For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హెర్నియా రావటానికి 8 ముఖ్యమైన కారణాలు

By Lakshmi Perumalla
|

నిజానికి మాకు హెర్నియా గురించి ఏమి తెలియదు. ఎక్కువ మంది కణజాల ద్రవ్యరాశి లేదా క్రొవ్వు ఎక్కువగా పెరుగుట వలన వస్తుందని భావిస్తారు. అయితే వైద్యులు ప్రకారం,హెర్నియా కారణంగా శరీరం యొక్క బయటి గోడల వైపు అంతర్గత శరీర అవయవాలు చొచ్చుకొని వస్తాయి. సాధారణంగా ఇటువంటి అసాధారణత కండరాల బలహీనత వల్ల ఏర్పడుతుంది.

అనేక సందర్భాల్లో,హెర్నియా లక్షణాలు దిగువస్థాయిలో ఉన్నప్పటికీ,సమస్యలకు కారణం కావు. కానీ ఇది తీవ్రమైన సందర్భాలలో ప్రాణాంతకంగా పరిణమించవచ్చు. అయితే చాలా తరచుగా హెర్నియా అనేది శస్త్రచికిత్స తరువాత అభివృద్ధి చెందవచ్చు. కానీ వైద్యులు హెర్నియా ద్వారా ఏర్పడే కొన్ని ఇతర అంశాలను గుర్తించారు. ఆ అంశాలు కింద ఉన్నాయి.

 causes of hernia you should always know

1.కణజాల నష్టం
కణజాలంలో గాయాల కారణంగా తరచుగా హెర్నియా అభివృద్ధి జరుగుతుంది. కణజాల నష్టం వలన అంతర్గత అవయవాలు సులభంగా ప్రొజెక్షన్ కోసం మార్గం బలహీన పరుస్తుంది. తద్వారా సమస్యకు దారితీస్తుంది.

2.ఎక్కువ వయస్సు
యువకులతో పోలిస్తే పెద్దవారిలో హెర్నియా ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. దానికి గల కారణం కండరాలు(ఉదరం యొక్క కండరాలతో సహా),వయస్సు ప్రభావం తో బలహీనపడి అంతర్గత అవయవాలు చొచ్చుకొని రావటానికి వీలు కల్పిస్తుంది.

3.జెండర్
ఆడవారితో పోలిస్తే మగవారిలో హెర్నియా అభివృద్ధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చాలా సందర్భాలలో, పురుషుల గజ్జ ప్రాంతంలో హెర్నియా అభివృద్ధి ఎక్కువగా ఉంటుంది. పురుషుల్లో గజ్జ కండరాలు బలహీనంగా ఉండుట వలన హెర్నియా అభివృద్ది జరుగుతుంది.

4. శస్త్రచికిత్స విధానం
పోస్ట్ ఆపరేటివ్ హెర్నియా సర్వసాధారణం. మహిళలు(ఉదర సంబంధ శస్త్రచికిత్స చేయించుకున్న) వారి జీవితంలో ఏదో ఒక సమయంలో హెర్నియా అభివృద్ధి అవకాశం ఉంటుంది. దీనిని గంటు హెర్నియా అని అంటారు. సాదారణంగా ఈ రకమైన హెర్నియా లావుపాటి మహిళలు అభివృద్ధి చెందుతుంది.

5. పుట్టుకతో వచ్చే లోపాలు
సాదారణంగా పుట్టిన తర్వాత నావికా ప్రాంత సమీపంలో గుబ్బ కూడా వరిబీజంనకు కారణం కావచ్చు. ఈ రకమైన పుట్టుకతో వచ్చిన హెర్నియా ఉదర గోడ అభివృద్ధికి దారితీస్తుంది.

6. మలబద్దకం
మీరు దీర్ఘకాల మలబద్ధకంతో బాధపడుతూ ఉంటే,మీరు మలం విసర్జించే సమయంలో మరింత ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ భారీ ఒత్తిడి హెర్నియాకు దారితీస్తుంది. అలాగే మృదువైన ఉదర కణజాలాలకు గాయం కావచ్చు.

7. జన్యు కారకం
పరిశోధకులు కండరాల బలహీనత జన్యుపరంగా వారసత్వంగా వస్తుందని గుర్తించారు. అందువల్ల,ఇటువంటి పరిస్థితితో అతని దగ్గరి బంధువులు బాధపడితే హెర్నియా అనేది వాళ్ళకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

8. ఊబకాయం
కొవ్వు అధికంగా పేరుకుపోయి ఉదర కండరాల పైన ఎక్కువగా సాగుతుంది. అలాగే వాటిని
నెమ్మదిగా క్షీనింపచేస్తుంది. బలహీనపడిన కండరాలు హెర్నియా అభివృద్ధికి ఒక కారణంగా ఉన్నాయి.

Desktop Bottom Promotion