For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్యాన్సర్ కణాలను నాశనం చేసే 10 సూపర్ ఫుడ్స్

|

ప్రాణాంతక వ్యాధులలో, ప్రధామైన వ్యాధి ఒకటి క్యాన్సర్. స్త్రీ, పురుషులను ఇద్దరిని పట్టి పీడుస్తున్న వ్యాధి క్యాన్సర్. అంతే కాదు, ఈ ప్రాణాంతక వ్యాధి స్త్రీ, పురుషులను, పెద్దవారిని మాత్రమే కాదు పిల్లలను కూడా ప్రాణాపాయలకు గురిచేస్తున్నది. ఈ సమస్య రాకుండా ముందుజాగ్రత్తగా మనం రెగ్యులర్ గా తీసుకొనే డైట్ లో క్యాన్సర్ సెల్స్ తో స్ట్రాంగ్ గా పోరడగలిగే కొన్ని ఆహారాలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.

ఈ ప్రాణాంతక వ్యాధితో బాధపడే వారు ఈ ఆహారాలను రెగ్యులర్ గా తీసుకోవడం చాలా అవసరం. ఈ ఆహారాల్లో ప్రోటీన్స్, మరియు న్యూట్రీషియన్స్ అధికంగా ఉండి, క్యాన్సర్ తో పోరాడగలిగే వ్యాధినిరోధక శక్తిని పెంపొందిస్తుంది. ఈ ప్రాణాంతక వ్యాధి నుండి మిమ్మల్ని కాపాడుటకు సహాయపడుతాయి.

క్యాన్సర్ కణాలతో పోరాడే అటువంటి స్ట్రాంగ్ ఆహారాల్లో బ్రొకోలి మరియు కాలే వంటివి ఉత్తమ ఆహారాలుగా ఉన్నాయి. ఈ బిట్టర్ ఫుడ్స్ లో ఉన్నటువంటి గుణగణాలు క్యాన్సర్ కారక కణాలను నాశనం చేయడానికి సహాయపడుతాయి. చాలా వరకూ ఈ ఆహారాల్లో సల్ఫోరఫైన్, శరీరంలో తగినన్ని ఎంజైముల అభివృద్ధికి సహాయపడుతూ రక్షింపబడుతుంది. అంతే కాదు, ఇంకా వరీరంలో క్యాన్సర్ కు కారణం అయ్యే కెమికల్స్ ను శరీరం నుండి బయటకు నెట్టివేయబడుతుంది.

కాబట్టి, ప్రాణాంతక క్యాన్సర్ కు కారణం అయ్యే కణాలను నిర్మూలించడానికి ఈ సూపర్ ఫుడ్స్ ను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకొని, తప్పనిసరిగా క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఒకరమైన ఆహారాన్ని మాత్రమే కాకుండా, క్యాన్సర్ ను నిరోధించే వివిధ రకాల ఆహారాలను ఎంపిక చేసుకోవాలి. మరి అటువంటి ఆహారాలను ఈక్రింది స్లైడ్ ద్వారా మీకోసం అందిస్తున్నాము. వీటిని మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకొని, క్యాన్సర్ భారీన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి..

క్యాన్సర్ సెల్స్ ను నాశనం చేసే 10 స్ట్రాంగ్ ఫుడ్స్:

పసుపు:

పసుపు:

ఇండియన్ మసాలా దినుసుల్లో ఒక హెల్తీ ఫుడ్ ఇది. ఇందులో పుష్కలంగా యాంటీఆక్సిడెంట్స్ కలిగి ఉన్నాయి. మీ రెగ్యులర్ ఆహారాల్లో పుసుపును ఎక్కువగా వినియోగించి తీసుకోవడం వల్ల ఇది శరీరంలో మెటాస్టేట్స్ విస్తరించకుండా నివారించగలుగుతుంది(ఇది క్యాన్సర్ కణాలను ఒక అవయవం నుండి మరో అవయవానికి విస్తరింపచేస్తుంది). అటువంటి సందర్బాల్లో పసుపు మెటాస్టేట్స్ ను నివారిస్తుంది.

ద్రాక్ష:

ద్రాక్ష:

రెస్వరట్రోల్ ఫినోలిక్ కాంపౌండ్ ఇది యాంటీయాక్సిడెంట్ పొటెన్షియల్ సమ్మేళనంగా ఉంది. ఇది ప్రతిపక్షకారినిగా పనిచేస్తుంది. గుప్పెడు ద్రాక్షను రెగ్యులర్ గా ప్రతి రోజూ తీసుకొన్నట్లైతే క్యాన్సర్ కణాలతో పోరాడటంతో పాటు, రెడ్ బ్లడ్ సెల్స్ కు తగినంత శక్తిని అంధించడంలో సహాయపడుతుంది.

గ్రీన్ టీ:

గ్రీన్ టీ:

గ్రీన్ టీ వల్ల బరువు తగ్గడం మాత్రమే కాదు, గ్రీన్ టీ తీసుకోవడం వల్ల క్యాన్సర్ సెల్స్ ఏర్పడకుండా నివారించవచ్చు. ఈ డ్రింక్ ను రోజుకు కనీసం రెండు సార్లు తీసుకోవాలి. అంతే కాదు, గ్రీన్ టీ వ్యాధినిరోధకతను పెంచడంలో కూడా సహాయపడుతుంది.

టమోటో:

టమోటో:

టమోటోల్లో కెరోటినాయిడ్స్ మరియు లైకోపిన్ అనే ఔషధగుణగణాలు పుష్కలంగా ఉన్నాయి . ఇవి రెండూ కూడా క్యాన్సర్ సెల్స్ ను నాశనం చేయడంలో గొప్పగా సహాయపడుతాయి. మీ రెగ్యులర్ డైట్ లో టమోటోలను చేర్చుకోవడం వల్ల హార్ట్ డిసీజ్ ను తగ్గిస్తుంది.

 పచ్చికూరలు:

పచ్చికూరలు:

పర్ఫుల్ క్యాబేజ్ క్యాన్సర్ కణాలను త్వరగా నాశనం చేసే బెస్ట్ ఫుడ్ ఇది. ఈ పర్ఫుల్ క్యాబేజ్ చూడటానికి మరియు తినడానికి అంత రుచికరంగా ఉండదని దీన్ని ఎక్కువగా వాడరు. కానీ, ఇందలో ఔషధగుణాలు తెలుసుకొన్నవారు, వీటిని తినకుండా ఉండలేరు.

కలర్ఫుల్ ఫ్రూట్స్:

కలర్ఫుల్ ఫ్రూట్స్:

డార్క్ కలర్ ఫ్రూట్స్ క్యాన్సర్ సెల్స్ తో పోరాడానికి ఉత్తమ ఆహారాలు. ముదురు వర్ణం కలిగిన పండ్లలో దానిమ్మలో ఇండోల్ 3 కార్బినోల్ కలిగి ఉంటుంది. ఇది సెల్స్ లోని డిఎన్ ఎ మరమ్మత్తు చేయడానికి తగినంత శక్తిని అందించడంలో సహాయపడుతుంది. అందువల్ల , క్యాన్సర్ కణాల అభివ్రుద్దిని అడ్డుకుంటుంటంది.

ఉప్పు:

ఉప్పు:

క్యాన్సర్ తో పోరాడే స్ట్రాంగ్ ఫుడ్స్ లో మరో ఆయుధం వంటిది ఉప్పు,ఎందుకంటే కొన్ని పరిశోధన ప్రకారం ఉప్పు కణాల్లో ఒక ప్రవాహంలా చొచ్చుకుపోయి క్యాన్సర్ ను నివారించే శక్తి ఉప్పుకు ఉందంటున్నారు.

 బ్రొకోలీ:

బ్రొకోలీ:

క్యాన్సర్ సెల్స్ ను నాశనం చేయడంలో ఒక ఉత్తమ ఆహారం బ్రొకోలీ. ఈ బిట్టర్ ఫుడ్ లోని సల్ఫోరిపోన్, ఇది శరీరానికి అవసరం అయ్యే ఎంజైములకు రక్షణ కల్పిస్తుంది మరియు శరీరంలో క్యాన్సర్ కు కారణం అయ్యే కెమికల్స్ ను శరీరం నుండి బయటకు నెట్టివేస్తుంది.

వెల్లుల్లి:

వెల్లుల్లి:

ఇది నేచురల్ యాంటిబయోటిక్, క్యాన్సర్ కణాలు ఏర్పడకుండా వెల్లుల్లి అడ్డుకుంటుంది. వెల్లుల్లిని మీ రెగ్యులర్ మీల్స్ లో జోడించడం చాలా మంచిది.

పెప్పర్స్:

పెప్పర్స్:

రెడ్, ఎల్లో మరియు గ్రీన్ పెప్పర్స్ క్యాన్సర్ నివారించడానికి వీటిని తీసుకోవడం చాలా ఉత్తమం. పెప్పర్స్ లో ఉన్నటువంటి ఔషధగుణగణాలు క్యాన్సర్ సెల్స్ ను నివారించడంలో గొప్పగా సహాయపడుతాయి.

Story first published: Monday, August 18, 2014, 17:42 [IST]
Desktop Bottom Promotion