For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరు ఖచ్చితంగా తెలుసుకోవల్సిన కిడ్నీవ్యాధి యొక్క 12లక్షణాలు

By Mallikarjuna
|

చాలా మందికి కిడ్నీ వ్యాధులు సైలెంట్ కిల్లర్స్ అన్న విషయం తెలియదు. కిడ్నీ వ్యాధులున్నప్పుడు, పరిస్థితి చాలా తీవ్రతరం అయ్యేంతవరకూ వ్యాధి యొక్క ఎటువంటి లక్షణాలు బయటపడవు.

కిడ్నీ వ్యాధుల యొక్క లక్షణాలను ప్రారంభ దశలోనే గుర్తించినట్లైతే, వెంటనే తగు జాగ్రత్తలు తీసుకోవచ్చు. అలాగే కొన్ని ఇటువంటి పరిస్థితులు పునరావృత్తం కాకుండా ముందుజాగ్రత్తలు తీసుకోవచ్చు. అలా కిడ్నీ వ్యాధి యొక్క లక్షణాలను గుర్తించడానికి ఈ క్రింది తెలుపబడిన లక్షణాల్లో ఒకటి లేదా రెండు లక్షణాలను గుర్తించినట్లైతే వెంటనే డాక్టర్ సంప్రదించడం వల్ల మూత్రపిండాల సమస్యలను తగ్గించడానికి అవకాశం ఉంటుంది. క్రిడ్నీ సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించినట్లైతే వెంటనే ఈ వ్యాధికి చాలా సమర్థవంతంగా చికిత్సను అందించవచ్చు. మరి కిడ్నీవ్యాధి యొక్క ప్రారంభ లక్షణాలు ఎలా ఉంటాయో చూడండి...

యూరినరీ ఫంక్షన్ లో మార్పులు:

యూరినరీ ఫంక్షన్ లో మార్పులు:

మూత్రపిండాల వ్యాధి యొక్క మొదటి లక్షణం మూత్రంలో హెచ్చతగ్గులు, తరచూ మూత్రవిసర్జనకు వెళ్ళాల్సి రావడం లేదా అసలు మూత్రవిసర్జన చేయకుండుట. అదే విధంగా మూత్రం ఎక్కువగా పోవడం లేదా చాలా తక్కువగా పోవడం. అలాగే రాత్రి సమయంలో ఎక్కువ సార్లు మూత్ర విసర్జనకు పోవాల్సి రావడం. మూత్రం డార్క్ కలర్లో ఉండటం. మీకు మూత్రవిసర్జనకు వెళ్లాలినిపిస్తుంది కానీ, వెళ్ళరు.

మూత్రవిసర్జన సమయంలో కష్టంగా ఉండటం :

మూత్రవిసర్జన సమయంలో కష్టంగా ఉండటం :

కొన్ని సందర్భాల్లో మూత్రవిసర్జన సమయంలో అసౌకర్యంగా లేదా కష్టంగా అనిపిస్తుంది. అటువంటి నొప్పి, బాధకు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ లక్షణాలు కూడా నొప్పికి మరియు మూత్రం విసర్జించే సమయంలో మంటకు గురిచేస్తాయి. ఈ ఇన్ఫెక్షన్ కిడ్నీలకు వ్యాప్తి చెందితే అప్పుడు, జ్వరం మరియు బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉండటం లక్షణాలు కనిపించవచ్చు.

మూత్రంలో రక్తం:

మూత్రంలో రక్తం:

కిడ్నీ వ్యాధులకు ఆందోళకు గురిచేసే ఒక ఖచ్చితమైన కారణం మూత్రంలో రక్తం కనిపించడం ఇది ఒక ప్రధాన లక్షణం. ఇతర కారణాలు కూడా ఉండవచ్చు. ఎందుకైన మంచిది, డాక్టర్ ను సంప్రదించాల్సి ఉంటుంది.

వాపు:

వాపు:

కిడ్నీలు మన శరీరంలో వ్యర్థాలను మరియు అదనపు నీటిని తొలగిస్తుంది. అలా సమయానికి వాటిని తొలగించలేనప్పుడు, ఈ అదనపు నీరు మీ చేతులు, పాదాలు మరియు ముఖంకు చేరి వాపుకు గురిచేస్తుంది.

తీవ్రమైన అలసట మరియు సాధారణీకరించిన బలహీనత:

తీవ్రమైన అలసట మరియు సాధారణీకరించిన బలహీనత:

ఎరిత్రోపోయిటిన్ అనే హార్మోన్ ను కిడ్నీలు ఉత్పత్తి చేస్తాయి, ఇది ఎర్రరక్తకణాలు ఆక్సిజన్ సరఫరా చేయడానికి సహాయపడుతాయి. కిడ్నీల్లో ఎరిత్రోపోయిటిన్ తక్కువగా ఉన్నప్పుడు రెడ్ బ్లడ్ సెల్స్ ను తగ్గిస్తాయి. ఫలితంగా రక్తహీనతకు గురిచేస్తుంది. రక్తంలో ఆక్సిజన్ సరఫరా తగ్గినప్పుడు నీరసం మరియు తీవ్రమైన అలసటకు గురిచేస్తుంది.

మైకము & అసమర్థత దృష్టి:

మైకము & అసమర్థత దృష్టి:

రక్తహీనత కిడ్నీవ్యాధులతో సంబంధం కలిగి ఉండటం వల్ల మెదడుకు సరైన రక్తం, ఆక్సిజన్ సరఫరా క్షీణించడం వల్ల నీరసం, అలసట, మెదడు యొక్క ఏకాగ్రతకు ఇబ్బంది కలిగిస్తుంది.

అన్ని సమయాల్లో చల్లగా అనిపించడం:

అన్ని సమయాల్లో చల్లగా అనిపించడం:

కిడ్నీ వ్యాధులతో మీరు బాధపడుతున్నట్లైతే, మీకు చల్లగా అనిపిస్తుంటుంది. మీ చుట్టు ప్రక్కల వాతావరణం వేడిగా ఉన్నా, రక్తహీనత వల్ల ఇటువంటి భావన కలిగినప్పుడు ఫిలోనిఫైరిట్స్ (కిడ్నీ ఇన్ఫెక్షన్) వల్ల చలి మరియు జ్వరం కు గురిచేయవచ్చు.

చర్మం దద్దర్లు మరియు దురద:

చర్మం దద్దర్లు మరియు దురద:

కిడ్నీ ఫెయిల్యూర్ అయినప్పుడు మీ రక్తంలో వ్యర్థాల ఏర్పాటుకు కారణం అవుతుంది. ఇది చర్మం దద్దుర్లకు మరియు దురదకు కారణం అవుతుంది.

అమ్మోనియా శ్వాస మరియు మెటాలిక్ టేస్ట్:

అమ్మోనియా శ్వాస మరియు మెటాలిక్ టేస్ట్:

మూత్రపిండాలు విఫలం చెందినప్పుడు రక్తంలో యూరియా ను పెంచుతుంది. ఈ యూరియా లాలాజంలోని అమ్మోనియాను విచ్ఛిన్నం చేస్తుంది, దాని కారణంగా చెడు శ్వాసకు( దీన్నే అమ్మోనియా బ్రీత్ అనికూడా పిలుస్తారు) కారణం అవుతుంది. అలాగే మెటాలిక్ టేస్ట్ ను కలిగి ఉంటుంది.

వికారం మరియు వాంతులు:

వికారం మరియు వాంతులు:

మూంత్రపిండాల వ్యాధి మీ రక్తంలో వ్యర్థపదార్థాల ఏర్పాటు వల్ల వికారం మరియు వాంతులకు కారణం కావచ్చు.

శ్వాసలో ఇబ్బందులు:

శ్వాసలో ఇబ్బందులు:

కిడ్నీ వ్యాధుల వల్ల ఊపిరితిత్తుల్లో నీరు చేరుటకు కారణమవుతుంది. మరియు రక్తహీనత కిడ్నీ వ్యాధులకు ఒక సాధారణ సైడ్ ఎఫెక్ట్. ఈ కారణాల వల్ల మీ శ్వాసలో ఇబ్బందులు ఉండవచ్చు .

వెన్నులో లేదా సైడ్ లో నొప్పి ఉండవచ్చు:

వెన్నులో లేదా సైడ్ లో నొప్పి ఉండవచ్చు:

కొన్ని సందర్భాల్లో మూత్రపిండాల వ్యాధి వల్ల నొప్పికి కారణం కావచ్చు, కిడ్నీలో రాయి ఉందనుకోండి లోయర్ బ్యాక్ పెయిన్ నుండి గజ్జదిగువల భాగం లోకిని వ్యాప్తిం చెంది ఒక తీవ్రమైన తిమ్మరి నొప్పికి గురిచేస్తుంది . అలాగే పాలీసిస్టిక్ కిడ్నీ డిసీజ్ , వారసత్వ మూత్రపిండాల లోపంతో కూడా సంబంధం కలిగి ఉండవచ్చు.

Desktop Bottom Promotion