For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పురుషులు నిర్లక్ష్యం చేయకూడని క్యాన్సర్ లక్షణాలు

|

క్యాన్సర్ ఒక ప్రాణాంతకమైన వ్యాధి అన్నవిషయం అందరికీ తెలిసిన విషయమే. అయితే, ఈ ప్రాణాంతకమైన వ్యాధి లక్షణాలు మాత్రం చాలా తక్కువగా ఉంటాయి. ఖచ్చితంగా ఇది ఒక క్యాన్సర్ యొక్క లక్షణం అని చెప్పడం చాలా కష్టం అవుతుంది. అయితే కొన్ని ప్రత్యేకమైన క్యాన్సర్ లక్షణాలను పురుషులు ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదు. క్యాన్సర్ లక్షణాలు మహిళల్లో కంటే పురుషల్లో చాలా డిఫరెంట్ గా ఉంటాయి.

సాధారణంగా మహిళల్లో కంటే పురుషుల్లో చాలా సాధారణంగా వచ్చే వివిధ రకాల క్యాన్సర్లను గురించి మీకు తెలిసుంటుంది. ఉదాహరణకు, లంగ్ (ఊపిరితిత్తుల)క్యాన్సర్. ఈ క్యాన్సర్ మహిళల్లో కంటే పురుషుల్లో చాలా సాధారణంగా ఎక్కువగా కనిపించి క్యాన్సర్ ఇది. పురుషుల్లో ఇలా సాధారణంగా కనిపించే క్యాన్సర్లో మరో క్యాన్సర్ ప్రొస్టేట్ క్యాన్సర్. ఇది పురుషలకు మాత్రమే వస్తుంది. అందువల్ల, పురుషుల తప్పనిసరింగా కొన్ని క్యాన్సర్ లక్షణాలను తెలుసుకోవడం చాలా అవసరం.

ఊపిరితిత్తుల క్యాన్సర్ : ప్రారంభ లక్షణాలు:క్లిక్ చేయండి

ప్రత్యేకంగా పురుషుల్లో కనబడే కొన్ని క్యాన్సర్ లక్షణాలు, అస్పష్టంగా ఉన్నాయి. ఒక్కో సందర్భంలో ఒళ్ళు నొప్పులు కూడా క్యాన్సర్ కలిగి ఉందని తెలిపే లక్షణాల్లో ఒకటిగా భావిస్తారు. అయితే, అన్ని రకాల ఒళ్ళు నొప్పులూ క్యాన్సర్ కు లక్షణాలు కాదని సూచిస్తుంది. ఇక్కడ ట్రిక్స్ ఏంటేంట్ లక్షణాలను గుర్తించాలి కానీ, క్యాన్సర్ వ్యాధి ఉన్నట్లు భ్రమపడటం కంటే ఈ క్రింది లక్షణాల ద్వారా నిర్ధారించుకోవడం ఉత్తమం...

బాడీ పెయిన్:

బాడీ పెయిన్:

ప్రస్తుత రోజుల్లో చాలా చిన్న వయస్సులో ఉన్నవారు కూడా ఒళ్ళు నొప్పులతో బాధపడుతున్నట్లు ఫిర్యాదులు చేస్తుంటారు. అయితే ఇటువంటి లక్షణాలు, అనారోగ్యకరమైన జీవనశైలితో కూడా రావచ్చు. మీరు నిరంతరం, స్థిరంగా అటువంటి బాడీ పెయిన్ తో బాధపడుతుంటే, మీరు ఖచ్చింతగా బోన్ క్యాన్సర్ ఉన్నదేమో ఒక సారి చెక్ చేయించుకోండి.

డైట్ లేదా వ్యాయామం లేకుండా బరువు తగ్గడం:

డైట్ లేదా వ్యాయామం లేకుండా బరువు తగ్గడం:

సాధారణంగా మహిళల్లాగ, పురుషులు బరువు తగ్గించుకోవడం కోసం డైట్ ను అనుసరించరు. కాబట్టి పురుషుల్లో, డైట్-వ్యాయామాలు వంటివి లేకుండా సడెన్ గా బరువు తగ్గడం జరిగితే తప్పకుండా సల్ప్ చెక్ చేసుకోవాలి.

బ్రెస్ట్ మాస్:

బ్రెస్ట్ మాస్:

మీకు తెలుసా? పురుషులు కూడా బ్రెస్ట్ క్యాన్సర్ తో బాధపడుతున్న వారు చాలా మందే ఉన్నారు. బ్రెస్ట్ మాస్ పెరుగడం, నిప్పల్స్ చుట్టూ మార్పులు లేదా నిప్పల్స్ నుండి ఏదైనా డిసర్జ్ వంటి లక్షణాలు కనబడితే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి.

టెస్టిక్యులర్ మార్పుల:

టెస్టిక్యులర్ మార్పుల:

టెస్టిక్యులర్స్(వృషణాలు) బరువుగా తెలిసినప్పుడు. ఒకదాని కంటే మరొకటి బరువుగా గుర్తించినప్పుడు(క్యాన్సర్) కు ప్రారంభ లక్షణంగా గుర్తించాలి. వెంటనే డాక్టర్ ను సంప్రధించాలి.

డిప్రెషన్:

డిప్రెషన్:

ముఖ్యంగా మహిళల్లో హార్మోనుల ప్రభావం వల్ల డిప్రెషన్ కు లోనవుతుంటారు. మీ పాట్నర్ తో సంతోషకరంగా జీవించలేనప్పుడు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ గా గుర్తించాలి.

ప్రక్కటెముకల క్రింద ఎక్కువగా నొప్పిగా ఉన్నప్పుడు:

ప్రక్కటెముకల క్రింద ఎక్కువగా నొప్పిగా ఉన్నప్పుడు:

పురుషులు మహిళల్లో కంటే ఎక్కువగా ఊపిరితిత్తుల క్యాన్సర్ తో బాధపడుతారు. మీరు సిగరెట్ త్రాగే వారైతే మీ శరీరంలో పక్రటెముకలు క్రింది భాగంలో సూటిగా నొప్పి మరియు శ్వాసతీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటే, డాక్టర్ చెకప్ తప్పనిసరి.

అలసట:

అలసట:

నపుంసకత్వం మరియు వివాహ సమస్యలు ఇలా ఒకదానికొకటి సంబంధం కలిగి ఉంటాయి. మీ బిజీ షెడ్యూల్లో ఇటువంటి సమస్యలు మీరు ఎదుర్కోవచ్చు. అయితే నిజానికి ఇలా నిరంతరం అలసటకు గురౌతుంటే బ్లడ్ క్యాన్సర్ కు చిహ్నాలలో ఒకటిగా గుర్తించాలి.

యూరిన్ లో బ్లడ్:

యూరిన్ లో బ్లడ్:

ప్రొస్టేట్ క్యాన్సర్ పురుషుల్లో అత్యంత ప్రాణాంతకమైన వ్యాది. పురుషల అండర్ వేర్ లో ఏదైన బ్లడ్ స్పాట్స్ లేదా రాషెస్ కనిపించినప్పడు వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి.

అజీర్తి మరియు పొత్తికడుపులో నొప్పి:

అజీర్తి మరియు పొత్తికడుపులో నొప్పి:

క్రోనిక్ ఇన్ డైజషన్ మరియు అబ్డోమినల్ పెయిన్, కడుపు నొప్పి వంటివి ప్యాంక్రియటిక్ క్యాన్సర్ లక్షణాల్లో ఒకటి . ఈ క్యాన్సర్ ముక్యంగా స్మోకింగ్ వల్ల వస్తుంది.

యూరినరీ సమస్యలు:

యూరినరీ సమస్యలు:

తరచూ మూత్రవిసర్జన, మూత్రపిండాల సామర్థ్యం కోల్పోవడం వంటి సమస్యలు అడ్వాస్ ఏజ్ లోనే ఎదుర్కొంటే, తప్పని సరిగా డాక్టర్ ను సంప్రదించాలి.

English summary

Cancer Symptoms That Men Shouldn’t Ignore

Cancer is a disease that has very few conclusive symptoms. It is hard to say that this one particular thing is a sign of cancer. But men should not ignore these signs because if they do, it might be too late to treat their malignancy. Symptoms of cancer in males are different from those of females.
Desktop Bottom Promotion