నివారించవచ్చు.

8. కావలసినంత వ్యాయామం లేకపోవటం

8. కావలసినంత వ్యాయామం లేకపోవటం

బరువు కోల్పోవటంలో ఆహార ఎంపిక ఒక్కటే సరిపోదు. సరైన వ్యాయామం కూడా ఉండాలి. తక్కువ వ్యాయామం చేస్తే తక్కువ కేలరీలు ఖర్చు అవుతాయి. దాంతో బరువు ఎక్కువగా కోల్పోవటం జరగదు.

English summary

Top Reasons On Why Your Diet Plan Isn't Working

A long-term diet plan is for life and not just for a few weeks or months. Otherwise you'll gain back the lost weight. As per a research, it was found that people who have lost about 5% to 10% of their weight tend to gain it back.
Desktop Bottom Promotion